
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని కొలారస్, ముంగోలి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. తప్పుడు పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని రాహుల్ ట్వీట్ చేశారు. ఉప ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టిన మధ్యప్రదేశ్ ప్రజలు, ఓటర్లు, పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు. పాలక బీజేపీ సర్కార్‌పై నెలకొన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపట్టాయని వ్యాఖ్యానించారు.
తీవ్ర పోటీ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించడంతో త్వరలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది అతేర్, ఖజరహో అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన బైపోల్స్‌లోనూ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 15 ఏళ్ల నుంచి అధికారానికి దూరమైన మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం తమ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment