Bypoll results
-
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
-
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్
-
By-poll Results 2022: ఏడింట్లో నాలుగు బీజేపీకి...
న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఇందులో నాలుగు బీజేపీ గెలుచుకోగా, ఆర్జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీఆర్ఎస్ తలొకటి దక్కించుకున్నాయి. యూపీలోని గోలా గోరఖ్‌నాథ్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. పార్టీకి చెందిన అమన్ గిరి సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీకి చెందిన కుసుమ్ దేవి సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మోహన్ గుప్తాపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే రాష్ట్రంలోని మొకామాలో ఆర్జేడీ అభ్యర్థిని నీలం దేవి 16వేల ఓట్ల మెజారిటీ గెలిచారు. ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేడీకి చెందిన అవంతిదాస్‌పై బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 4,845 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలోని మునుగోడు నుంచి టీఆర్ఎస్కు చెందిన కె.ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ముంబైలోని అంధేరి (వెస్ట్)నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించారు. ఎమ్మెల్యే రమేశ్ లట్కే గత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్ భార్య రుతుజకు పోటీగా బీజేపీ సహా ప్రధానపార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. రెండో స్థానంలో 14.79 శాతం మంది నోటాకు ఓటేశారు. భజన్‌లాల్ మనవడి విజయం హరియాణాలోని ఆదంపూర్‌లో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జై ప్రకాశ్‌పై 16 వేల మెజారిటీ సాధించారు. మాజీ సీఎం భజన్‌లాల్ కుటుంబానికి 1968 నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. భజన్‌లాల్ 9 సార్లు, ఆయన భార్య ఒక పర్యాయం, కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ 4 సార్లు ఇక్కడ విజయం సాధించారు. భజన్‌లాల్ మనవడే భవ్య బిష్ణోయ్. కుల్దీప్ బిష్ణోయ్ ఆగస్ట్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అఖిలేష్ యాదవ్ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు ఒవైసీ. UP by-poll results show Samajwadi Party is inacapable of defeating BJP, they don't have intellectual honesty. Minority community shouldn't vote for such incompetent parties. Who is responsible for BJP's win, now, whom will they name as B-team, C-team:AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/OSdkdkDWOT — ANI (@ANI) June 26, 2022 -
ఫలితాలు అందరికీ పాఠాలే!
ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్దేశిస్తాయా? అంటే, అవునని చెప్పడానికి లేదు. కాదనడానికీ వీల్లేదు! కొన్ని సంకేతాలను స్వీకరించడానికి, పరిస్థితుల్ని విశ్లేషించడానికి, కొంత అన్వయించడానికీ పనికొస్తాయనడంలో సందేహం లేదు. 13 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఇలా చూడాల్సిందే తప్ప లోతుగా తడిమి.. ఇవే ప్రామాణికం, ఇలాగే జరగొచ్చు అని సిద్దాంతీకరించలేం! హిమాచల్‌ప్రదేశ్‌లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి, అస్సాం, పశ్చిమబెంగాల్ ఫలితాలు విపక్ష కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు పని కొస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ఒంటరి ఫలితాల్ని సాధారణీకరించలేం! స్థానికంగా నెలకొన్న రాజకీయ–సామాజిక పరిస్థితుల దృష్టి కోణం నుంచి విడిగా చూడటమే మంచిది. 29 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల మిశ్రమ ఫలితాలతో ప్రధాన పార్టీల్లో అంత ర్మథనం మొదలయింది. ఇతర పార్టీలు కూడా వారి స్థితిని గమనిస్తూ, తమ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల యాత్రలో తమ భవిష్యత్తు ప్రణాళికకు ఈ సంకేతాలు దోహదం చేయొచ్చన్నది యోచన. రెండేళ్లలో వచ్చే పలు శాసనసభల ఎన్నికలు, ఇతర ఉపఎన్నికల్లో వెల్లడయ్యే సంకేతాలు రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలకు దోహదపడతాయి. దేశంలో బలమైన, ప్రతిపక్షంలేని పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండినడక అని బీజేపీ నిమ్మ ళంగా ఉండటానికి వీల్లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విపక్ష కాంగ్రెస్‌కే ఈ ఫలితాలు ఒకింత విస్మయం కలిగించి ఉంటాయి. ప్రస్తుత పాలకులపై ప్రజలకు విశ్వాసం సడలినపుడు, దించి తీరాల్సిందే అని దృఢంగా వారు నిర్ణయించుకున్నపుడు... విపక్ష బలం, సామర్థ్యం లెక్కలోకే రాదని మరోమారు స్పష్టమైంది. అయిదేళ్లకోసారి ప్రత్యామ్నాయానికి పట్టంగట్టే కొండప్రాంత రాష్ట్రంగా హిమాచల్ రాజకీయ చరిత్ర మన కళ్లముందున్నా... బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం, సీఎం జైరామ్ ఠాకూర్ సొంత నియోజకవర్గం ‘మండి’ లోక్‌సభ స్థానాన్ని పోగొట్టుకోవడం కలతకు కారణమే! అంతకంటే ముఖ్యంగా, అయిదారు మాసాల్లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ప్రత్యర్థి కాంగ్రెస్ 48.9 శాతం ఓట్లు సాధిస్తే, తాము 28.1 శాతానికి పడిపోవడం బీజేపీకి మింగుడుపడంది! మిత్రులతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతోందనడానికి అస్సాం, మెఘాలయ, మిజోరాం ఉపఫలితాలు సంకేతమే! పోటీ జరిగిన ఏడు స్థానాల్లో గెలిచారు. కానీ, కేంద్ర నాయకత్వమెంత పటిష్టంగా ఉన్నా.... స్థానిక నాయకత్వం బలంగా ఉండటం, లేకపోవడాన్ని బట్టే ఫలితాలుంటాయనేది బీజేపీ నేర్చుకోవాల్సిన కొత్తపాఠం! హిమంత బిశ్వశర్మ అస్సాంలో, శివ రాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో సాధించిన ఫలితాలు ఇతర సీఎంలు జైరామ్ ఠాకూర్ (హిమా చల్), బస్వరాజ్ బొమ్మై (కర్ణాటక) సాధించలేకపోవడాన్ని గుర్తెరగాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు నువ్వా–నేనా అన్నంత పోటీ ఇచ్చిన పశ్చిమబెంగాల్లో అన్ని స్థానాల్లో ఓటమి, అంతకు మించి భారీ ఓట్ల వ్యత్యాసాలు కనువిప్పే! ‘హిందుత్వ’ బలంగా పనిచేసే హిందీ రాష్ట్రాల్లో నష్టపోయి, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగవడం లాభసాటి వ్యవహారమేం కాదు! ఈ గ్రహింపు వల్లేనేమో, ఈశాన్య భారతంతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం కేంద్రీకరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైఎస్సార్సీపీ లాగా సానుకూల ఓటు సాధించగలిగితే గొప్పే! 2024 సాధారణ ఎన్నికల నాటికి, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ఆ పార్టీ, ఎన్ని రాష్ట్రాల్లో సభాకాలం మూడు, నాలుగేళ్లు దాటుతోందో చూసుకొని జాగ్రత్త పడాలి. కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత కలిస్తే అది మరింత ప్రమాదం. పాలనపై వ్యతిరేకత, నెరవేరని హామీలు, «నిత్యావసరాల ధరల అసాధారణ పెరుగు దల, నిరుద్యోగం, వ్యావసాయిక అశాంతి, కోవిడ్‌తో మందగించిన ఆర్థిక స్థితి... ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేశాయని, చేస్తాయనీ తాజా ఫలితాల నుంచి గ్రహించాలి. దాదర్–నాగర్–హవేలీలో ఇంకా ఫలితం వెలువడక, తాము ఆధిక్యతలో ఉన్నపుడే, ‘2024 ఢిల్లీ పీఠానికి రహదారి ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొదలవుతోంది’ అన్న శివసేన వ్యాఖ్య కొంచెం అతిశయోక్తే! కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూటమికి చెందని ఇతర పక్షాలు ఒక నిజం గ్రహిం చాలి. తాము ఏకం కాకుండా బీజేపీని ఎదుర్కోవడం, వారి ఎన్నికల ఆధిపత్యాన్ని సవాల్ చేయడం దుస్సాధ్యమే! ప్రాంతీయ శక్తులున్న చోట కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రుజువైంది. బీహార్‌లో కాంగ్రెస్ నాలుగో స్థానం ఆర్జేడీ చలువే! చిన్న భాగస్వామిగా తమతో కాంగ్రెస్ కలిసిరావాల్సిన విధిలేని పరిస్థితిని పాఠంగా నేర్పింది. ఆర్జేడీ–కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే, జేడీ(యూ) అంత తేలిగ్గా రెండుచోట్ల నెగ్గేది కాదేమో? ఇక ప్రాంతీయ శక్తులేవీ బలంగాలేని రాజస్తాన్‌లో మూడు, నాలుగు స్థానాల్లోకి జార డంపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాహుల్ నాయకత్వ సామర్థ్యం, శరద్‌పవార్–మమత– మాయావతి వంటి నేతల ఆధిపత్యవాదాలు తమకు అయాచిత వరాలని బీజేపీ భావించొచ్చు! వారంతా స్పర్థలు వీడి, బలమైన ఐక్యకూటమిగా ఏర్పడితే ఫలితాలు భిన్నంగానూ ఉండొచ్చు! విభిన్న పార్శా్వలను తడిమే చర్చకు ఈ ఉపఫలితాలు తెరలేపాయి! -
దేశవ్యాప్తంగా ఉపపోరు ఫలితాలు
లైవ్ అపడేట్స్.... ►4.45pm.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ, హనగల్‌లో కాంగ్రెస్ విజయం ► 4.50pm.పశ్చిమ బెంగాల్ - శాంతిపూర్ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం...ఉపఎన్నిక జరిగిన నాలుగు స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది టీఎంసీ పార్టీ ►4.47pm.. బీహార్ - కుశేశ్వర్లో జనతా దళ్( యూ) పార్టీ అభ్యర్థి గెలుపు ►3.50pm..హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్ నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం ►3.20pm..హర్యానా - ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ అభ్యర్థి అభయ్ చౌతాలా విజయం ► 3.02pm..అస్సాం - తౌరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం, మిగిలిన నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి ముందంజ ► 2.58pm.పశ్చిమ బెంగాల్ - గోశభ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సుభ్రత మొండల్ విజయం పశ్చిమ బెంగాల్ - దిన్హటా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయన్ గుహ విజయం పశ్చిమ బెంగాల్ - ఖర్దా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సోవందేబ్ చటోపాధ్యాయ విజయం ► 2.02pm..మేఘాలయ - రాజబాలా నియోజకర్గంలో ఎన్పీపీ అభ్యర్థి విజయం లోక్‌సభ స్థానాలు... ►01.35pm దాద్రా నగర్ హవేలీ - 15 వేల ఓట్ల ఆధిక్యంలో శివసేన ►12.05pm దాద్రా నగర్ హవేలీ - ఆధిక్యంలో శివసేన పార్టీ, రెండో స్థానంలో బీజేపీ ►12.02pm హిమాచల్ ప్రదేశ్‌లోని మండి - సుమారు 6వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ►11.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన పార్టీ సుమారు 13వేల ఓట్ల ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.45am మధ్యప్రదేశ్- ఖాండ్వాలో బీజేపీ ఆధిక్యం ►10.15 am హిమాచల్ ప్రదేశ్‌లోని మండి- 4704 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ 133458 ఓట్లతో మొదటి స్థానం, బీజేపీ 128754 ఓట్లతో రెండో స్థానం అసెంబ్లీ స్థానాలు... ►1.46pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్ స్థానాల్లో కొనసాగుతున్న ఎన్పీపీ పార్టీ ఆధిక్యం,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం ►1.45pm.. కర్ణాటక - హనగల్‌లో కాంగ్రెస్ 7000 తేడాతో ఆధిక్యం, ►12.36pm.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ ►12.20pm.. రాజస్థాన్ - రెండు స్థానాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం ►12.20pm.. బీహార్ - కుశేశ్వర్లో జనతా దళ్( యూ) పార్టీ 8000 ఆధిక్యం ►12.20pm..బీహార్ - తారాపూర్‌లో 3800 ఓట్లకు పైగా ఆర్జేడీ పార్టీ ఆధిక్యం ►12.18pm..మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒకటి ఆధిక్యంలో ఉన్నాయి ►12.18pm.. హిమాచల్‌ప్రదేశ్- రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ ముందంజ ►12.00pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్ స్థానాల్లో ఎన్పీపీ పార్టీ ముందంజ,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం ►11.48am.. మిజోరాం - తురియాల్లో 900 ఓట్ల ఆధిక్యంలో ఎంఎన్ఎఫ్ పార్టీ ►11.45am..హర్యానా - ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ 6000 ఆధిక్యంతో ముందంజ, రెండో స్థానంలో బీజేపీ ►11.45am.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ భారీ ఆధిక్యం ►11.40am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో సుమారు 8000 ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యం ►11.15am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ►11.05am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ 2000 ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►11.00am.. అస్సాం- ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం ►10.45 am.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►10.45am.. మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం, లోక్‌సభ ►10.25am.. కర్ణాటక- హనగల్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం, సింద్గిలో బీజేపీ ఆధిక్యం ►10.25am.. రాజస్థాన్‌లోని వల్లభనగర్ ( అసెంబ్లీ )- 2540 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ 6624 ఓట్లతో మొదటి స్థానం, రాష్ట్రీయ లోకతంత్రిక పార్టీ 4084 ఓట్లతో రెండో స్థానం, బీజేపీ 3752 ఓట్లతో మూడో స్థానం ►10.25am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.02am పశ్చిమ బెంగాల్- నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు ( నవంబర్ 2) . ఈ ఉప ఎన్నికల్లో చాలా చోట్ల సుమారు 60 శాతం పైనే పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలను పరీశిలిస్తే.. మిజోరాం, తెలంగాణ, హర్యానా, మేఘాలయలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. కాగా ఆక్టోబర్ 30న వీటికి ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాలు... ఆంధ్రప్రదేశ్ - బద్వేల్ తెలంగాణ - హుజూరాబాద్ మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్, మావ్‌ఫ్లాంగ్ బీహార్ - తారాపూర్, కుశేశ్వర్ కర్ణాటక - హనగల్, సింద్గి అస్సాం - గోస్సైగావ్, భబానీపూర్, తముల్పూర్, మరియాని, తౌరా హర్యానా - ఎల్లెనాబాద్ మహారాష్ట్ర - డెగ్లూర్ పశ్చిమ బెంగాల్ - దిన్హటా, శాంతిపూర్, ఖర్దా, గోసాబా మధ్యప్రదేశ్ - జోబాట్, రాయగావ్, ఫృథ్వీపూర్ హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్ మిజోరాం - తురియాల్ రాజస్థాన్ - వల్లభనగర్, ధరియావాడ్ లోక్ సభ స్థానాలు... దాద్రా నగర్ హవేలీ హిమాచల్ ప్రదేశ్- మండి మధ్యప్రదేశ్- ఖాండ్వా -
Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం
భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి 21వ రౌండ్ వరకూ మమత స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతాకు 84,709 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రీవాల్కు 26,320 ఓట్లు వచ్చాయి. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ►19 రౌండ్లు ముగిసేసరికి మమత 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11 రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 34వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11వ రౌండ్ ముగిసే సమయానికి మమతకు 45,874 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు 11,892 ఓట్లు వచ్చాయి. ►బెంగాల్లో ఉపఎన్నిక జరుగుతున్న మరో రెండు చోట్ల జంగీపుర్, సంషేర్‌గంజ్ స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 25వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ► నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 14,435 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై మమత 6,146 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►భవానీపూర్ అసెంబ్లీ నియోజకరవర్గ ఉపఎన్నికలో మమతా బెనర్జీ 2,799 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలో మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక పోటీలో ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు
తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. 2 లక్షల 70 వేలపైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడ్ని అందలం ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి తనానికి ప్రజలు మద్దతు నిచ్చారు. నేటి ప్రజా తీర్పుతో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు. ఫ్యాన్ సునామీలో కొన్ని ప్రత్యర్థి పార్టీల చావు తప్పి కన్ను లొట్టపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మారు మూల గ్రామం.. సామాన్య మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దిల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగుచేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఐదుగురు అక్క చెల్లెల్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. మహానేత స్పూర్తి.. జగనన్న వెన్నంటి.. స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. 2017లో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ‘ప్రజాసంకల్పయాత్ర’లో ఆయన వెంటే ఉన్నారు. నవంబర్ 2017- జనవరి 2019 వరకు 3,648 కి.మీ మేర సాగిన వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయన వెంట నడిచారు. అడుగడుగునా పేదల కష్టాలు చూశారు. ఫిజియోథెరపిస్టు టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీసీ, ఎస్సీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సీఎం జగన్.. డా.గురుమూర్తి పేరు ప్రకటించిన నాడే ఆయన విజయం ఖరారు అయిపోయింది. ప్రజలు గురుమూర్తిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి సంక్షేమ ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ప్రజలపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని.. ప్రజలకు ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేశారు. -
నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం
-
లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్: లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ
-
వైఎస్ జగన్ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి
-
నాగార్జున సాగర్: తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్: పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
-
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం
-
నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపు
లైవ్ అప్డేట్స్: నాన్న గారి ఆశయాలను నెరవేరుస్తా:నోముల భగత్ ► నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ మీడియాతో స్పందించారు. ‘నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న గారి ఆశయాలను కచ్చితంగా నెరవేస్తున్నాన’ని నోముల భగత్ తెలిపారు. నా గెలుపుకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు. ► నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. 25వ రౌండ్ ముగిసేసరికి 18,449 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 394 ఓట్ల ఆధిక్యం ఉంది. మొత్తం 1384 కాగా, చెల్లనివి 51, టీఆర్ఎస్ 822, కాంగ్రెస్ 428, బీజేపీ 30, టీడీపీ 06 ఓట్లు సాధించాయి. ►25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 18449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 2443, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 35 ఓట్లు ►24వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 18414 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3312, కాంగ్రెస్‌కు 2512 ఓట్లు వచ్చాయి. 24వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 800 ఓట్లు ►23 వ రౌండ్లో టీఆర్ఎస్ 849 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ17,61 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ► 22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 16765 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3783, కాంగ్రెస్ 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1243 ఓట్లు. ► 21వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 15,522 ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో కాంగ్రెస్ 3011, టీఆర్ఎస్కు 3463 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ 452 ఓట్ల లీడ్‌లో ఉంది. ► 20వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 15070 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3740, కాంగ్రెస్‌కు 3146 ఓట్లు వచ్చాయి. 20వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 594 ఓట్లు ► టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతుంది. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 14476 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 3732, కాంగ్రెస్‌కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1080 ఓట్లు. ► 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్లో టిఆర్ఎస్కు 4074, కాంగ్రెస్‌కు 2259 ఓట్ల వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1851 ఓట్లు. ► 17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 11581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 17వ రౌండ్లో టీఆర్ఎస్కు 3772, కాంగ్రెస్‌కు 2349 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1423 ఓట్లు. ► 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 10158 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ టీఆర్ఎస్కు 3475, కాంగ్రెస్‌కు 3231ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 244 ఓట్లు. తెలంగాణ భవన్: చలవపందిరికి మంటలు ► సాగర్ ఎన్నికల్లో విజయం దిశగా టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో చలవ పందిరికి నిప్పురవ్వ అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను ఆర్పారు. సాగర్ టీఆర్ఎస్ ఫలితాల నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్వీట్లు తినిపించుకున్నరు. Time 12.20 ► 15వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 9914 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 15వ రౌండ్లో టీఆర్ఎస్కు 3203, కాంగ్రెస్‌కు 2787ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 416 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ మొత్తం 9498 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 14వ రౌండ్లో టీఆర్ఎస్కు 2734, కాంగ్రెస్‌కు 3817 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్లో కాంగ్రెస్ లీడ్ 1083 ఓట్లు. ► 13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 10581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 13వ రౌండ్లో టీఆర్ఎస్కు 3766, కాంగ్రెస్‌కు 3546 ఓట్లు వచ్చాయి. 13వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 220 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. వరుసగా 12వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. 12వ రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ► టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 9106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టిఆర్ఎస్కు 3395, కాంగ్రెస్‌కు 2225 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1170 ఓట్లు. Time 11.20 ► పదో రౌండ్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. పదో రౌండ్ ముగిసేసరికి 7,963 ఓట్ల ఆధిక్యంలో భగత్(టీఆర్ఎస్). ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 7948 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్లో టీఆర్ఎస్కు 3249, కాంగ్రెస్‌కు 1893 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 1356 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఏడో రౌండ్ ముగిసేసరికి 6,592 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ఉన్నారు. Time 10.20 ► నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 5177 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 3989, కాంగ్రెస్‌కు 3049 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 940 ఓట్లు. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. ఐదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 4334 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. నాలుగో రౌండ్లో 3457 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్) ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యం. మూడో రౌండ్లో టీఆర్ఎస్కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు వచ్చాయి. ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. రెండో రౌండ్లో ఆధిక్యంలో టీఆర్ఎస్. 2216 ఓట్లతో నోముల భగత్ ముందంజ ► కొనసాగుతున్న సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు. తొలి రౌండ్లో 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్ఎస్). తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి. ► తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 147 ఓట్లతో ఆధిక్యం కనబరుస్తోంది. ► మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ► నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ► నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ పక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి ఈవీఎం మిషన్లను అధికారులు శానిటైజేషన్ చేశారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్స్‌కు అధికారులు తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్ఓ రోహిత్ సింగ్, కేంద్ర పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్ సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచారు. కౌంటింగ్ కేంద్రానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివా రం ఉదయం 8 గం.కు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబం ధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే 400 మంది సిబ్బందితో పాటు 300 మంది పోలీసులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నెగెటివ్ ఉంటేనే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తామని ఈసీ ప్రకటించింది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వేర్వేరు హాళ్లలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు. -
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
Time: 4:04 PM విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దు.. విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ భారీ విజయం Time: 3:47 PM తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. Time: 3:10 PM 2 లక్షల 25 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. వైఎస్సార్సీపీ మెజార్టీ 2 లక్షల 25 వేలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,25,773 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. Time: 2:48 PM తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 4,61,366(57 శాతం) టీడీపీ- 2,55,271 (31.5 శాతం) బీజేపీ-43,317 (5.4 శాతం) కాంగ్రెస్- 7,233(0.9 శాతం) సీపీఎం- 4,232 (0.6 శాతం) ఇతరులు- 26,316 (3.3 శాతం) నోటా-11,509 (1.4 శాతం) Time: 2:42 PM వైఎస్సార్సీపీ మెజార్టీ 2.12 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2,12,227 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీకి 4,47,819, టీడీపీకి 2,47,408, బీజేపీకి 42,334 ఓట్లు పోలయ్యాయి. Time: 2:06 PM లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ మెజార్టీ లక్షా 81 వేలు దాటింది. ఇప్పటివరకు 1,81,570 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 2,96,678 (56 శాతం) టీడీపీ-1,70,547 (32.2 శాతం) బీజేపీ- 30,519 (5.8 శాతం) కాంగ్రెస్- 4,821 (0.9 శాతం) సీపీఎం- 2,949(0.6 శాతం) ఇతరులు- 16,777 (3.2 శాతం) నోటా- 7,202(1.4 శాతం) Time: 1:50 PM లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఓట్ల సునామీ సృష్టిస్తోంది. 1,42,614 ఆధిక్యంలో వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. టీడీపీ, బీజేపీ వెనుకంజలో ఉన్నాయి. Time: 1:07 PM 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 2,29,424 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి. Time: 12:05 PM వైఎస్సార్సీపీకి తిరుగులేని ఆధిక్యత.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. Time: 10:42 AM వైఎస్సార్సీపీకి భారీ ఆధిక్యం.. తిరుపతి: వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 76,202 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ 57.22 శాతం ఓట్లు సాధించింది. Time: 9:51 AM భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్సీపీ ముందజలో కొనసాగుతోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. Time: 8:53 AM తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది. Time: 8:22 AM పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు. Time: 8:05 AM ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని, లేదా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు చూపించినవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని విజయానంద్ స్పష్టం చేశారు. ఇద్దరు ఏజెంట్లలో ఒక ఏజెంట్ పీపీఈ కిట్ విధిగా ధరించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొ బైల్ ఫోన్స్ అనుమతించరు. అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌం డ్లు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా లేదా ఓట ర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కౌంటింగ్ దృష్ట్యా మే 1 అర్ధరాత్రి నుంచి మే 3 ఉదయం 10 గంటల వరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. గెలిచిన అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేటప్పుడు అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులను మించి అనుమతించరు. అలాగే ఫలితాల తర్వాత ఎటువంటి ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. -
దుబ్బాక ఫలితం.. గందరగోళంలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కీలక నేతలంతా ఎన్నికల క్షేత్రంలో విస్తృతంగా పనిచేసినా ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పీసీసీ చీఫ్ మొదలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతల వరకు దుబ్బాకలో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, బీజేపీ గెలుపొందడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. అంచనాలు తారుమారు 2018 ముందస్తు ఎన్నికల్లో దుబ్బాకలో తమకు 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయనే ధీమాతో టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తోడు చెరుకు ముత్యంరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుకూలత మరికొన్ని ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓట్లను రాబట్టుకొనేందుకు పని విభజన చేసుకొని మరీ టీపీసీసీలోని మహామహులంతా దుబ్బాకలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితం రాలేదు. ‘మా పార్టీకి చెందిన దాదాపు 150 మంది ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలు, మండలాలవారీగా బాధ్యతలు తీసుకొని పనిచేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాకే లాభిస్తుందని అంచనా వేశాం. కానీ మా వ్యూహం ఫలించలేదు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. ఉత్తమ్‌తోపాటు రేవంత్, భట్టి లాంటి నాయకులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన చోట్ల కూడా పార్టీకి లీడ్ రాలేదు. కేవలం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలంలో ఒక రౌండ్లోనే లీడ్ వచ్చింది’అని పీసీసీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోటీ జరిగినప్పుడు బీజేపీకి కనీస స్థాయిలో ఓట్లు రాలేదు. దుబ్బాకలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య జరిగిన పోటీలో మాకు గౌరవప్రదమైన స్థాయిలో 22 వేల ఓట్లు వచ్చాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కానీ, చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఫలితాన్ని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు’అని మరో కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. తదుపరి ఎన్నికల్లో ఏమవుతుందో..? దుబ్బాకలో మూడో స్థానానికి పడిపోవడం, త్వరలో జరిగే ఎన్నికల్లో ఏమవుతుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటే మళ్లీ అవే ఫలితాలు పునరావృతమవుతాయని, మరోసారి టీఆర్ఎస్–బీజేపీల మధ్యే పోటీ జరిగిందనే వాతావరణం ఏర్పడితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణిలో ఎన్నికలు జరుగుతాయని అనుమానిస్తున్నారు. ఆ ధోరణి అలాగే కొనసాగితే తాము పెట్టుకొనే మిషన్–2023 లక్ష్యానికి గండిపడినట్టేననే అభి ప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోతే పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని,అధిష్టానం తీరు మారి రాష్ట్ర పార్టీని గాడిన పెట్టకపోతే మున్ముందు మరిన్ని నష్టాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చదవండి: దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం -
రానున్న ఎన్నికలకు ట్రైలర్ వంటిది: సీఎం
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ విద్వేషపూరిత రాజకీయాలు, ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలకు ట్రైలర్ వంటివని, అప్పుడు కూడా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో 8 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిలో జయకేతనం ఎగురవేసిన కాషాయ పార్టీ.. మరో 5 స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు. ప్రతిచోటా వారికి వ్యతిరేకంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. అధినాయకత్వ లోపం కనబడుతోంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికలకు ట్రైలర్ వంటివి’’ అని పేర్కొన్నారు. (చదవండి: బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం) ఇక రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. అబ్డాసా, మోర్బీ, కర్జన్ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. డాంగ్స్, ధరి, గధాడా, కప్రాడా, లింబ్డీ నియోజకవర్గాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది. కాగా మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా విపక్షాలను చిత్తు చేస్తూ బీజేపీ విజయం దిశగా పయనిస్తూ సత్తా చాటుతోంది. -
ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
ఆ ఇద్దరు పెద్దలు ఇక ఢిల్లీకి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు తమ ఓటమిని అంగీకరించినట్లే అన్నారు రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా. ఇక దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. యూపీలో అధిక్యంలో కొనసాగుతున్నబీజేపీ లక్నో: మద్యప్రదేశ్తోపాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం యూపీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుండగా.. ఎస్పీ 2 స్థానాల్లో.. బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కమల్‌నాథ్ కౌంటింగ్ జరుగుతున్నందున మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 28 సీట్లలో 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో.. కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్న బీజేపీ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 9 స్థానాలోల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. భోపాల్: మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు: మోదీ
బర్హి/బొకారొ: ఉప ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు అద్భుత తీర్పునిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేసి, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికల్లో మంచి గుణపాఠం చెప్పారన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బర్హి, బొకారొల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఉప ఎన్నికలు మూడు విషయాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు, తమ తీర్పును అవమానించినవారికి గుణపాఠం చెప్పారు. మూడు, బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్మారు’ అని అన్నారు.