దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్‌ | West Indies Clean Sweap Odi Series Against Srilanka | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్‌

Published Tue, Mar 16 2021 8:23 AM | Last Updated on Tue, Mar 16 2021 8:55 AM

West Indies Clean Sweap Odi Series Against Srilanka - Sakshi

నార్త్‌ సౌండ్‌: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. హసరంగ (80 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాషెన్‌ బండార (55 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం విండీస్‌ 48.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసి గెలిచింది. ఐదేళ్ల తర్వాత డారెన్‌ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు. షై హోప్‌ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (53 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశాడు.


‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్రావో... షై హోప్‌తో మూడో వికెట్‌కు 109 పరుగులు, పొలార్డ్‌తో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ షై హోప్‌ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో కనీసం  అర్ధ సెంచరీ చేసిన పదో క్రికెటర్‌గా, విండీస్‌ నుంచి గార్డన్‌ గ్రీనిడ్జ్, క్రిస్‌ గేల్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 
చదవండి:
టీమిండియాకు జరిమానా.. కోవిడ్‌ తర్వాత మూడోసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement