clean sweap
-
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..
-
Lok sabha elections 2024: గిర్ సఫారీలో... మళ్లీ వార్ వన్‌సైడే!
ఏ ఆటగాడైనా సొంత పిచ్‌పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో స్కెచ్ గీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది! వార్ వన్‌సైడే! గుజరాత్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్షరాలా అదే జరిగింది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కటీ దక్కకుండా క్లీన్‌బౌల్డ్ చేశారు మోదీ, అమిత్ షా. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ పశ్చిమ రాష్ట్రం మోదీ రాకతో పూర్తిగా కమలనాథుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈసారీ క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కాషాయదళాన్ని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... స్టేట్స్కాన్గుజరాత్లో ఎన్నికలేవైనా బీజేపీ దెబ్బకు పారీ్టలన్నీ చుక్కలు లెక్కబెడుతున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం సీట్లు తమ ఖాతాలో వేసేసుకుంది. 2009లో 11 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి పోటీ ఇచి్చన హస్తానికి ఆ తర్వాత రాష్ట్రం నుంచి లోక్‌సభలో పదేళ్లుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనైతే ఇరు పారీ్టల ఓట్ల శాతంలో ఏకంగా 30 శాతానికి పైగా అంతరముండటం విశేషం. బీజేపీకి 62.21 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.11 దక్కాయి మిగతా పారీ్టలేవీ ఇక్కడ పెద్దగా సోదిలో లేవు. గత ఎన్నికల్లో 25 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి!కాంగ్రెస్.. ‘ఇండియా’ పోటీనిచ్చేనా!గుజరాత్లో ఎంతో కొంత పుంజుకోవడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతూనే ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కోల్పోయి 17కు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 చోట్ల పోటీ చేస్తుండగా భావనగర్, బారుచ్ స్థానాల్లో ఆప్ బరిలో ఉంది. రైతులు, యువత, మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై ఇండియా కూటమి హామీల వర్షం కురిపిస్తోంది. వాటినే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ వాటికే పెద్దపీట వేయడం తెలిసిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం చుక్కలనంటాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం గుజరాత్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విపక్షాలపై బీజేపీ కక్షగట్టి నేతలను వరుసగా జైలుపాలు చేస్తోందన్న ఇండియా కూటమి ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆప్ కీలక నేతలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు కూడా రంగంలోకి దిగారు.కమలం బోణీ! గుజరాత్లో ఇంకా పోలింగైనా జరగకుండానే తొలి ‘కమలం’ విరబూసింది! కాషాయదళం బోణీ కొట్టేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో తేడా ఉండటంతో నామినేషన్ తిరస్కరణకు గురవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సాలా నామినేషన్ కూడా పలు కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతర పారీ్టల అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ముకేశ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. సర్వేలన్నీ కమలం వైపే దాదాపు అన్ని సర్వేలూ బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా మొత్తం సీట్లను చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేయడం విశేషం.బీజేపీ సమరోత్సాహం...గుజరాత్లో రాజకీయం మోదీకి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బీజేపీ దిగ్గజ నేత కేశూభాయ్ పటేల్ అనారోగ్యం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో 2001 అక్టోబర్‌లో మోదీ అనూహ్యంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఏడాదికే 2002 నాటి గోద్రా రైలు దహనంలో 60 మంది కరసేవకుల మరణం మతకల్లోలాలకు దారి తీసి రాష్ట్రాన్ని కుదిపేసింది. సీఎంగా వాటి అదుపులో మోదీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. అయితే హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు మోదీ. ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి కేంద్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగినా గుజరాత్లో మోదీ పీఠాన్ని మాత్రం కదపలేకపోయింది. అద్వానీకి ప్రత్యామ్నాయంగా 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యరి్థగా మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతో పాటు వ్యూహాత్మకంగా యూపీలోని వారణాసి నుంచీ పోటీ చేసి రెండింటా ఘనవిజయం సాధించారు. బీజేపీకి ఒంటి చేత్తో మెజారిటీ దక్కించి ప్రధాని పగ్గాలు చేపట్టారు.మోదీకి సేనాపతిగా పేరొందిన అమిత్ షా కూడా గుజరాత్లో బీజేపీ పాతుకుపోవడంలో కీలకంగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ సీఎంగా చక్రం తిప్పిన మోదీ ప్రధానిగా కూడా రాష్ట్రాభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారు. దాంతో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. అయినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. కానీ 2022 ఎన్నికల్లో మళ్లీ చతికిలపడింది. 182 సీట్లకు బీజేపీ ఏకంగా 156 స్థానాలతో దుమ్మురేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు అభివృద్ధి అజెండాతో పాటు అయోధ్య రామమందిర సాకారం తదితర అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్.. సొంతగడ్డపై ఘోర పరాభవం
పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు సొంత గడ్డపైనే ఘరో పరాభవం ఎదురైంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 28.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. బెన్ డకెట్ (78 బంతుల్లో 82 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్(43 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు తడబడడంతో 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. జాక్ క్రాలీ 41 పరుగులు, రెహాన్ అహ్మద్ 10 పరుగులు చేసి ఔటవ్వగా.. బెన్ డకెట్, స్టోక్స్‌లు మరో వికెట పడకుండా ఇంగ్లండ్‌ను గెలిపించారు. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్: 304 ఆలౌట్ & 216 ఆలౌట్ ఇంగ్లండ్: 354 ఆలౌట్& 170/2 🏴 3-0 🇵🇰 Whitewash at home 🫣🥱#ENGvPAK || #PAKvENG #TestCricket #WTC23 pic.twitter.com/XWXxGzpwbc — Diptiman Yadav (@Diptiman_yadav9) December 20, 2022 చదవండి: అంపైర్‌కు దడ పుట్టించిన బెన్ స్టోక్స్.. -
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్‌ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్‌పూర్‌నగర్ తదితర పంచాయత్‌లలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్
నార్త్ సౌండ్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. హసరంగ (80 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాషెన్ బండార (55 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం విండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసి గెలిచింది. ఐదేళ్ల తర్వాత డారెన్ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు. షై హోప్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రావో... షై హోప్‌తో మూడో వికెట్‌కు 109 పరుగులు, పొలార్డ్‌తో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షై హోప్ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ చేసిన పదో క్రికెటర్‌గా, విండీస్ నుంచి గార్డన్ గ్రీనిడ్జ్, క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి -
బీజేపీ చేతికి ఉత్తరం
పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనం కాషాయ పక్షానికి ఊహించని విజయాలను అందించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంతలోనే దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యధిక సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ– ఎస్పీ మహా కూటమిగా ఏర్పడి విసిరిన సవాలును తేలిగ్గా తిప్పికొట్టేసింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో 60 సీట్ల వరకూ నిలబెట్టుకుంది. ఈ మహాకూటమి నుంచి ఎదురయ్యే పోటీ వల్ల బీజేపీ 40 సీట్లు గెలిస్తే గొప్పేనన్న అంచనాలు తప్పని కమలదళం రుజువు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా జమ్మూకశ్మీర్‌లో కిందటిసారి గెలిచిన 3 సీట్లను బీజేపీ నిలబెట్టుకుంది. చిన్న రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం సీట్లను మోదీ ప్రభంజనంతో బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90% సీట్లు సొంతం చేసుకుంది. మొత్తంమీద బీజేపీ బలం లోక్‌సభలో 300 సీట్లు దాటడానికి ఉత్తరాది రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటునిచ్చాయి. యూపీలో 11 సీట్లు కోల్పోయిన ఎన్డీఏ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ స్కోరు ఇక్కడ 64 సీట్లకు చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 73 సీట్లు కైవసం చేసుకోవటం గమనార్హం. 2007– 2017 మధ్య పదేళ్లు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఈసారి ఆరెల్డీతో కలిసి మహాకూటమి పేరుతో పోటీచేసి 15 సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ బీజేపీ బలం ఈసారి కాస్త తగ్గింది. వేర్వేరు సామాజికవర్గాల మద్దతు ఉన్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడడంతో తమ ఉనికిని కాపాడుకోగలిగాయి. మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 10, మరో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో గతంలో మూడుసార్లు గెలిచి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనం. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ విజయంతో యూపీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఓటేసింది యోగిని చూసి కాదు: 2017 యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత అనూహ్యంగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాథ్ పాలన బాగోకున్నా ప్రధాని సాధించిన విజయాలకు మెచ్చి బీజేపీకి ఓటేస్తున్నామని ఎన్నికల ముందు సర్వేల్లో ప్రజలు చెప్పారు. అలాగే దాదాపు 10 శాతం జనాభా ఉన్న బీజేపీ పునాది వర్గం బ్రాహ్మణులు యోగి పాలనపై అసంతృప్తి ఉన్నా ఈసారికి మోదీ కోసమే బీజేపీని సమర్థిస్తున్నామన్నారు. ఓ సీటు పెరిగింది మధ్యప్రదేశ్‌లో కాషాయం స్వీప్ 29 సీట్లున్న బీజేపీ కంచుకోట మధ్యప్రదేశ్‌లో... కాషాయపక్షం ఈసారి 29 స్థానాలకుగాను 28 స్థానాలు కైవసం చేసుకుంది. కిందటిసారి ఎన్నికలతో పోల్చితే ఒక సీటు పెరిగింది. 1993– 2018 మధ్య రాష్ట్రాన్ని పదిహేడు సంవత్సరాలు పాలించాక బీజేపీ 2018 డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని సర్కారు ఐదు నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇంతటి భారీ విజయం సొంతం చేసుకుంటుందని రాజకీయ పండితులెవరూ ఊహించలేకపోయారు. రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ సర్కారు సక్రమంగా అమలు చేయకపోవడం, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి బీజేపీ విజయానికి కారణమైంది. 2014లో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒకటైన గుణాలో గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబసభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ భోపాల్ నుంచి పోటీచేసి ‘హిందుత్వ’ ప్రతినిధి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. ప్రగ్యకు టికెట్ ఇవ్వడం, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోగా మేలే జరిగిందని ఫలితాలు నిరూపించాయి. హిందుత్వ కాషాయ రాజకీయాలకు పునాది అయిన మధ్యప్రదేశ్ మోదీ మళ్లీ ప్రధాని కావడానికి తన వంతు సాయమందించింది. పంజాబ్‌లో కాంగ్రెస్ నిలదొక్కుకుంది పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో పాలకపక్షమైన కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకొని ఆధిక్యం నిలబెట్టుకుంది. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పనితీరుతోపాటు అకాలీదళ్–బీజేపీ కూటమిని చాకచక్యంగా ఎదుర్కొంది. 2017 ఎన్నికలకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఈ కూటమికి ఉన్న చెడ్డపేరు కూడా కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది. కిందటిసారి 4 సీట్లు గెలుచుకున్న ‘ఆప్’.. ఈసారి ఒక సీటే గెలుచుకోగా అకాలీదళ్, బీజేపీలు చెరో రెండు సీట్లు సాధించాయి. పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో బీజేపీ జాతీయవాదం పనిచేయలేదు. హరియాణాలో క్లీన్‌స్వీప్ కిందటి సారి బీజేపీకి ఏడు సీట్లు అందించిన హరియాణాలోని మొత్తం పది లోక్‌సభ సీట్లనూ కాషాయపక్షం కైవసం చేసుకుంది. బీజేపీ తొలి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం ఎక్కువ. పంజాబీ ఖత్రీ అయిన ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన బీజేపీ ఈసారి లోక్‌సభ టికెట్ల కేటాయింపులో కులాలవారీ పద్ధతికి స్వస్తి చెప్పింది. కొత్త ప్రయోగాలతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలపాటు బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ కుటుంబాల ఆధిపత్యంలో మగ్గిన హరియాణాలో బీజేపీ పది లోక్‌సభ సీట్లు దక్కించుకోవడం అసాధారణ విజయంగా భావించవచ్చు. మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హూడా, ఆయన కొడుకు దీపేందర్ ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ ‘షాక్’ కిందటి డిసెంబర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల పాలన తర్వాత ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆరు నెలలు తిరగకుండానే మొత్తం 11 సీట్లలో 9 కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. మిగిలిన రెండు సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పరువు కాపాడుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతోందని తేలింది. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం, హిందుత్వ ప్రభావం లేని కారణంగా బీజేపీకి మూడు నాలుగు సీట్లొస్తే గొప్పేనన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. కశ్మీర్.. నిలబడిన బీజేపీ బలం జమ్మూ కశ్మీర్లో 2014 ఎన్నికల్లో జమ్మూ,, లద్దాఖ్‌లోని మూడు సీట్లు మొదటిసారి గెలిచిన బీజేపీ ఈసారి ఈ స్థానాలు నిలబెట్టుకుంది. కిందటిసారి మిగిలిన మూడు సీట్లు సాధించిన జేకే పీడీపీ ఈసారి కశ్మీర్ లోయలోని ఆ సీట్లను కోల్పోయింది. ఈ స్థానాలను ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం ఆధిపత్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు కొన్నాళ్లు నడిపింది. చివరికి బీజేపీ వైదొలగడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పీడీపీకి జనాదరణ తగ్గి నేషనల్ కాన్ఫరెన్స్ మళ్లీ పుంజుకోగలిగింది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ఐదూ బీజేపీకే హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ మొత్తం ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక త్రివేంద్రసింగ్ రావత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో ఈసారి హిందుత్వ, జాతీయవాదం ప్రభావం పనిచేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ రెండో విజయం కిందటి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన సినీ నటి కిరణ్ ఖేర్ రెండోసారి గెలిచారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించినా ఆమె టికెట్ సాధించి మరీ విజయం సాధించారు. హిమాచల్.. పాత ఫలితాలే పునరావృతం.. బీజేపీకి బలమైన పునాదులున్న మరో హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కాషాయపక్షం వరుసగా రెండోసారి మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంది. 2017 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జైరాం ఠాకూర్ సీఎం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్రాం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వస్తాయన్న అంచనా తప్పయింది. ఢిల్లీలో బీజేపీకి మళ్లీ ఏడు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. 2014 మోదీ ప్రభంజనంలో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఆప్, కాంగ్రెస్ మొదట పొత్తుకు ప్రయత్నించి విఫలంకావడం బీజేపీ విజయానికి ఒక కారణం. -
చౌకీదార్లను అవమానించారు
విదిశ: అవినీతిని కాచుకునే చౌకీదార్(కాపలాదారుడు)ని అని చెప్పుకునే ప్రధాని మోదీ దేశంలోని కాపలాదారులు అందరినీ అవమాని ంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ఇప్పుడెక్కడా ‘చౌకీదార్’ అనే మాట వినిపించినా, ప్రజలు వెంటనే ‘అతను దొంగ’ అని అంటున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపమ్ స్కామ్‌లో రాష్ట్ర సీఎం కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘ఇప్పుడెక్కడ చౌకీదార్ అనే పదం వినిపించినా, ప్రజలు వెంటనే దొంగ అని బదులిస్తున్నారు. దేశంలోని వాచ్మెన్లందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. తప్పు మీది కాదు. మీరు దొంగలు కారు..మీరెంతో నిజాయతీపరులు. కానీ మోదీ మీకు చెడ్డపేరు తెచ్చారు’ అని అన్నారు. 2014లో అధికారంలోకి రావడానికి ముందు అవినీతి నిర్మూలన, నిరుద్యోగం, రైతుల సంక్షేమం గురించి ఊదరగొట్టిన మోదీ..ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. వ్యాపమ్, ఈ–టెండరింగ్, మైనింగ్, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు సీఎం మిన్నకుండిపోయారని, ఈసారి పరువు నష్టం గురించి ఎందుకు నోరు మెదపలేదని సీఎంను, ఆయన కొడుకును రాహుల్ ప్రశ్నించారు. -
కేపీ.. క్లీన్ స్వీప్
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స, ఇండస్ట్రీ ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి వెలువడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కటకం పెంటయ్య ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికి ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన దిడ్డి కుమారస్వామిపై కటకం పెంటయ్య విజయం సాధించగా, ఆయన ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారే కాకుండా ఐదుగురు కార్యవర్గ సభ్యులు గెలిచారు. ఫలితాలు వెలువడగానే పెంటయ్య వర్గీయులు చాంబర్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. - వరంగల్ సిటీ -
భారత్ క్లీన్‌స్వీప్
ఇండోర్: డేవిస్‌కప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని మళ్లీ మెరిశాడు. భారత్ సంపూర్ణ విజయానికి తన వంతు సహకారం అందించాడు. దీంతో డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భారత్ 5-0తో చైనీస్ తైపీపై క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లే గెలిచారు. తెలుగు కుర్రాడు సాకేత్ 2-0 సెట్లతో సంగ్ హూ యంగ్‌పై, యూకీ బాంబ్రీ 2-0 సెట్లతో సియెన్ యిన్ పెంగ్‌పై జయభేరి మోగించారు. మొత్తం మీద ఓ జట్టుపై వైట్‌వాష్ సాధించడం 2005 తర్వాత భారత్‌కిదే తొలిసారి. తాజా విజయంతో ఏప్రిల్‌లో జరిగే రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదిస్తుంది. సాకేత్ మెరుపులు తాను ఆడుతున్న తొలి డేవిస్‌కప్ పోరులో సాకేత్ మైనేని సత్తాచాటుకున్నాడు. శనివారం డబుల్స్‌లో అదరగొట్టిన ఈ ఏపీ ఆటగాడు ఆదివారం సింగిల్స్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 26 ఏళ్ల మైనేని తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడు సంగ్ హూ యంగ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ 313వ ర్యాంకర్ సాకేత్ 6-1, 6-4తో కేవలం 48 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించడం విశేషం. యూకీ ఖాతాలో మరో గెలుపు తొలి సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చిన ఢిల్లీ ఆటగాడు యూకీ బాంబ్రీ రివర్స్ సింగిల్స్‌లోనూ తన జోరు కొనసాగించాడు. 22 ఏళ్ల యూకీ 7-5, 6-0తో సియెన్ యిన్ పెంగ్‌పై గెలుపొందాడు. ఇతను కూడా గంటలోపే (55 నిమిషాల్లోనే) ప్రత్యర్థిపై జయకేతనం ఎగురవేశాడు. తొలి సెట్లో గట్టి పోటీనిచ్చిన పెంగ్ రెండో సెట్లో యూకీ బాంబ్రీ ధాటికి చేతులెత్తేశాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ మ్యాజికే విజయాలందించింది. కేవలం ఐటీఎఫ్ టోర్నీలే కాకుండా ఇదే ఉత్సాహంతో ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయర్స్పై కూడా దృష్టిసారిస్తాను. ఫిట్నెస్ను కాపాడుకుంటూనే ఆటలో నైపుణ్యాన్ని సాధిస్తా’ - సాకేత్ మైనేని -
క్లీన్‌స్వీప్‌పై భారత్ ‘ఎ’ దృష్టి
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్ ‘ఎ’తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత ‘ఎ’ జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో ఇరు జట్లు గురువారం ఇక్కడ తలపడనున్నాయి. టెస్టు సిరీస్ డ్రాగా ముగిసిన అనంతరం వన్డేల్లో చెలరేగిన భారత్ రెండు మ్యాచుల్లోనూ సంపూర్ణ ఆధిక్యం కనబరిచింది. రిజర్వ్‌కు అవకాశం... టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఉన్ముక్త్ చంద్ వన్డేల్లో కెప్టెన్‌గా సత్తా చాటుతూ 94, 59 పరుగులు చేశాడు. తొలి వన్డేలో రాబిన్ ఉతప్ప కూడా సెంచరీతో చెలరేగాడు. ఈ ఇద్దరు మరోసారి రాణిస్తే భారత్‌కు మరో విజయం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాకపోయినా రెండో వన్డేలో మిడిలార్డర్ ఆటగాళ్లు మన్దీప్ సింగ్, జాదవ్, మనేరియా మెరుగైన ప్రదర్శన కనబర్చారు. బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి, రాహుల్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత రెండు వన్డేల్లో అవకాశం దక్కని బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్, బౌలర్ జలజ్ సక్సేనాలకు ఈసారి తుది జట్టులో చోటు లభించవచ్చు. పరువు కోసం... మరోవైపు సిరీస్ ఓడిపోయినా గెలుపుతో ఈ పర్యటనను ముగించాలని కివీస్ భావిస్తోంది. మొత్తం టూర్లో విజయమన్నదే ఎరుగని ఈ టీమ్ చివరి వన్డే నెగ్గాలని పట్టుదలగా ఉంది. అయితే అది అంత సులభం కాదు. కార్ల్ కచోపా ఒక్కడే రెండు మ్యాచుల్లోనూ రాణించగా, ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో న్యూజిలాండ్ వెనుకబడింది. ల్యూక్ రాంచీ, లాథమ్ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. మరోవైపు బలహీనమైన బౌలింగ్‌తో భారత్‌ను ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. -
నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో టెస్టు
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న భారత్-ఎ జట్టు ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై దృష్టిపెట్టింది. నేటి (శనివారం) నుంచి ఎల్సీ డివిలియర్స్ స్టేడియంలో జరిగే నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో ప్రొటీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్టులో ఇన్నింగ్ 13 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించిన టీమిండియా ప్రస్తుతం పూర్తి విశ్వాసంతో ఉంది. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడుకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.