
'సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారు'
వరంగల్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. వరంగల్ పట్టణంలో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో పాలన బాగుంటే కేసీఆర్ కార్పొరేషన్ ఎన్నికలను ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తుచేశారు.