
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.