కేసీఆర్‌కు టీటీడీపీ ఎస్సీసెల్ లేఖ
సాక్షి, హైదరాబాద్: భూమి లేని దళితుల కు మూడెకరాలు పంపిణీ చేయాలని, లేదా వారి కుటుంబాలకు రూ.21 లక్షల చొప్పున ఇవ్వాలని టీటీడీపీ ఎస్సీసెల్ డిమాండ్ చేసింది. రుణాలిచ్చేందుకు ఎం పికైన ఎస్సీ నిరుద్యోగులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీని విడుదల చేయాలని కోరుతూ గురువారం టీటీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.యాభై ఏళ్లు పైబడి కులవృత్తుల్లో ఉన్న దళితులకు రూ.2వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశ, గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్లకు చట్ట ప్రకారం రూ.15 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఎస్సీలకు భూమి ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నా బడ్జెట్ లేదనే సాకుతో దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు.
భూమి లేని దళితులకు మూడు ఎకరాలివ్వాలి
Published Fri, Sep 16 2016 3:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement