హైదరాబాద్: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. కేంద్ర కరువు బృందాన్ని మంగళవారం నాడు టీటీడీపీ నేతలు సచివాలయానికి వెళ్లి కలిశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వల్లే రాష్ట్ర రైతులు నష్టపోయారని విమర్శించారు. పంటల బీమాను పెంచడంతో పాటు ఉపాధి హామీ రోజులను పెంచాలని ఎర్రబెల్లి దయాకరరావు కేంద్ర కరువు బృందాన్ని కోరినట్లు ఈ సందర్భంగా వివరించారు.