విదిశ: అవినీతిని కాచుకునే చౌకీదార్(కాపలాదారుడు)ని అని చెప్పుకునే ప్రధాని మోదీ దేశంలోని కాపలాదారులు అందరినీ అవమాని ంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ఇప్పుడెక్కడా ‘చౌకీదార్’ అనే మాట వినిపించినా, ప్రజలు వెంటనే ‘అతను దొంగ’ అని అంటున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపమ్ స్కామ్‌లో రాష్ట్ర సీఎం కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘ఇప్పుడెక్కడ చౌకీదార్ అనే పదం వినిపించినా, ప్రజలు వెంటనే దొంగ అని బదులిస్తున్నారు.
దేశంలోని వాచ్‌మెన్‌లందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. తప్పు మీది కాదు. మీరు దొంగలు కారు..మీరెంతో నిజాయతీపరులు. కానీ మోదీ మీకు చెడ్డపేరు తెచ్చారు’ అని అన్నారు. 2014లో అధికారంలోకి రావడానికి ముందు అవినీతి నిర్మూలన, నిరుద్యోగం, రైతుల సంక్షేమం గురించి ఊదరగొట్టిన మోదీ..ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. వ్యాపమ్, ఈ–టెండరింగ్, మైనింగ్, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు సీఎం మిన్నకుండిపోయారని, ఈసారి పరువు నష్టం గురించి ఎందుకు నోరు మెదపలేదని సీఎంను, ఆయన కొడుకును రాహుల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment