లైవ్ అప్‌డేట్స్:
నాన్న గారి ఆశయాలను నెరవేరుస్తా:నోముల భగత్
► నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల భగత్ మీడియాతో స్పందించారు. ‘నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న గారి ఆశయాలను కచ్చితంగా నెరవేస్తున్నాన’ని నోముల భగత్ తెలిపారు. నా గెలుపుకు కృషి చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు.
► నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. 25వ రౌండ్ ముగిసేసరికి 18,449 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్‌ఎస్ 394 ఓట్ల ఆధిక్యం ఉంది. మొత్తం 1384 కాగా, చెల్లనివి 51, టీఆర్‌ఎస్ 822, కాంగ్రెస్ 428, బీజేపీ 30, టీడీపీ 06 ఓట్లు సాధించాయి.
►25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 18449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 2443, కాంగ్రెస్కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 35 ఓట్లు
►24వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 18414 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3312, కాంగ్రెస్కు 2512 ఓట్లు వచ్చాయి. 24వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 800 ఓట్లు
►23 వ రౌండ్లో టీఆర్‌ఎస్ 849 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం టీఆర్‌ఎస్ పార్టీ17,61 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
► 22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 16765 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3783, కాంగ్రెస్ 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 1243 ఓట్లు.
► 21వ రౌండ్లో టీఆర్‌ఎస్ పార్టీ 15,522 ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 3011, టీఆర్‌ఎస్‌కు 3463 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 452 ఓట్ల లీడ్‌లో ఉంది.
► 20వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 15070 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3740, కాంగ్రెస్కు 3146 ఓట్లు వచ్చాయి. 20వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 594 ఓట్లు
► టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతుంది. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 14476 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3732, కాంగ్రెస్కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 1080 ఓట్లు.
► 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్లో టిఆర్‌ఎస్‌కు 4074, కాంగ్రెస్‌కు 2259 ఓట్ల వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 1851 ఓట్లు.
► 17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 11581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 17వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3772, కాంగ్రెస్కు 2349 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 1423 ఓట్లు.
► 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ పార్టీ 10158 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ టీఆర్‌ఎస్‌కు 3475, కాంగ్రెస్కు 3231ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 244 ఓట్లు.
తెలంగాణ భవన్: చలవపందిరికి మంటలు
► సాగర్ ఎన్నికల్లో విజయం దిశగా టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌కు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో చలవ పందిరికి నిప్పురవ్వ అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను ఆర్పారు. సాగర్ టీఆర్ఎస్ ఫలితాల నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్వీట్లు తినిపించుకున్నరు.
Time 12.20
► 15వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 9914 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 15వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3203, కాంగ్రెస్కు 2787ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 416 ఓట్లు.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ మొత్తం 9498 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 14వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 2734, కాంగ్రెస్కు 3817 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్ 1083 ఓట్లు.
► 13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 10581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 13వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3766, కాంగ్రెస్కు 3546 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 220 ఓట్లు.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. వరుసగా 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. 12వ రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్)
► టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 9106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టిఆర్‌ఎస్‌కు 3395, కాంగ్రెస్‌కు 2225 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్లో టీఆర్‌ఎస్ లీడ్ 1170 ఓట్లు.
Time 11.20
► పదో రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ సత్తా చాటింది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. పదో రౌండ్ ముగిసేసరికి 7,963 ఓట్ల ఆధిక్యంలో భగత్(టీఆర్‌ఎస్).
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 7948 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3249, కాంగ్రెస్కు 1893 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ 1356 ఓట్లు.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఏడో రౌండ్ ముగిసేసరికి 6,592 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్) ఉన్నారు.
Time 10.20
► నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 5177 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3989, కాంగ్రెస్కు 3049 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ 940 ఓట్లు.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 4334 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్)
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 2665 ఓట్ల ఆధిక్యం. మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3421, కాంగ్రెస్కు 2882 ఓట్లు వచ్చాయి.
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. రెండో రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్. 2216 ఓట్లతో నోముల భగత్ ముందంజ
► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. తొలి రౌండ్‌లో 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్). తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి.
► తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ 147 ఓట్లతో ఆధిక్యం కనబరుస్తోంది.
► మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది.
► నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది.
► నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ పక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి ఈవీఎం మిషన్‌లను అధికారులు శానిటైజేషన్ చేశారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్స్‌కు అధికారులు తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్‌ఓ రోహిత్ సింగ్, కేంద్ర పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్ సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచారు. కౌంటింగ్ కేంద్రానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివా రం ఉదయం 8 గం.కు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబం ధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే 400 మంది సిబ్బందితో పాటు 300 మంది పోలీసులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నెగెటివ్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్‌లోకి అనుమతిస్తామని ఈసీ ప్రకటించింది.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వేర్వేరు హాళ్లలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment