nagarjuna sagar assembly constituency
-
KCR Strategy: సాగర్ బరి.. ‘సార్’ గురి!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.. చేదు అనుభవాలను అధిగమించింది.. తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంటోంది. దుబ్బాక, గ్రేటర్ ఫోబియా నుంచి బయటపడి విజయాలబాట పట్టింది. నాగార్జున సాగర్ తీరాన మళ్లీ షి‘కారు’చేస్తోంది.. ఇటీవలి శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సవాళ్లను దీటుగా ఎదుర్కొని సానుకూల ఫలితాన్ని సాధించింది. తాజాగా సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్కు గెలుపు టానిక్ అందించింది. దీని వెనుక ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేసిన పక్కా ప్లాన్ ఉంది. పటిష్ట వ్యూహం ఉంది. ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే పార్టీ యంత్రాంగం సన్నద్ధత, సమన్వయానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతీరు పునరావృతం కాకుండా సాగర్ ఉపఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. చదవండి: (సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం) నివేదికలు.. సర్వేలు.. సన్నద్ధత గత ఏడాది డిసెంబర్ రెండోవారం నుంచే సాగర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన కేసీఆర్ టీఆర్ఎస్ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు. సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య, పార్టీ సంస్థాగత బలం, కాంగ్రెస్, ఇతర పార్టీల బలాబలాలు వంటి అంశాలను లోతుగా విశ్లేషించి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే సాగర్ ఉపఎన్నిక జరుగుతుందనే అంచనాతో సుమారు నాలుగు నెలల ముందు నుంచే పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మండలాలవారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో సాగర్ ఉప ఎన్నికల ప్రచారాన్ని కూడా అంతర్భాగం చేశారు. చురుకైన ఎమ్మెల్యేలు.. మెరుగైన ప్రచారం.. సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదే సామాజికవర్గాల ఎమ్మెల్యేలతోపాటు కొందరు చురుకైన ఎమ్మెల్యేల బృందానికి ప్రచార, సమన్వయబాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, శంకర్‌నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఎన్.భాస్కర్‌రావు, కోరుకంటి చందర్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులను సాగర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ వివిధవర్గాల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల వివరాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించారు. బహిరంగ సభల్లో వాటి పరిష్కారాలకు కేసీఆర్ హామీనిచ్చారు. అభ్యర్థి ఎంపిక.. విపక్షాలకు ముకుతాడు నర్సింహయ్య కుమారుడు భగత్‌తోపాటు సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డి, మరో అరడజను మంది నేతలు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే, అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత భగత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతోపాటు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. జానా రెడ్డి నుంచి గట్టిపోటీ తప్పదని గ్రహించిన కేసీఆర్ ఆయనకు పట్టు ఉన్న సామాజికవర్గాలు, గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండబోదని ముందే అంచనాకు వచ్చిన కేసీఆర్ ఆ పార్టీని మరింత బలహీనపర్చాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన కడారి అంజయ్య యాదవ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకొని కమలనాథులను ఆత్మరక్షణలోకి నెట్టారు. తన ప్రసంగాల్లో ఎక్కడా బీజేపీ పేరును ప్రస్తావించని కేసీఆర్, ఆ పార్టీకి డిపాజిట్ దక్కకుండా చేసి ‘సాగర్’వేదికగా చావుదెబ్బ కొట్టాలని భావించారు. ఈ మేరకు బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేశారు. దుబ్బాక, గ్రేటర్ హైదరా బాద్ ఫలితాలతో తలెత్తిన ఫోబియా నుంచి పార్టీ ని బయటకు తేవడంలో కేసీఆర్ సఫలమైనట్లు సాగర్ ఉపఎన్నిక ఫలితంతో తేటతెల్లమైంది. చదవండి: (సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం) -
సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో గులాబీ మళ్లీ గుబాళించింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో అది తన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని అది నిలబెట్టుకున్నట్లు అయింది. గత నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా రెండు వారాల తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. చేజారిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు, తొలిసారి ఉనికి చాటుకోవాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ తరఫున గెలిచిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా నర్సింహయ్య తనయుడు భగత్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత కె.జానారెడ్డికి ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ ఎన్నికలో మొత్తం 2,20,206 ఓట్లకుగాను 1,90,861 ఓట్లు పోలయ్యాయి. నోముల భగత్‌కు 89,804 ఓట్లు, జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ 18,872 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలుపొందింది. కేవలం 7,676 ఓట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ మొత్తంగా 41 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 1,714 ఓట్లు వచ్చాయి. కాగా, నోటాకు 498 ఓట్లు పడ్డాయి. ‘జానా’కు నాలుగో ఓటమి తాజా ఓటమితో జానారెడ్డి తన రాజకీయ జీవితంలో ఇప్పటికీ నాలుగుసార్లు అపజయం పొందినట్లు అయింది. జానారెడ్డి వరుసగా రెండుసార్లు పరాజయం పాలవడం గమనార్హం. తన రాజకీయ జీవిత చరమాంకంలో ఆయనకు ఇది ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. తొలిసారి 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోగా, 1994లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండోసారి, 2018 ఎన్నికల్లో మూడోసారి ఓటమి పాలయ్యారు. ఆయన విజయాల సంఖ్య ఏడు కాగా, ఓటముల సంఖ్య నాలుగుగా నమోదైంది. చదవండి: (సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం) యాదవుల ఓట్లపై కన్ను.. తలసానికి బాధ్యత ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌ను బరిలోకి దించిన నేపథ్యంలో వారి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు తలసాని సాగర్‌లో మకాం వేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల యాదవ సంఘాల నేతలతో సమావేశమై పూర్తి మద్దతును కూడగట్టారు. ఆయా కుల, ఉద్యోగ సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏ వర్గాన్నీ విస్మరించకుండా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. భగత్ అత్యధిక మెజారిటీ సాధించడానికి ఇవన్నీ దోహదం చేశాయని చెప్పవచ్చు. ఫలించిన .. సీఎం కేసీఆర్ వ్యూహం దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో సాగర్‌లో విజయం కోసం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రూపొందించారు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందనగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనీసం నెలన్నర ముందు నుంచే పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. ఎమ్మెల్యేను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాలకు పంపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు పేరున విస్తృతంగా ప్రచారం చేసింది. మండలాల ఇన్‌చార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలు (మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు) అభ్యర్థి పేరును ప్రకటించేసరికే పల్లెపల్లెనా తిరిగారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అభ్యర్థి భగత్ వెన్నంటే ప్రచారం చేశారు. ఉపఎన్నిక అనివార్యమయ్యాక ఫిబ్రవరిలో ఒకసారి, ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 14న మరోసారి సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. -
సాగర్ తీర్పు: జానారెడ్డి షాకింగ్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వయసురీత్యా రాజకీయాల నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలిపారు. తనకు ఇప్పుడు 75 ఏళ్లు ఉన్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటిం చారు. తనకు రాజకీయాలపై వైరాగ్యం లేదంటూనే, ఇంకా తాను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడినని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. తనపై విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను అభినందించారు. ఆదివారం సాగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు, ప్రజాస్వామ్య విలువల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కోల్పోయింది ఏమీ లేదన్నారు. మున్ముందు ఎన్నికలు కూడా ఇలాగే ఉంటాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చదవండి: (సాగర్ టీఆర్ఎస్దే.. ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం) వైరాగ్యం ఏమీ లేదు.. 20 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 11 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని జానారెడ్డి తెలిపారు. అయినా తనకు రాజకీయాలపై విరక్తి, వైరాగ్యం లేవని చెప్పారు. బీజేపీని నిర్మించిన ఎల్కే అద్వానీ లాంటి నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. తాను నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయలేదనడంలో వాస్తవం లేదని, తాను శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. తాత్కాలిక పథకాల వల్ల అభివృద్ధి జరగదనే విషయం కొంత కాలం తర్వాత ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాను తన బయో గ్రఫీ రాసుకోనని, ఎవరైనా రాసేందుకు ముందుకు వస్తే అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. అది హైకమాండ్ చూసుకుంటుంది టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ ఇష్టమని, అధ్యక్ష ఎంపిక వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పార్టీ శ్రేణులన్నీ కలసి పనిచేశాయని చెప్పారు. అటు టీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేసినా కాంగ్రెస్ సత్తా చాటిందని వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ శ్రేణులు మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా నెమ్మదించిన తర్వాత అందర్నీ కలుస్తానని చెప్పారు. -
సీఎం కేసీఆర్‌కు షర్మిల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఈమేరకు ఆమె తన ట్విట్టర్ ఖా తాలో ట్వీట్‌చేశారు. ‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామని షర్మిల అన్నారు. -
నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం
-
జానాకు షాక్.. ఒక్కరౌండ్‌లో మాత్రమే...!
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటి వరకు కేవలం ఒక్క 14వ రౌండ్లో మాత్రమే ఆధిక్యంలోకి వచ్చారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్ఎస్ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుత కౌంటింగ్ సరళి చూస్తుంటే కారు పార్టీకి షాకిస్తామని ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్ చతికిలపడ్డట్టు స్పష్టమవుతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన నిజం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజారీటీతో దూసుపోతున్నారు. నోముల భగత్‌ను వ్యూహాత్మంగా సాగర్ బరిలో దించిన టీఆర్ఎస్ ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్‌పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీచ్చిన బీజేపీ సాగర్‌లో గెలవాలని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్ బలం ముందు కాషాయదళం తేలిపోయింది. ఇప్పటివరకు 19 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా ఒక్క రౌండ్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. టీఆర్ఎస్ 14వేల ఓట్ల మెజారీతో తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో పాగా వేసేందుకు మరోసారి సిద్ధమైంది! -
నాగార్జున సాగర్: తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం
-
నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపు
లైవ్ అప్డేట్స్: నాన్న గారి ఆశయాలను నెరవేరుస్తా:నోముల భగత్ ► నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ మీడియాతో స్పందించారు. ‘నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న గారి ఆశయాలను కచ్చితంగా నెరవేస్తున్నాన’ని నోముల భగత్ తెలిపారు. నా గెలుపుకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు. ► నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. 25వ రౌండ్ ముగిసేసరికి 18,449 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 394 ఓట్ల ఆధిక్యం ఉంది. మొత్తం 1384 కాగా, చెల్లనివి 51, టీఆర్ఎస్ 822, కాంగ్రెస్ 428, బీజేపీ 30, టీడీపీ 06 ఓట్లు సాధించాయి. ►25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 18449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 2443, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 35 ఓట్లు ►24వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 18414 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3312, కాంగ్రెస్‌కు 2512 ఓట్లు వచ్చాయి. 24వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 800 ఓట్లు ►23 వ రౌండ్లో టీఆర్ఎస్ 849 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ17,61 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ► 22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 16765 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3783, కాంగ్రెస్ 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1243 ఓట్లు. ► 21వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 15,522 ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో కాంగ్రెస్ 3011, టీఆర్ఎస్కు 3463 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 452 ఓట్ల లీడ్‌లో ఉంది. ► 20వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 15070 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3740, కాంగ్రెస్‌కు 3146 ఓట్లు వచ్చాయి. 20వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 594 ఓట్లు ► టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతుంది. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 14476 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3732, కాంగ్రెస్‌కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1080 ఓట్లు. ► 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్లో టిఆర్ఎస్కు 4074, కాంగ్రెస్‌కు 2259 ఓట్ల వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1851 ఓట్లు. ► 17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 11581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 17వ రౌండ్లో టీఆర్ఎస్కు 3772, కాంగ్రెస్‌కు 2349 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1423 ఓట్లు. ► 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 10158 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ టీఆర్ఎస్కు 3475, కాంగ్రెస్‌కు 3231ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 244 ఓట్లు. తెలంగాణ భవన్: చలవపందిరికి మంటలు ► సాగర్ ఎన్నికల్లో విజయం దిశగా టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో చలవ పందిరికి నిప్పురవ్వ అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను ఆర్పారు. సాగర్ టీఆర్ఎస్ ఫలితాల నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్వీట్లు తినిపించుకున్నరు. Time 12.20 ► 15వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 9914 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 15వ రౌండ్లో టీఆర్ఎస్కు 3203, కాంగ్రెస్‌కు 2787ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 416 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ మొత్తం 9498 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 14వ రౌండ్లో టీఆర్ఎస్కు 2734, కాంగ్రెస్‌కు 3817 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్లో కాంగ్రెస్ లీడ్ 1083 ఓట్లు. ► 13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 10581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 13వ రౌండ్లో టీఆర్ఎస్కు 3766, కాంగ్రెస్‌కు 3546 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 220 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. వరుసగా 12వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. 12వ రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ► టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 9106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టిఆర్ఎస్కు 3395, కాంగ్రెస్‌కు 2225 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1170 ఓట్లు. Time 11.20 ► పదో రౌండ్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. పదో రౌండ్ ముగిసేసరికి 7,963 ఓట్ల ఆధిక్యంలో భగత్(టీఆర్ఎస్). ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 7948 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్లో టీఆర్ఎస్కు 3249, కాంగ్రెస్‌కు 1893 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1356 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఏడో రౌండ్ ముగిసేసరికి 6,592 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ఉన్నారు. Time 10.20 ► నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 5177 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 3989, కాంగ్రెస్‌కు 3049 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 940 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 4334 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. నాలుగో రౌండ్లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యం. మూడో రౌండ్లో టీఆర్ఎస్కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు వచ్చాయి. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. రెండో రౌండ్లో ఆధిక్యంలో టీఆర్ఎస్. 2216 ఓట్లతో నోముల భగత్ ముందంజ ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. తొలి రౌండ్లో 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్). తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి. ► తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 147 ఓట్లతో ఆధిక్యం కనబరుస్తోంది. ► మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ► నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ► నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ పక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి ఈవీఎం మిషన్లను అధికారులు శానిటైజేషన్ చేశారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్స్‌కు అధికారులు తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్ఓ రోహిత్ సింగ్, కేంద్ర పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్ సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచారు. కౌంటింగ్ కేంద్రానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివా రం ఉదయం 8 గం.కు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబం ధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే 400 మంది సిబ్బందితో పాటు 300 మంది పోలీసులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నెగెటివ్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తామని ఈసీ ప్రకటించింది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వేర్వేరు హాళ్లలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు. -
నోముల భగత్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు -
ఎస్.. మేమంటే.. మేమే!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగా, ఓట్లపరంగా కూడికలు, తీసివేతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తించిన ఈ ఉపఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 2న ఫలితం తేలేదాకా ‘సాగర’మథనం సశేషమే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయాపార్టీల నేతలు ఓట్ల లెక్కల్లో బీజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకుతోడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడిని బరిలో నిలపడం, రెండుసార్లు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రావడం, పార్టీ అభ్యర్థి ప్రకటనకు ముందు నుంచే నేతలందరూ సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం లాంటి అంశాల ప్రాతిపదికన తమ అభ్యర్థి భగత్ విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చి చివరిక్షణం వరకు అంచనాలు అందలేని స్థాయిలో తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించిన సీనియర్ నేత, పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి చరిష్మాపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో జానా మార్కుకు తోడు పార్టీకి బలమైన కేడర్ ఉండటం, సంప్రదాయ ఓటుబ్యాంకు చెక్కుచెదరకపోవడం, పెద్దాయన అనే సానుభూతి, గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా నిలిచిన కొన్ని సామాజిక వర్గాల ఓట్లలో చీలిక లాంటి లెక్కలతో ఈసారి గెలిచి గట్టెక్కుతామనే అభిప్రాయం టీపీసీసీ నేతల్లో కనిపిస్తోంది. ఇక, జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్‌ను నిలిపిన కమలనాథులు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు సాధిస్తామని, ఆ రెండు పార్టీలకు ముచ్చెమటలు పోయించామని భావిస్తోంది. పోలింగ్ శాతం పెరగడంపై ఆశలు 2018 అసెంబ్లీ ఎన్నిక తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోలింగ్ 85శాతంకు పైగా నమోదు కావడం తమకు అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గత ఎన్నికల్లో 7771 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన టీఆర్ఎస్ ప్రస్తుతం మూడింతలు మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉంది. దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య మరణం తర్వాత ఆలస్యం చేయకుండా బరిలోకి దిగి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడం, అభ్యర్థి ఎంపికతో సంబంధం లే కుండానే పార్టీ ఇన్చార్జీల నేతృత్వంలో ముందస్తు ప్రచారం చేపట్టడం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో తమకు అండగాలేని సామాజికవర్గాల్లో చీలిక రావడంతోపాటు ఆయా సామాజికవర్గాలు గతం కన్నా ఈసారి తమవైపు మొగ్గు చూపారని కాంగ్రెస్ భావిస్తోంది. భారీ మొత్తంలో కాకపోయినా కనీసం5–7 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకుంటామని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు తమను ఆదరిస్తారని బీజేపీ భావి స్తోంది. స్వతంత్ర అభ్యర్థులెవరూ చెప్పుకోదగినస్థాయిలో ఓట్లు దక్కించుకునే అవకాశం లేదని పోలింగ్ సరళి వెల్లడిస్తోంది.మొత్తంమీద సాగర్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారుతుందనడంలో సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: ‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు! -
‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ ఉపఎన్నికలో 86.2 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్ కావడంతో 86.46 శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగింది. ఓట్లు వేయించడంలోనూ పోటాపోటీ ఇరు పార్టీలకు ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యంగా మారడంతో ఎన్నికల ప్రచారంలో పోటీ పడినట్లే.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించడలోనూ పోటీ పడినట్లే కన్పించింది. దీంతో పోలింగ్ జోరుగా సాగింది. ప్రతి ఓటును కీలకంగా భావించి.. ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు పల్లెల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీ కార్యకర్తల పోల్ చీటీలు పంచే అవకాశమిచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రం దరిదాపుల్లో ఎవరూ లేకుండా అయ్యారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్
-
ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
-
ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్
-
Nagarjuna Sagar By Election 2021: ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్
TIME: 07: 00 PM ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. TIME: 05: 00 PM సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం నమోదైన పోలింగ్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. TIME: 03: 10 PM ఓటు వేసిన ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్66 లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి. TIME: 03: 00 PM మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. TIME: 02: 50 PM ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. TIME: 12:57 PM పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నాగార్జున సాగర్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. సాగర్ పైలాన్ కాలనీలో పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. TIME: 12:37 PM ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది. TIME: 11:25 AM ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. TIME: 10:19 AM ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదు... నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది. TIME: 10:10 AM ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ నల్గొండ: త్రిపురారం మండలం పలుగు తండా ప్రాథమిక పాఠశాలలో కుటుంబసభ్యులతో పాటు బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. TIME: 8:19 AM ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి... నల్గొండ: అనుముల మండలం ఇబ్రహీంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుర్రంపోడ్ మండలం వట్టికోడ్ బూత్ నంబర్-13లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ ఇంకా మొదలు కాలేదు. TIME: 7:00 AM నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకూ సాగర్‌లో విజయం అత్యంత కీలకం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని, విజేత గేమ్ చేంజర్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి కొత్త ఊపు రావడంతోపాటు.. తెలంగాణ చాంపియన్లం తామేనని నిరూపించుకున్నట్టవుతుందని అంటున్నారు. జానారెడ్డి గెలిస్తే ఇటీవలి ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో దాదాపు నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీ ఆశలు 2023 వరకు సజీవంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు గాలివాటం కాదని రుజువు చేయాలంటే.. ఇక్కడ గెలిచి తీరాల్సిన అనివార్యత బీజేపీకి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ జరగనుంది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీలే తొలి మూడు స్థానాల్లో ఉండనున్నాయి. ‘మండలి’ ఆక్సిజన్‌తో ధీమాగా టీఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం, జీహెచ్ఎంసీ ఫలితా లతో కొంత అసంతృప్తిలో ఉన్న టీఆర్ఎస్కు శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. రెండు నియోజకవర్గాల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మరో స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. ఇప్పుడు తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను నిలబెట్టుకోవడం ద్వారా.. దుబ్బాక ప్రతికూల ఫలితం కేవలం తమ ఆదమరుపుతో వచ్చిందేనని, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తుది ఛాంపియన్లు తామేనని రుజువు చేయాలన్న పట్టుదలతో ఉంది. నోముల నర్సింహయ్య తనయుడిని బరిలోకి దింపడంతో అటు సానుభూతి, మరోవైపు చేసిన అభివృద్ధి.. గెలుపు బాటలో నడిపిస్తాయనే ఆత్మవిశ్వాసంతో ఉంది. జానారెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూనే.. ఈ నియోజకవర్గం తమ చేతికి వచ్చిన రెండేళ్లలోనే చేసిన, చేపట్టిన అభివృద్ధి పనులను అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో పరుగులు పెట్టించనున్న అభివృద్ధి పనుల గురించి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు దఫాలుగా జరిపిన పర్యటనల్లో హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా.. ఇక కాంగ్రెస్ పనైపోయిందని రుజువు చేయడం, కొత్త శక్తిగా దూసుకు వస్తున్నామంటున్న బీజేపీ నోరు మూయించడం వంటి బహుళ ప్రయోజనాలను టీఆర్ఎస్ ఆశిస్తోంది. కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య! తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో విజయం జీవన్మరణ సమస్య లాంటిందన్న అభిప్రాయం విన్పిస్తోంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. కొన్నాళ్లకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్నా.. ఆ తర్వాత జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్‌ది పేలవమైన ప్రదర్శనే. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంతృప్తికరమైన ఫలితాలను సాధించలేక పోయింది. నాగార్జునసాగర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు, రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో రాములు నాయక్ కనీస ప్రభావం చూపించలేకపోయారు. ఇలా వరుస ఓటములతో నిస్తేజంలోకి జారిపోయిన కాంగ్రెస్ కేడర్‌కు కొత్త ఉత్సాహాన్ని, 2023 ఎన్నికలకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలంటే.. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏడు పర్యాయాలు గెలిచి, పధ్నాలుగు ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేసిన జానారెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, నియోజకవర్గంపై పట్టు ఆ పార్టీకి ఉపకరిస్తాయని చెబుతున్నారు. జానారెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలుపు అనివార్యమని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో జానారెడ్డి గత శైలికి భిన్నంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు, ఇన్నేళ్లలో తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. బీజేపీ ప్రయోగం ఫలించేనా..? మరోవైపు రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడ చేసిన ప్రయోగం ఫలిస్తుందా..? అనే ఆసక్తి నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగా జనరల్ స్థానమైన నాగార్జున సాగర్‌లో ఎస్టీ వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ నాయక్‌ను బరిలోకి దింపింది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపు ఉన్న ఊపు అభ్యర్థి ప్రకటన వచ్చే వరకు కొనసాగించలేకపోయింది. టికెట్ ఆశావాహుల పోటీతో గుంపు రాజకీయాలు మొదలు కావడం, టికెట్ రాకపోవడంతో కడారి అంజయ్య యాదవ్ గులాబీ గూటికి చేరడం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక పరిస్థితిని బట్టి అంచనా వేస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోటీ నెలకొందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ ఎన్నికలో ఎవరు గెలిస్తే.. వారు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మారనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: ‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్‌పై పార్టీల దృష్టి -
ఉప ఎన్నిక: చాప కింద నీరులా వెళ్లాలనేది బీజేపీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్‌పైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ ప్రచారం కూడా ఇందుకు అనుగుణంగానే సాగుతోంది. పార్టీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా, పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించకుండానే స్థానిక నేతలతో కలసి ప్రతి గ్రామమూ, ప్రతి ఓటరునూ కలిసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 9 తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన రాష్ట్ర నేతలు, కేంద్రమంత్రులు కూడా కేవలం రోడ్‌షోలకే పరిమితమయ్యారు. ఇప్పటికే మండలాలు, గ్రామాలవారీగా ఇన్చార్జీలను నియమించింది. ఆర్భాటం వద్దు... ఓటరన్న ముద్దు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి మంచి ఊపు మీదికొచ్చిన బీజేపీ ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలబడింది. ఈ ఎన్నికల తర్వాత సాగర్ ఉప ఎన్నిక రావడంతో ఇక్కడ వచ్చే ఫలితం పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందనే భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఈ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంది. అందులో భాగంగానే జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టి సామాజిక అస్త్రాన్ని ప్రయోగించింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్టీ ఓట్లు తమ బ్యాలెట్ బాక్సులను నింపుతాయని భావిస్తోంది. అభ్యర్థిని ప్రకటించకముందే ప్రచారాన్ని ప్రారంభించింది. టికెట్‌ను ఆశిస్తున్న నేతలంతా పోటాపోటీగా గ్రామాలకు వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్‌ను ఖరారు చేసిన తర్వాత పార్టీ నియమించిన ఇన్చార్జీలు రంగంలోకి దిగారు. సహాయకులుగా వెళ్లిన ఐదుగురు నేతలతో కలసి వీరు గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నెల 9 తర్వాత... ఈ నెల 9 తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారపర్వంలోకి దిగింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘావాలేలు 10, 11 తేదీల్లో గ్రామాలకు వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి ప్రచారం ముగిసే వరకు సాగర్‌లోనే ఉండనున్నారు. పార్టీ నేత డి.కె.అరుణ ఇప్పటికే నియోజకవర్గంలోనే మకాం వేశారు. ప్రచారం ముగి సే వరకు ఆమె అక్కడే ఉండనున్నారు. ఆమెతోపాటు మాజీ ఎంపీ విజయశాంతి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా సాగర్‌లో ప్రచారానికి వెళ్లనున్నారు. ఇప్పటికే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ రాష్ట్ర నేతల ప్రచారానికి అనుగుణంగా కేడర్‌ను సిద్ధం చేస్తోంది. మొత్తం మీద హంగూ, ఆర్భాటాలకు పోకుండానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చాపకింద నీరులా వెళ్లి సైలెంట్ ఓటింగ్ చేయించుకుని సత్తా చాటాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. చదవండి: సాగర్ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి -
మమ్మల్ని బండబూతులు తిట్టడం సరికాదు: తలసాని
హాలియా : సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమను బండ బూతులు తిట్టడం సరికాదని పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్‌లో ఉప ఎన్నికలు ఉన్నందున ప్రచారం ఎవ్వరైనా చేసుకోవచ్చు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడంలో తప్పులేదన్నారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్‌కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్తో సబ్బండ వర్గాలకు న్యాయం మాడుగులపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మాపురం, గోపాలపురం గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానారెడ్డి 40ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ఈ సారి చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతరెడ్డి యాదగిరి రెడ్డి,మాజీ ఎంపీపీ దాసరి నరసింహ్మ,పగిళ్ల సైదులు,రాములు పాల్గొన్నారు. -
ఒక్క పింఛన్ తీసేసినా.. ప్రభుత్వాన్నే ఊడదీస్తా..!
పెద్దవూర: ‘‘టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పింఛన్ తీసేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంట.. ఒక్కరి పింఛన్ తీసేసినా ఈ ప్రభుత్వాన్నే ఊడదీస్తా’’ అని సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని బట్టుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఉన్న భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేని చేతగాని ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలందరినీఅరాచకవాదులుగా తయారుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి హామీల అమలు ఏమయ్యాయని ప్రశ్నించా రు. రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రను సృష్టించటానికి, ఆదర్శవంతమైన రాజకీయం, ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి జానారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ముస్కు నారాయణ, సువర్ణ, కూతాటి అర్జున్, నక్కల రామాంజిరెడ్డి, కత్తి కనకాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక తిరుమలగిరి : మండలంలోని గోడుమడకలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు గురువారం జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూడిద కొండలు, గుడాల వెంకటయ్య, బాలు, సోమయ్య, రంగయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రక అవసరం పెద్దవూర: సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలవడం రాష్ట్రానికి చారిత్రక అవసరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండలంలోని బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, బట్టుగూడెం, కొత్తగూడెం, కటికర్లగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పబ్బు యాదగిరిగౌడ్, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్‌రెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, బక్కయ్య, శంకర్ పాల్గొన్నారు. -
మిస్టర్ కేసీఆర్! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు
నిడుమనూరు: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరని, ప్రజాస్వామ్యానికి.. నియంతృత్వానికి మధ్య జరుగుతున్న సమరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిడుమనూర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, మెదక్ లోక్ సభ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్‌తో కలిసి భట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్టి మాటల తూటాలు పేల్చారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు, ఆత్మగౌరవం, కొలువులు ప్రజలకు అందడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు మార్గాలతో ప్రజలను అణగదొక్కుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పారే ప్రతినీటి బొట్టు, పండే ప్రతి కంకిలోనూ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపేందుకు సాగర ప్రజలు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని నలిపేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ఈ ఉప ఎన్నికతో ప్రజలు బుద్ది చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికను జానారెడ్డికి, కాంగ్రెస్ ఎన్నికగా చూడడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికగా చూస్తున్నట్లు వివరించారు. ఉద్యోగాల సాధన కోసం ఆత్మార్పణలు చేసుకుంటున్న యువతకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక అందివచ్చిన అవకాశమని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఎన్నికల్లో జనారెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని గుర్తుచేశారు. జానారెడ్డిని గెలిపించి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి నీళ్లు, ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ప్రతి కుటుంబంలోని విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, ఉపాధి హామీ జాబ్ కార్డును, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. జానారెడ్డికి ప్రజలంతా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం, అధికారంతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. సాగర్ ప్రజలను కొనగలను అని విర్రవీగుతున్న కేసీఆర్‌కు ఇక్కడ ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. జానారెడ్డికి పదవులు, హోదాలు కొత్త కాదని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిలదీసే జానారెడ్డి అసెంబ్లీలో ఉండడం ప్రజలకు అవసరం అని గుర్తుచేశారు. -
14న ‘సాగర్’కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా సందర్శించి ఆమోదం తెలిపారు. సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్చార్జీ లుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని రోడ్‌షోలు రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి రూ.28 లక్షలు కాగా.. బహిరంగ సభ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో ఖర్చువుతున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జీలకే ప్రచార, సమన్వయ బాధ్యతలు సాగర్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వివిధ ఉప ఎన్నికలు, కీలక ఎన్నికల్లో పనిచేసిన సీనియర్లకు బదులుగా కొత్త బృందానికి ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మకమేనని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇన్చార్జీల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది. గ్రామ స్థాయిలో ఓ మోస్తరు గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ఆ మేరకు ప్రత్యర్థిని బలహీన పరిచే ఎత్తుగడను అనుసరిస్తోంది.మరోవైపు మండలాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి వారిని ప్రత్యక్షంగా కలసి టీఆర్ఎస్ యంత్రాంగం ఓట్లను అభ్యర్థిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చదవండి: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా -
సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా
సాక్షి, నల్గొండ: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ రంగనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ నియోజకవర్గానికి వెళ్లే అన్ని రూట్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు మాచర్ల వద్ద అదనపు భద్రత పెంచామని ఎన్నికల అధికారుల సూచన మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ప్రచారంలో నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొన్నా.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ( చదవండి: ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు ) -
ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు
-
ఎన్నికల సిత్రాలు: నిన్న ఏడుపులు.. నేడు చిందులు
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రవినాయక్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్న భావోద్వేగంతో కంటతడి పెట్టిన రవినాయక్.. ఇవాళ గ్రామాల్లో కోలాటం, బతుకమ్మ ఆడుతూ ఓట్లడుగుతున్నారు. గిరిజన బిడ్డను ఆశీర్వదించాలని రవినాయక్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. చదవండి: లెక్కతేలిన సాగర్ అభ్యర్థులు సాగర్‌కు ఈశాన్య దిక్కు..చివరి గ్రామం -
లెక్కతేలిన సాగర్ అభ్యర్థులు
సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ద్వారా జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలను వినియోగించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రచారానికి మిగిలింది 12 రోజులే ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్ ఈనెల 17వ తేదీన జరగనుంది. దీంతో 15వ తేదీన ప్రచారం ముగియనుంది. అంటే మరో పన్నెండు రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 14వ తేదీన హాలియాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 5, 6 ,7 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్ షోల్లో కేటీఆర్ పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు వివరించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ అభ్యర్థి (జానారెడ్డి) తరఫున ప్రచారం చేసేందుకు మండలాల వారీగా ఇన్చార్జులను నియమించింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నేతలందరూ కలసి జనగర్జన ప్రచార సభను నిర్వహించారు. మరోవైపు బీజేపీ సైతం రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలను ఏర్పాటు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల పర్యటనలు, సభలు జరిగాయి. -
సాగర్‌కు ఈశాన్య దిక్కు..చివరి గ్రామం
త్రిపురారం : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామమైన అబంగాపురం నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ సెంటిమెంట్‌ను ప్రతి ఎన్నికల్లో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రానికి అబంగాపురం గ్రామం చిట్టచివరి ఊరుగా ఉండంతోపాటు ఈశాన్య దిక్కుగా ఉంది. ఈ గ్రామంలో పూర్వకాలం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జానారెడ్డి ప్రతి ఎన్నికల్లో ఈశాన్య దిక్కున ఉన్న అబంగాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించడం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. సాగర్ నియోజకవర్గంలోని అబంగాపురం గ్రామం త్రిపురారం మండలంలో ఉండేది. కానీ మండలాల పునర్విభజన సందర్భంగా ఈ గ్రామాన్ని మాడుగులపల్లి మండలంలోకి మార్చారు. అయినప్పటికీ సాగర్ నియోజకవర్గంలోనే కొనసాగుతూ చిట్టచివరి ఊరుగా ఈశాన్య దిక్కున ఉంది. జానారెడ్డి సెంటిమెంట్‌ను 2018 ఎన్నికల్లో దివంగత నేత నోముల నర్సింహయ్య కూడా కొనసాగిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మరణానంతరం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు నోముల భగత్‌యాదవ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని తన తండ్రి ప్రారంభించిన గ్రామం నుంచే ప్రారంభించడం విశేషం. ఇదే సెంటిమెంట్‌ను బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్‌నాయక్ కూడా పాటిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయస్వావిుకి పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల కిందట జానారెడ్డి గెలుపును కాంక్షిస్తు ఆయన తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
సాగర్ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి
సాక్షి, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలంలో శుక్రవారం టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు ప్రచారం చేయగా పెద్దవూర మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, త్రిపురారం మండలం పలుగు తండాలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్ధి రవినాయక్ కంటతడి పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలుగు తండా రవినాయక్ సొంత గ్రామం కావడంతో అతను గ్రామస్తులను హత్తుకుని ఏడ్చుకుంటూ ఓటు అడిగారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక్కసారిగా కంటతడి పెట్లుకొని ఓటు అభ్యర్ధించడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా, బీజేపీ అసమ్మతి నేత కంకణాల శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. -
Nagarjuna Sagar Bypoll: గులాబీ ‘సాగర’ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార టీఆర్ఎస్ ఇక ‘ఆపరేషన్ నాగార్జున సాగర్’ ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించడమే లక్ష్యంగా గులాబీదళం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రచారం ముగియడానికి ముందురోజు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపాయి. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా రెండ్రోజులపాటు రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రోడ్ షోలు ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నది ఖరారు కానుంది. ఇక భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించింది. సోమవారం రాత్రే హాలియా చేరుకున్న తలసాని... స్థానిక నేతలతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫోన్ చేయడంతో సాగర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను బుజ్జగించారు. భగత్‌కు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని వారికి వివరించారు. రెండ్రోజుల్లో వారిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి భరోసా ఇప్పించే ప్రయత్నాల్లో తలసాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించాలని, భగత్ గెలుపు కోసం పనిచేయాలని తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చదవండి: మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు! సాగర్ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్లు వేసిందేవరంటే.. -
మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు!
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న, అత్యధిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు.. 32 బోర్ రివాల్వర్, 0.25 పిస్టల్ ఉన్నాయి. జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్‌లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.6,81,012, ఎస్బీఐ సెక్రటేరియట్ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి. భారీ మొత్తంలో షేర్లు జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నోముల భగత్ ఆస్తుల వివరాలివీ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన భార్య భవాని పేరిట పేరిట రూ.84.52 లక్షల అప్పులు ఉన్నాయి. భగత్ పేరిట రూ.55,33,719 విలువైన చరాస్తి, రూ.30,32,000 విలువైన స్థిరాస్తి ఉండగా, ఆయన భార్య పేరిట రూ.71,84,650 విలువైన చరాస్తి, రూ.1,75,000 విలువైన స్థిరాస్తి ఉంది. భగత్ చేతిలో రూ.19,000 నగదు ఉండగా ఆయన భార్య వద్ద రూ. 15,000 నగదు ఉంది. భగత్ పేరిట ఎస్బీఐ నకిరేకల్‌లో రూ.1,85,307, యాక్సిస్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.1,63,217 ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఎస్బీఐ చౌటుప్పల్‌లో రూ.15,97,221, యాక్సిక్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.72,420 ఉన్నాయి. భగత్ పేరిట రెండు వాహనాలు, భార్య పేరిట ఒక వాహనం ఉన్నాయి. భగత్ పేరిట 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉంది. భగత్‌కు వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. -
11 సార్లు ఓటమి.. గెలిపించే వరకు పోటీ చేస్తా
నిడమనూరు : గజినీ మహ్మద్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా, ఆయన మరోమారు యుద్ధభేరి మోగించి విజయం సాధించారని పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. అదే కోవలోకి వస్తారు.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మర్రి నెహెమ్యా. ఎన్నికలు ఏవైనా నేనున్నాంటూ బరిలో నిలిచేందుకు ముందుకొస్తారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఇప్పటికి కౌన్సిలర్ నుంచి శాసనసభ, లోక్‌సభ స్థానాలకు 11సార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 72ఏళ్ల వయసులో కూడా ఆయన మరో మారు సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఆయన నిడమనూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు వచ్చి ‘సాక్షి’తో ముచ్చటించారు. 1984నుంచి తుంగతుర్తి, సూర్యాపేట, చలకుర్తి, నాగార్జునసాగర్, హుజూర్నగర్ శాసన సభ, మిర్యాలగూడ, నల్లగొండ లోక్ సభ స్థానాలకు పోటీచేసి ఓడిపోయినట్లు తెలిపారు. 2014లో నిర్వహించిన నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 56వేల ఓట్లు సాధించానని తెలిపారు. తనను గెలిపించే వరకు ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉంటానని నెహెమ్యా పేర్కొనడం కొసమెరుపు. చదవండి: ‘ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా’ -
కాంగ్రెస్‌లో సాగర్ ‘మథనం’ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో సాగర్ ‘మథనం’ మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో... నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఏం జరగనుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపుతో టీఆర్ఎస్ ఫుల్ జోష్‌లో కనిపిస్తుండటంతో టీపీసీసీ నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్న సాగర్ ఎన్నికలో సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఏదో మూల ఉన్నా .. అలా జరగకపోతే మాత్రం ఇక అంతే సంగతులనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. లోపం ఎక్కడుంది? ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలి తాలు కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేశాయి. రెండు చోట్లా పది శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతతో పట్టభద్రులు తమను ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో ఈ ఎన్నికలకు వెళ్లామని, స్వతంత్ర అభ్యర్థులు సాధించిన దాని కన్నా తక్కువ ఓట్లు రావడమేమిటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు చేరువ కావడంలో తాము ఎక్కడ విఫలమవుతున్నామనే అంతర్మథనం టీపీసీసీ నేతల్లో మొదలైంది. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలకు దరిదాపులో లేకుండా ఓట్లు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు కార్పొరేటర్ స్థానాలకు పరిమితం కావడం, పట్టభద్రుల ఎన్నికల్లో నాలుగైదు స్థానాలకు దిగజారడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ... రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడానికి కారణమేంటనేది కాంగ్రెస్ నాయకులకు అంతుపట్టడం లేదు. ఈ దశలో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పుడు టీపీసీసీ నాయకత్వం దృష్టి సారించింది. రెండు నెలలుగా జానా అక్కడే... పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా అక్కడి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.జానారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే ఓ దఫా పర్యటన పూర్తి చేశారు. ఆయన కుమారులు రఘువీర్, జైవీర్‌లు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్‌ను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పాత సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు గతంలో తనతో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ సన్నిహితులు, అనుచరులను మళ్లీ అక్కున చేర్చుకునేందుకు జానా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే హడావుడి ప్రారంభించిన నేపథ్యంలో... జానా తనకున్న విస్తృత పరిచయాలు, చరిష్మాను నమ్ముకొని ఎక్కడా వెనుకబడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపేందుకు ఈనెల 27న హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అనంతరం 29న అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు జానా సన్నాహాలు చేసుకుంటున్నారు. -
రాజకీయ ‘సాగరం’: స్థానిక బీసీ నేతకే టీఆర్ఎస్ టికెట్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో ఇక రాజకీయ పార్టీలన్నీ అటువైపు దారి కట్టనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నిక కోసం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఇకపై కార్యాచరణను ముమ్మరం చేయనున్నాయి. నిన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉన్న పార్టీలు షెడ్యూల్ రాకతో సాగర్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు సమాయత్తమవుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు మళ్లీ ‘పరీక్ష’ నాగార్జున సాగర్ ఉపఎన్నిక రూపంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు మరో పరీక్ష ఎదురుకానుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా సాగర్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసింది. ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా నియమించారు. ఇప్పుడు షెడ్యూల్ వెలువడటంతో గ్రామం, వార్డు, పోలింగ్ బూత్ స్థాయిలో టీఆర్ఎస్ ప్రణాళిక అమలు చేయనుంది. అయితే, ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం ఇంకా తేల్చలేదు. దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఆ పార్టీ నాయకులు తేరా చిన్నపరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డిల పేర్లు మొదట్లో వినిపించినా... సర్వేల అనంతరం స్థానికుడైన బీసీ నాయకుడిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఎన్నిక కోసం ఏకంగా టీపీసీసీ అధ్యక్ష ఎంపికనే వాయిదా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా సాగర్‌లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించనుంది. ఇక్కడి నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డిని అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌లు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. వీలున్న చోటల్లా తమ నుంచి దూరంగా వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఇక నుంచి జానాకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నిక కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. స్థానిక నాయకుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత అభ్యర్థిత్వంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన కడారి అంజయ్య యాదవ్, డాక్టర్ రవికుమార్ పేర్లను కూడా పరిశీలిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? లేదా అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి తోమర్లు కూడా నియోజకవర్గంలో పర్యటించారు. షెడ్యూల్ వెలువడటంతో ఇక రాష్ట్ర కమలనాథులందరూ సాగర్ బాట పట్టనున్నారు. మొత్తంమీద సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసిన రోజే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడింది. మరో నెలరోజుల పాటు కృష్ణానదీ తీరంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. -
తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీగా ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడించున్నట్లు తెలిపింది. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య(టీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఫిబ్రవరి 26న షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుపతి, సాగర్ ఉప ఎన్నికకు సైతం ఆరోజే షెడ్యూల్ ప్రకటిస్తారని భావించినా, ప్రత్యేకంగా ఈసీ నేడు రిలీజ్ చేసింది. ఇక అసోంలో మూడు విడతల్లో(126 స్థానాలు- మార్చి 27, ఏప్రిల్ 1, 6వ తేదీల్లో) తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో(234 స్థానాలు), కేరళలో సైతం ఒకే విడత(140 స్థానాలు- ఏప్రిల్ 6)లో పోలింగ్ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం (294 స్థానాలు) మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీల్లో అక్కడ పోలింగ్ చేపట్టనున్నారు.ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(30 స్థానాలు)లో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అయితే అన్నిచోట్లా ఫలితాలు మాత్రం మే2నే తేలనున్నాయి. తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్- వివరాలు ►మార్చి 23న నోటిషికేషన్ ►నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- మార్చి 30 ►నామినేషన్ల పరిశీలన-మార్చి 31 ►నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3. ►ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్. ►మే 2న ఫలితాలు. -
ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలవాలి
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో ప్రచార పరంగా ఇతరులతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయండి. ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుపొందాలి. పోలింగ్‌కు కేవలం 14 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ప్రతి ఓటరును కలిసేలా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయండి..’అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. పోలింగ్ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి ‘సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. ప్రతి ఓటరును కలిసి మన ఎజెండాను వివరించడంతో పాటు పోలింగ్‌లో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొంత అతి విశ్వాసంతో వెళ్లడంతో నష్టం జరిగింది. ఈసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓటర్లతో చివరి నిమిషం వరకు మమేకం కావాలి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా లేదు. ఇతర అభ్యర్ధుల్లో ఒకరిద్దరి పట్ల ఓటర్లలో కొంత సానుభూతి ఉన్నా వారికి క్షేత్ర స్థాయిలో యంత్రాంగం లేదు. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 30 చోట్ల్ల మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ చివరి నిమిషం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి..’అని కేసీఆర్ సూచించారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి ‘ఈ నియోజకవర్గంలో 5 లక్షల పైచిలుకు పట్టభద్ర ఓటర్లు ఉండగా, ఇందులో సుమారు 3 లక్షల మందిని మన పార్టీ యంత్రాంగం ద్వారా నమోదు చేశాం. పోలయ్యే ఓట్లలో 50%కి పైగా ఓట్లు మన అభ్యర్థి సాధించేలా క్షేత్ర స్థాయిలో శ్రమించాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా పనిచేయండి. క్షేత్ర స్థాయిలో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర క్రియాశీల నేతలు, కార్యకర్తలు అందరినీ ప్రచారంలో భాగస్వాములను చేయాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత సాగర్‌పై చర్చ! నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మరోమారు సమావేశమవుదామని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన సమావేశం ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. అయితే సాగర్ ఉప ఎన్నికపై లోతైన చర్చ జరగలేదని, ఆ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఎన్నికతో పాటు ఉప ఎన్నికను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. -
ఉప ఎన్నికలు: తిరుపతి, నాగార్జునసాగర్‌కు ప్రత్యేక షెడ్యూల్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 6వ తేదీన ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య, తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో మున్సిపల్‌తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా తాజాగా తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికకు కూడా దాదాపు సమయం ఆసన్నమైంది. చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. -
‘ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా’
హైదరాబాద్: రెండుమార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో తొలిసారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణను ప్రకటించడంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కుల,మతాలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా ఇక నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి మాట్లాడిన ఆయన.. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, అయినా పోటీకి దిగుతానన్నారు. తెలంగాణలో ఎక్కువసార్లు గెలిచింది తానేనని జానారెడ్డి తెలిపారు. ఇక్కడ చదవండి: జానాకి పోటీ.. రంగంలోకి యువనేత -
గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్
సాక్షి, నల్లగొండ: ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోంది. గ్రామాలు పచ్చబడ్డాయి. తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ ఇంటికిపోయి ఆలోచించండి. నేను చెప్పింది అబద్ధమైతే టీఆర్ఎస్ను ఉప ఎన్నికలో ఓడించండి. నిజమైతే మిగతా పార్టీలకు డిపాజిట్ దక్కకుండా చేయాలి.’అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతోపాటు.. మరో 13 ఎత్తిపోతల పథకాలకు ఆయన బుధవారం తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు వద్ద ఒకేసారి శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియా మండల పరిధిలోని 14వ మైలురాయి (అలీనగర్) వద్ద జిల్లా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల ధన్యవాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారభేరీగా సాగిన ఈ సభలో ఆయన నల్లగొండ జిల్లాపై వరాలు కురిపించారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం ‘కృష్ణానదిలో సాధారణంగా నీరు తక్కువగా వస్తుంది.. రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా రావడం వల్ల ఇబ్బంది లేదు. వర్షాలు రానప్పుడు లిఫ్ట్‌లు నిలిచిపోకుండా గోదావరి జలాలతో ïసీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలిస్తాం. లిఫ్టు ద్వారా గోదావరి జలాలను పెద్దదేవులపల్లికి తరలించి గోదావరి– కృష్ణా నదులను అనుసంధానం చేస్తాం. రూ.600 కోట్లతో అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సాగునీటి కష్టాలు తీరి నల్లగొండ కళకళలాడుతుంది. గోదావరి జలాలు తెచ్చి నల్లగొండ ప్రజల కాళ్లు కడుగుతా’అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఎంతో అన్యాయానికి గురైందని, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి జిల్లాను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జరిగిన అన్యాయం ఇక జరగవద్దని, తానే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్లు వద్ద లిఫ్ట్‌ల శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు– రేషన్ కార్డులు ‘కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్‌లో పడిపోయాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరోనా దెబ్బకొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూ చేస్తా’అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకుండా నూతన రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దళితుల అభివృద్ధికి బడ్జెట్లో రూ.వేయి కోట్లు ‘దళితజాతి ఇంకా వెనుకబడే ఉంది. అందరం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అన్ని వర్గాలూ బాగుపడాలి. అప్పుడే రాçష్టం మరింత అభివృద్ధి చెందుతుంది. బడ్జెట్లో దళిత అభివృద్ధి కోసం వేయి కోట్లు పెడతా. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటం.. నేనే పర్యవేక్షిస్తా’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణను బంగారు తునక చేసేందుకు కష్టపడుతున్నా... ప్రజలు గుర్తించాలన్నారు. ఎక్కడైన గాలి మాటలు మాట్లాడితే అవి విని మోసపోవద్దని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ‘మమ్మల్ని నిలబెట్టే బాధ్యత మీదే. నేను చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్దం ఉన్నా టీఆర్ఎస్ను ఓడించండి. నిజమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా చేయండి. సాగర్ ఉప ఉన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. రాజకీయ గుంట నక్కల మాటలు నమ్మి మోసపోవద్దు. అండగా ఉండండి... మిమ్ములను కాపాడుకుంటా’అంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు ఏడాదిన్నరలో ... ఎత్తిపోతలు పూర్తి ‘నల్లగొండ జిల్లాలో 13 లిఫ్టులను రూ.2,500 కోట్లతో చేపడుతున్నాం. వీటిని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం’అని సీఎం స్పష్టం చేశారు. ఎడమ కాలువ కింద ఎకరా మిగలకుండా నీరు ఇవ్వడమన్నదే తన ఉద్దేశమన్నారు. ‘చాలెంజ్ చేస్తున్న .. లిఫ్ట్‌లు ఏడాదిన్నరలో పూర్తి కాకపోతే ఓట్లు అడగం..’అని సవాల్ చేశారు. నోముల నర్సింహయ్య తన పక్కన లేడని చాలా బాధగా ఉందన్నారు. మిషన్ భగీరథ నీరు ఇస్తేనే ఓట్లు అడుగుతామని ఎన్నికలకు ముందు చెప్పిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విచక్షణతో ఆలోచించాలన్నారు. నల్లగొండకు నిధుల వరద... ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు సీఎం కేసీఆర్ హాలియా సభలో నల్లగొండ జిల్లాకు నిధుల వరద పారించారు. సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని, వీరికి తోడ్పాటునందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాలకు రూ.30 లక్షలు, జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ రూ.5 కోట్లు, మిగిలిన 6 మున్సిపాలిటీలకు ఒక్కో కోటి రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అవాకులు, చవాకులు పేలుతోంది ‘కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పేలుతోంది. బీజేపీది కొత్త బిచ్చగాళ్ల వ్యవహారం. మిడిసి పడొద్దు. వీరు పిడికెడు.. తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయితరు. సభనాడు వచ్చి గోల చేయడం సంస్కారం కాదు. ప్రజలే తీర్పు చెబుతరు. పార్టీలు, నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. చాలా మందితో పోరాడినం. తొక్కిపడేస్తం..’అని సీఎం కేసీఆర్ విపక్షాలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సీఎల్పీ నాయకుడు ఆదిలాబాద్ వరకు పొలంబాట – పోరు బాట అంటున్నడు.. పొలానికి ఏమైంది? బుద్ధిమంతుల్లా ఉంటే మంచింది. డంబాచారాలు చెప్పుకునే ప్రభుత్వం కాదు మాది’అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో దుస్థితికి కారకులు ఎవరు? కాంగ్రెస్‌కు తెలంగాణ అనే పదం ఉచ్చరించే హక్కు లేదు. రైతుల ఆత్మహత్యలకు ఈ పార్టీ కాదా కారణం..? హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. విభిన్న సంస్కృతితో విలసిల్లింది. అలాంటి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ దుర్మార్గులు కాదా’అని మండిపడ్డారు. ఒక ముక్క మహారాష్ట్రలో, మరో ముక్క ఏపీ, ఇంకోటి కర్నాటకలో కలిపారన్నారు. గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకలు పైరవీల కోసం, పదవులు, పైసల కోసం ఆలోచించారు తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా మండలం అలీనగర్ వద్ద జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ప్రజలు. అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి .. లేదంటే మీకే నష్టం బహిరంగ సభలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేకలు వేయడంతో సీఎం సీరియస్ అయ్యారు. ‘అయిదుగురులేరు మీరు... వెళ్లిపోండి. మా వాళ్లు తలుచుకుంటే మీరు నశ్యం అవుతారు. పిచ్చిపనులు చేయొద్దం’టూ హెచ్చరించారు. ‘బీజేపీ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా వ్యవహరిస్తోంది. మీలాగా మాట్లాడటం చేత కాకకాదు. మీరు పిడికెడు, తలుచుకుంటే నశ్యం.. నశ్యం అవుతరు. మీరూ సభ పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. మేము పెట్టుకున్న సభను అడ్డుకోవడం సరికాదు. ఇలాంటి పిచ్చి చేతలు మానుకోవాలి’అంటూ హెచ్చరించారు. ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే .. ఎత్తిపోతల అవసరం వచ్చేదే కాదు ‘నాగార్జునసాగర్‌ను ఇప్పుడున్న చోట కాకుండా 19 కిలోమీటర్ల పైన... ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉండే. కేఎల్‌రావు అనే దుర్మార్గుని వల్ల అన్యాయం జరిగింది. దీంతోనే నేడు లిఫ్ట్‌లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్ నేతలు కళ్లు మూసుకోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొంది. ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేకపోయారు. 2007లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి, రైతుల ఇబ్బందులు తెలుకున్న. ఆనాడు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వను.. ఏం చేస్తారో చేసుకోండి అన్నా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. అలాంటి నాయకులు నేడు పొలంబాట, పోరుబాట.. బొందబాట అంటూ తిరుగుతున్నరు’.. అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే కమీషన్ల కోసం అంటున్నరు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును మీరు కట్టింది.. కమీషన్ల కోసమేనా’అని నిలదీశారు. ప్రజలు మౌనంగా ఉండరాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉండరాదని, చైతన్యంతో ఉండాలని సీఎం అన్నారు. ‘జిల్లాలో 1.50 లక్షల మందిని ఫ్లోరిన్ పొట్టన పెట్టుకుంది.. ఒక్కరన్నా దానిపై మాట్లాడిండ్రా..? ఒక్కరన్నా ఉద్యమించారా? నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి టేబుల్ మీద ఫ్లోరిన్ బాధితుడిని ఉంచి తమ గోడును వెల్లబోసినా సమస్య పరిష్కారం కాలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టినం. మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినం. అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.. ఇయ్యాల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు. తెలంగాణ రాకుముందు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు భారతదేశంలోనే 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పొలంబాట, పోరుబాట ఎందుకు చేస్తోంది? మేము రైతులకు నాణ్యమైన కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నందుకు కాంగ్రెస్ పొలంబాట–పోరుబాట చేస్తోందా? అని కేసీఆర్ నిలదీశారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనాడు 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నేడు రైతు బీమాతో వారం రోజుల్లోనే రూ.5లక్షలు రైతు కుటుంబానికి అందిస్తున్నాం. కాంగ్రెస్‌కు కడుపుమంట.. రెతుని ఆదుకునేందుకు విజయ డెయిరీ పాలసేకరణ ధరను పెంచాం. మిషన్ కాకతీయలో 48 వేల చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. దేశంలో ఆత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. 1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగుచేశాం. దీనిని వచ్చేసారి మరో 85 లక్షల ఎకరాలు పెంచుతాం’అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి దేశంలో ఎక్కడాలేదని, ఆడబిడ్డలు బరువు కావద్దన్న ఉద్దేశంతో తానే స్వయంగా ఆలోచించి పథకం పెట్టానన్నారు. కంటి వెలుగుతో ఉచితంగా అద్దాలు, కేసీఆర్ కిట్టుతో గర్భిణులను ఆదుకుంటున్నామని.. ఆడబిడ్డ çపుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు అయితే 12వేలు ఇçస్తున్నామని, ఇదంతా గ్రామాలకు వెళ్లి ఆలోచించుకోవాలని కోరారు. ధరణితో .. అవినీతికి చెక్ ‘రెవెన్యూలో, రిజిస్ట్రేషన్ శాఖల్లో లంచాలు తగ్గించేందుకు ధరణి తీసుకువచ్చాం. ధరణి ద్వారా పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయి. దీంతో లంచాల భారం పోయింది. అందుకోసమని కాంగ్రెస్ పోరుబాట చేస్తోందా..? మీది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. గ్రామాలను రావణ కాష్టంలా మార్చారు. త్వరలోనే భూ పంచాయితీల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోబోతున్నాం. దే«శంలోనే భూ పంచాయితీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది’అని సీఎం పేర్కొన్నారు. పేదరికం పోవాలి ‘రాష్ట్రంలో యాదవులను ఆదుకునేందుకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాం. 7.50 లక్షల దరఖాస్తులు రాగా 3.70 లక్షల యూనిట్లు అందించాం. ఈ బడ్జెట్లో మరో 2 లక్షల యూనిట్లకు నిధులు కేటాయిస్తాం. కాంగ్రెస్ నాయకులేమో గొర్రెలు మేసిండ్రు అని విమర్శించారు. మత్య్సకారులను ఆదుకునేందుకు రూ.160 కోట్లతో ఉచిత చేపపిల్లల పథకం ప్రవేశపెట్టాం. నాయీబ్రాహ్మణుల కోసం ప్రతి గ్రామంలో ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు లక్ష రూపాయలు మంజూరు చేయనున్నాం’అని ప్రకటించారు. టీఆర్ఎస్ది క్లీన్ గవర్నమెంట్ ‘రైతుబంధును రూ.15 వేల కోట్లతో చేపడుతున్నాం. ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడైనా చూశామా.? రూ.500 ఇస్తే.. రూ.250 లంచాలకే పోయేది. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్.. క్లీన్ గవర్నమెంట్. అవినీతి రహిత ప్రభుత్వం మాది. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉండాలి. రైతుబంధు ద్వారా లబ్ధి పొందుతరు.. మళ్లీ రోడ్లమీదకు వచ్చి అంటరు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 2,600 రైతు వేదికలను నిర్మించాం. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,768 గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించాం. గ్రామాల రూపురేఖలన్నీ మారిపోయాయి. హరితహారం ద్వారా చెట్ల పెంపకం జరుగుతోంది. గతంలో అమెరికా స్టోరీలే వినేవాళ్లం. నేడు తెలంగాణ గురించి వారే తెలుసుకునే పరిస్థితి వచ్చింది. గ్రామాలన్నీ అంత పరిశుభ్రంగా తయారయ్యాయి. సర్పంచులు బాగా పనిచేస్తున్నారు. వైకుంఠధామాలతో గ్రామాల్లో దహన సంస్కారాలు గౌరవంగా చేసుకునే వీలు కలిగింది. అన్ని కులాల వారికి వీటివల్ల మేలు జరుగుతుంది’అని అన్నారు. గిరిజన తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఏనాడూ ఏ ప్రభుత్వాలు వారి గురించి ఆలోచించిన పాపానపోలేదన్నారు. దామరచర్లలో 4వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని , రెండేళ్లలో పూర్తవుతుందని, దీనికోసం రూ.35వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అన్నారు. ‘యాదాద్రిని ఎవరూ పట్టించుకోలేదు. రూ.2వేల కోట్లతో పనులు చేపడుతున్నం. ప్రపంచమే వచ్చి చూసి పోతది. ఇవన్నీ చూసే కాంగ్రెస్‌కు కన్నుకుడుతోంది. ధర్మాన్ని గెలిపించాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, విప్ గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకపోతే.. ఓట్లు అడగను: కేసీఆర్
సాక్షి, హాలియా: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగా నిర్వహించింది. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత హాలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ఎదురెండలో కూడా ఇంత మంది నా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చినందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నల్లగొండలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌లు అందరూ ఎంతో బాగా పని చేస్తున్నారు. చెట్లు పెంచుతున్నారు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అన్నారు కేసీఆర్. ‘‘కేవలం అభినందనలు మాత్రమే కాక జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు.. ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయలు.. ఒక్కో మున్సిపాలిటీకి కోటి రూపాయలు.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. రేపే దీనిపై సంతకం చేస్తాను. సీఎం ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇస్తాను. అర్హులైన నిరుద్యోగులందరికి త్వరలోనే నిరుద్యోగ భ్రుతి, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. నెల్లికళ్లు-జింకలపాలేం భూ వివాదాన్ని పరిష్కరిస్తాం. అర్హులందరికి పట్టాలు ఇస్తాం’’ అన్నారు. రూ. 2,500 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఆయన మాట్లాడుతూ.. ‘‘నల్లగొండ వెనకబడిన జిల్లా. ఎందరు ముఖ్యమంత్రులు మారినా.. జిల్లాలో అభివృద్ధి జరగలేదు. జిల్లా సమస్యలన్ని నా దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది. నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వచ్చాను. వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశాను. వీటన్నింటికి 2500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఏడాదిన్నరలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాను. వేదిక మీద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల, గ్రామీణ ప్రాంత నాయకులంతా దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఏడాదిన్నరలోగా అన్ని సాగు నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి. ఈ హామీలన్నింటిని పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ అంటే ధీరుల పార్టీ.. వెన్నుచూపే పార్టీ కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నల్లగొండకు శాశ్వత ఆయకట్టు ఏర్పాటు చేసి.. సాగునీటికి సమస్య లేకుండా చూస్తాం. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను. డిండి ప్రాజెక్ట్ పూర్తయితే పాత నల్లగొండలోని 12 నియోజకర్గాలకు సాగు నీరుకు కరువుండదు’ అన్నారు. ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం ‘‘నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం ఒక జనరేషన్‌ని నాశనం చేసింది. ఇక్కడి ఉద్యమ కారులు ఫ్లోరైడ్ బాధితుడిని తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ ముందు పడుకోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ టీఆర్ఎస్ ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది. అప్పటి చంద్రబాబు పంటలు వేసుకోమని చెప్పి.. మధ్యలో నీరు బందు పెట్టాడు. పంటలు ఎండిపోయాయి. అప్పుడు ఈ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. మేం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి.. నీరు ఇప్పించాం’’ అన్నారు. సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ కడుపు మండుతుంది ‘‘దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. మా ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు కరెంట్ ఇస్తుంది. దీనికే కాంగ్రెస్ నాయకులు కడుపు మండుతుంది. విజయ డైరీని పునరుద్దరించాం. లీటరు పాలకు ఐదు రూపాయలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా భూ గర్భ జలాలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ. త్వరలోనే దేశంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది’’ అన్నారు ‘‘తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి, కంటి చూపు, కేసీఆర్ కిట్.. ఆడపిల్ల పుడితే రూ. 13,500, మగ పిల్లాడు పుడితే రూ.12,000 ఇస్తున్నాం. రెవెన్యూలో అవినీతి నిర్మూలనకు, లంచాల బాధ నుంచి విముక్తి చేయడం కోసం ధరణిని తీసుకువచ్చాం. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గతంలో వీఆర్వోల చేతిలో పెట్టి గ్రామాలను రావణకాష్టం చేసిన వారు మీరు కాదా’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కుల వృత్తులను ఆదుకుంటాం ‘‘కుల వృత్తులను ఆదుకున్నాం. దానిలో భాగంగానే గొల్ల, కురమలకు గొర్రెలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 7,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి గొర్రెలు ఇచ్చాం. ఈ మార్చిలో మరో రెండు లక్షల మందికి.. వచ్చే ఏడాది మరో రెండు లక్షల మందికి గొర్రెలు ఇస్తాం. అన్ని కుల వృత్తులను ఆదుకుంటాం. రాబోయే బడ్జెట్లో ప్రతి గ్రామంలో ఆధునిక సెలూన్ల కోసం నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయలు ఇస్తాం’’ అన్నారు. 2,600 రైతు కేంద్రాలు నిర్మించాం ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో మొత్తం 2,600 రైతు కేంద్రాలు నిర్మించి ఇచ్చాం. రైతులంతా అక్కడ కూర్చుని మాట్లాడుకుని అన్ని విషయాలు చర్చించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు మీకు సేవ చేస్తారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజలు గుర్తించాలి. గతంలో సిద్ది పేటలో నాలుగు మొక్కలు పెడదాం అంటే దొరకలేదు. కానీ నేడు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లు అందజేశాం. ప్రతి గ్రామానికి స్మశాన వాటిక, వ్యర్థాల నిర్వహణ కొరకు ప్రత్యేక వార్డు నిర్మించాం’’ అన్నారు. విపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ‘‘కాంగ్రెస్ పార్టీ అవాకులు, చెవాకులు పేలుతోంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ నాయకులు పిచ్చి వేషాలు వేస్తున్నారు. మిమ్మల్ని జనాలు నశం చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. పిచ్చి వాగుడుకు ఓ హద్దు ఉంటుంది. చాలా మంది రాకాసులతో కొట్లాడం.. మీ లాంటి గోకాసులు మాకు పెద్ద లెక్క కాదు. మాలో సహనం నశిస్తే.. మీకే ప్రమాదం. తొక్కి పారేస్తాం జాగ్రత్త’’ అని కేసీఆర్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ‘‘హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కలిపిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణలో కన్నీరు, కష్టాలకు నాటి కాంగ్రెస్ నాయకులే కారణం. మేం ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తే.. కమిషన్ల కోసం అంటారు. మిషన్ భగీరథను కమిషన్ భగీరథ అంటున్నారు. మీకు ప్రజలే సమాధానం చెప్తారు’’ అని కేసీఆర్ హెచ్చరించారు -
సాగర్ బహిరంగ సభ: ‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం ఎత్తిపోతల పథకాలకు రూ.2,500 కోట్లు కేటాయించాం ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతా బీజేపీ, కాంగ్రెస్ నేతలు హద్దు మీరితే.. తొక్కి పారేస్తాం తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం బీజేపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నాం.. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నాం రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టాం.. రోజూ చర్చలు జరపాలి 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశాం దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు పెడతాం బహిరంగ సభ ప్రారంభం హాలియాలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామపంచాయతికీ రూ.20 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ నెల్లికల్లులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ లిఫ్టు ఇరిగేషన్ వరకు ఎల్ఎల్సీ పంప్ హౌజ్ నుంచి ఎచ్‌ఎల్‌సీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు... దేవరకొండ నియోజకవర్గ పరిధిలో... పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, నంబాపురం-పెద్దగట్టు ఎత్తిపోతల.. పెద్దమునగాల ఎత్తిపోతల, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం.. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని.. దున్నపోతుల గండి, బాల్లేపల్లి చాప్లాతాండా ఎత్తిపోతల.. కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల.. నాగార్జున సాగర్-మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్ఎల్బీసీ కాల్వ 1.8 కిలోమీటర్ల నుంచి 70.52 కిమీ వరకు సీసీ లైనింగ్.. హుజూర్ నగర్-కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్రాంచ్‌కు ఎత్తిపోతల.. జాన్‌పహాడ్ బ్రాంచ్‌కు ఎత్తిపోతలతో పాటు డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సీసీ లైనింగ్, ఆధునీకీకరణ... సూర్యాపేట-హుజూర్ నగర్-కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిలోమీటర్ల నుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంకుస్థాపనలన్నింటిని నెల్లికల్లులో ఒకే చోట చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్‌లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాగార్జున సాగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో నెల్లికల్లు చేరుకున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హాలియా బహిరంగ సభకు హాజరవుతారు. -
‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు వారం రోజుల క్రితం బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో తక్కువ వ్యవధిలో భారీ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దివంగత శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్క ల్లపల్లి రవీందర్రావు, మాజీ విప్ కర్నె ప్రభాకర్ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. హాలియాలో అలీనగర్ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిప ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. సభ వెనుక బహుముఖ వ్యూహం నాగార్జునసాగర్ ఉపఎన్నిక సన్నాహాల్లో భాగంగా టీఆర్ఎస్ బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్పటికీ పార్టీ అధినేత మదిలో ఇతర వ్యూహాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో బుధవారం జరిగే సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రస్థానం, విధానంతో పాటు పాలనాపరమైన అంశాలపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కేసీఆర్ ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకునే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేస్తు న్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వపరంగా దూకుడుగా వెళ్తామనే సంకేతం ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి ఇచ్చే అవకాశముంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గత ఆరున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించడంతో పాటు కొత్తగా పలు వరాలు కూడా ఇచ్చే అవకాశముంది. శాసనమండలి పట్టభద్రుల కోటా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఈ సభ నుంచి కేసీఆర్ పిలుపునిస్తారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా... ‘సమర’ సన్నద్దత తొలుత తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా మార్చిలో ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ భావించింది. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక ఉంటుందని తాజాగా అంచనా వేస్తోంది. అయితే ఏ సమయంలో ఉప ఎన్నిక జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దంగా వుంచేందుకు టీఆర్ఎస్ గత ఏడాది డిసెంబర్ నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మండల, నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు పర్యాయాలు అంతర్గత సర్వేలు కూడా నిర్వహించింది. పార్టీ నేతల నుంచి అందిన అంతర్గత నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో టీఆర్ఎస్తో పాటు, ఇతర పార్టీల బలాబలాలను కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తూ వస్తున్నారు. రెండు రోజులుగా బహిరంగ సభ సన్నాహాల్లో భాగంగా మరోమారు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. మండలాల వారీగా ఇన్చార్జిలు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించి ఉప ఎన్నికకు సన్నద్దమవుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్రావు పర్యవేక్షణలో మండల ఇన్చార్జిలు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మందుల సామేలు (త్రిపురారం), కర్నె ప్రభాకర్ (నిడమానూరు), భరత్ కుమార్ గుప్తా (హాలియా), రవీందర్రావు (నాగార్జునసాగర్), సందీప్‌రెడ్డి (పెద్దఊర), ఒ.నర్సింహారెడ్డి (గుర్రంపోడు) ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక, సాగర్ ఉప ఎన్నిక కోసం పార్టీ స్థానిక నేతలను సమన్వయం చేయడంపై టీఆర్ఎస్ ఇన్చార్జిలు దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో లేనట్లే! టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న హాలియా బహిరంగ సభలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన ఉండే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, న్యాయవాది డీసీ కోటిరెడ్డి, దివంగత శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరితో పాటు మన్నె రంజిత్‌యాదవ్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ వంటి స్థానిక యువనేతలు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అభ్యర్థి ప్రకటనపై తొందరపడకుండా... సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే యోచనలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు సమాచారం. -
లక్షన్నర మందితో కేసీఆర్ సభ!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు హాలి యా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈనెల 22–24 తేదీల మధ్య సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించగా సభ నిర్వహణ తేదీకి సంబంధించి నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ ర్రావు హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షన్నర మందిని సమీకరించా లని పార్టీ నేతలు నిర్ణయించారు. సభ నిర్వహణ తేదీకి సంబంధించి మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సోమవారం కలసి చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్ శనివారం జరిపిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సోమ భరత్‌కుమార్ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేకించి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మరోవైపు ఈ సభ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలు వరాలు ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమస్యలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి జాబితా కోరినట్లు సమాచారం. ఫిబ్రవరిలో నామినేటెడ్ పదవుల భర్తీ ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకముందే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను క్రోడీకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తామని సుమా రు ఏడాదిన్నర క్రితం కేసీఆర్ ప్రకటించినా ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నాయకుల్లో అసంతృప్తిని తొలగించేందుకు నామినేటె డ్ పదవుల భర్తీ ప్రక్రియ ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా నల్లగొండ జిల్లా కు చెందిన నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించగా ఫిబ్రవరి మూడో వారంలోగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని పార్టీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓవైపు పల్లా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు కేటీఆర్ కూడా ఉమ్మడి జిల్లాలవారీగా భేటీలు నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక వ్యూహంపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోనూ భేటీ అయిన కేటీఆర్... ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు విభేదాలు తొలగించుకొని ఈ సమావేశానికి రావాల్సిందిగా కేటీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావు తదితరులు మాజీ మంత్రి పువ్వాడ నాగేశ్వర్రావుతో సోమవారం భేటీ అయ్యారు. -
‘సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సుదీర్ఘ కాలం.. వరుస విజయాలతో రికార్డు నమోదు చేసిన జానారెడ్డి(కాంగ్రెస్)పై 2018 ఎన్నికల్లో నోముల(టీఆర్ఎస్) విజయం సాధించారు. ఇక, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న క్రమంలో.. తిరిగి తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికార పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టింది. పార్టీ వర్గాల ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసూ్తనే.. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోందని సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల అనుభవం నేపథ్యంలో ఈసారి గులాబీ అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, దుబ్బాకలో అపజయం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గ్రేటర్’ ఫలితాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీని కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 9 చోట్ల టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కానీ, ఆ వెనువెంటనే 2019లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లోనూ (నల్లగొండ, భువనగిరి) ఓటమిని చవి చూసింది. అయితే, తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయినా, ఇప్పుడు.. నాగార్జునసాగర్‌లో తన స్థానాన్ని తానే నిలబెట్టుకోవాల్సిన ఆత్మరక్షణలో ఆ పార్టీ ఉంది. సమాచార సేకరణలో నిఘా వర్గాలు.. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నోముల నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణంతో ఈ స్థానం నుంచి ఎవరిని పోటీకి పెడతారన్నది చర్చనీయాంశం అయింది. నోముల తనయుడు, భార్యలో ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపైనే ప్రచారం సాగుతోంది. కానీ, దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం వారసత్వ రాజకీయాలపై పునరాలోచన చేస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపికకు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి ఓ నివేదిక సీఎం కేసీఆర్‌కు అందిందని చెబుతున్నారు. -
‘నెల్లికల్’ను నేనే ప్రారంభిస్తా
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : నెల్లికల్ లిఫ్టును పూర్తిచేసే దమ్ము టీఆర్ఎస్ నాయకులకు లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తన చేతులమీదుగానే లిఫ్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని తెలిపారు. సోమవారం తిరులమగిరి మండలంలోని ఎర్రచెరువుతండా, నెల్లికల్, జాల్‌తండా, బట్టువెంకన్నబావితండా, సఫావత్తండా, నాయకునితండా, చింతలపాలెం గ్రామాల్లో తనయుడు రఘువీర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్టును జనవరిలో ప్రారంభించి ఊగాదినాటికి పూర్తిచేస్తామని కొంత మంది నాయకులు చెబుతుంటే లిఫ్టు ఇరిగేషన్‌పై ఏమాత్రం అవహన ఉన్నదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నెల్లికల్ లిఫ్టు ఏర్పాటుకు సహకరించాలని తాను ఢిల్లీ ప్రభుత్వాన్ని గతంలోనే కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని మూడు నెలల్లో ఎలా లిఫ్టును ఏర్పాటు చూస్తారని ప్రశ్నించారు. నెల్లికల్ లిఫ్టు పూర్తయ్యేసరికి ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. లిఫ్టు అనుమతుల కోసం ఎంపీ సుఖేందర్‌రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళితో అక్కడి అధికారులు సమావేశానికి రానివ్వకుండా గెంటేశారని, అలాంటి నాయకుడు లిఫ్టును ఎలా తీసుకువస్తాడని ప్రశ్నించారు. నెల్లికల్ రైతులకు సాగుటిని అందించాలనేదే తన జీవితాశయమని అందులో భాగంగానే తన సొంత ఖర్చులతో 12సార్లు సర్వేలు చేయించి, రూ. 50 కోట్లను విడుదల చేయించినట్లు తెలిపారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి తన ప్రాంతానికి నీటికి అందించాలంటనే నానా అవస్థలు పడ్డాడని సీఎం కేసీఆర్ ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తాడని ప్రశ్నించారు. తునికినూతల, చింతలపాలెం, జమ్మనకోట గ్రామాల్లో ఉన్న లిఫ్టుల మరమ్మతులకు గురై రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత జానారెడ్డిదేనని పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రవేశ్ రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ఇంధిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం, ఉచితంగా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఒకసారి సమితి అధ్యక్షుడిగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ఈ ఎన్నికల్లో కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి మండల అధ్యక్షుడు ఆంగోతు భగవాన్ నాయక్, నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కృష్ణారెడ్డి, తునికినూతల మాజీ సర్పంచ్ రమావత్ లాలు నాయక్, రమావత్ శంకర్ నాయక్, బూడిద ఏడు కొండలు, బొడ్డు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాగర’.. విహారం ఎవరిదో!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ గతంలో చలకుర్తిలో భాగం. 2009 పునర్విభజనలో నాగార్జునసాగర్‌గా మారింది. ఇప్పటి దాకా 9 సార్లు ఎన్నికలు జరిగ్గా ముగ్గురే ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గం వైపు చూస్తోంది. ఎన్.క్రాంతి, నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతి ఎక్కువ కాలం పనిచేసిన మంత్రిగా రికార్డు సొంతం చేసుకున్న జానా రెండుసార్లు టీడీపీ నుంచి, నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించి, ఏడో విజయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేసులో ఉన్న జానాకు ఈ విజయం ఎంతో అవసరం. దీంతో ఆయనకు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఇక్కడ నుంచి చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా .. అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. ఈ గండం నుంచి బయట పడాలని ఆయన ఆరాటపడుతున్నారు. ఒక్కటవుతున్న ...బీసీలు జానారెడ్డిని మినహాయిస్తే, ఇక్కడ నుంచి నిమ్మల రాములు మూడు సార్లు, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ ఓసారి గెలిచారు. వీరిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వారే. నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నా.. ఆ వర్గాల నుంచి బలమైన నాయకత్వం లేకపోవడం జానారెడ్డికి కలిసి వచ్చింది. కానీ, ఈసారి పరిస్థితి మారింది. సీపీఎం సీనియర్ నాయకుడైన నోములు నర్సింహయ్య టీఆర్ఎస్లో చేరి ఇక్కడ బరిలో ఉన్నారు. టీడీపీ సైతం బీసీ నేతనే పోటీకి దించింది. ఈ ఇద్దరు మెజారిటీ ఓట్లున్న ‘యాదవ’ సామాజికవర్గానికి చెందిన వారే. ఇతర బీసీ కులాలను కూడ గట్టే పనిలో నోముల ఉన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా ’ అన్న నినాదంతో నోముల ప్రచారానికి దిగారు. మరోవైపు సీపీఎం తన సంప్రదాయ ఓటుపై ఆధారపడింది. ఈ పార్టీకి చెందిన బీసీ వర్గాలు తమ పార్టీ మాజీ నేత అయిన నోముల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ తన ఓటుబాంకునే నమ్ముకుంది. సంచలనం కోసం వైఎస్సార్సీపీ ప్రయత్నం నాగార్జునసాగర్‌లో సంచలనాన్ని సృష్టించేందుకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంలో అధికంగా ఉన్న రైతుల్లో వైఎస్సార్ పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వైఎస్‌ను ఎవరూ మరిచిపోలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో జరుగుతున్న ఆపనుల వల్లే ఆయకట్టు చివరి భూములకూ నీరందుతోంది. వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా లబ్ధి పొందిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. వీరంతా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాంగ్రెస్ ఓట్లకు వైఎస్ఆర్ సీపీ నుంచి గండి పడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గం: నాగార్జున సాగర్ ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 6, టీడీపీ - 2, స్వతంత్రులు -1 ప్రస్తుత ఎమ్మెల్యే: కె. జానారెడ్డి (కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం. రైసుమిల్లులు అధికం. రైతులు, బీసీల ఓట్లే ఇక్కడ కీలకం ప్రస్తుతం బరిలో నిలిచింది: 13 ప్రధాన అభ్యర్థులు వీరే.. కె.జానారెడ్డి (కాంగ్రెస్) మల్లు రవీందర్‌రెడ్డి ( వైఎస్సార్ సీపీ) కడారి అంజయ్య యాదవ్ (టీడీపీ ) నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) కె. నాగిరెడ్డి (సీపీఎం) నే.. గెలిస్తే.. * తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారానికి కృషి * ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించి లిప్టుల కింద భూములకు సాగునీరు * {పూట్ మార్కెట్ ఏర్పాటుకు కృషి * నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం - కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) * ప్రజాస్వామ్య పునరుద్ధరణ * నగర పంచాయతీగా నాగార్జున సాగర్ ఏర్పాటు * సాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి * వరదకాల్వ, ఎస్ఎల్బీసీ పంట కాల్వల పూర్తి . . హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి - నోముల నర్సింహ్మయ్య (టీఆర్ఎస్) * పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలం * {పతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు * ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ. లక్ష ఎకరాలకు సాగునీరు * నియోజకవర్గంలోని డీఫారెస్ట్ భూములను గిరిజనులకు అందించేందుకు కృషి చేస్తా. - కూన్‌రెడ్డి నాగిరెడ్డి(సీపీఎం) * అన్నీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన * {పతి ఇంటింటికి శుద్ధి చేసిన కష్ణా జలాల సరఫరా * నాగార్జునసాగర్‌ను గ్రామ పంచాయతీగా మార్చడం * హాలియా మండల కేంద్రంలో ఇండోర్, మినీ స్టేడియంల ఏర్పాటు * హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కోనుగోలు కేంద్రం ఏర్పాటు * 500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించడం - మల్లు రవీందర్ రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్) * తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి * కాల్వ ఎగువ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు * {పభుత్వ డిగ్రీ కళాశాల, పాల్టెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి * సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, హాలియాలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి - కడారి అంజయ్య యాదవ్( టీడీపీ) జన తెలంగాణ యువతకు ప్రోత్సాహం.. తెలంగాణ ఉద్యమంలో యువతదే ప్రధాన పాత్ర. తెలంగాణ నవ నిర్మాణంలోనూ వారు కీలకంగా మారనున్నారు. మా ఉద్యోగాలు మాకేనంటూ ఉద్యమించిన వారి ఆశలు నెరవేరాలి. ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలు పెంపొందాలి. యువతకు భరోసానిచ్చే నాయకత్వం రావాలి. యువశక్తిని వినియోగించుకోవాలి. యువజన సంక్షేమశాఖను పటిష్టం చేయాలి. క్రీడ, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహాన్ని అందించాలి. - ఏ. కిరణ్‌కుమార్ జాతీయ యువజన అవార్డు గ్రహీత, కరీంనగర్ అందరికీ నాణ్యమైన విద్య.. ప్రజలు విద్యావంతులైనప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే నవ తెలంగాణ నిర్మాణంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అనేక మంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఇలాంటి వారికి వరం. వేలాది మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. కొత్త రాష్ట్రంలో ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి. - జి.శివకిషోర్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్ వ్యవసాయానికి పెద్దపీట.. కొత్త రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులు దళారుల బారిన పడకుండా మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించాలి. గ్రామీణ ప్రాంత యువత పట్టణాలకు వలస పోకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, పరిశుభ్రమైన తాగునీరు లాంటి ప్రాథమిక అవసరాలను నెరవేర్చడానికి కృషి చేయాలి.పల్లెలు అభివృద్ది చెందితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. - సయ్యద్ అహ్మద్ బోరబండ, హైద్రాబాద్.