Shai Hope
-
చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్.. విండీస్‌దే సిరీస్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. మొదటి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఊహించని రీతిలో పుంజుకున్న బంగ్లా 101 పరుగుల తేడాతో విండీస్‌ను కంగుతినిపించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.అనంతరం.. సెయింట్ కిట్స్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే జోరులో మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలోనూ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది.స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళబంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ తాంజిద్ హసన్(46) ఫర్వాలేదనిపించగా.. వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అర్ధ శతకం(62)తో మెరిశాడు. వీరికి తోడు అనూహ్యంగా టెయిలెండర్ తంజీమ్ హసన్ సకీబ్ 45 పరుగులతో రాణించాడు. స్పెషలిస్టు బ్యాటర్లు విఫలమైన వేళ.. ఈ బౌలర్ బ్యాట్ ఝులిపించి నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చెలరేగిన జేడన్ సీల్స్.. దంచికొట్టిన కింగ్ఇక విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటీ రెండు, మిండ్లే, రొమారియో షెఫర్డ్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు సాధించాడు.మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ 49 రన్స్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ షాయీ హోప్(17)తో కలిసి షెర్ఫానే రూథర్‌ఫర్డ్(24 ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు నష్టయి 230 పరుగులు చేసిన వెస్టిండీస్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. విండీస్ పేసర్ జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్- విండీస్ మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.చదవండి: SMT 2024: షమీ మళ్లీ మాయ చేస్తాడా?.. నేటి నుంచే ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్స్ పోరు -
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
కెప్టెన్‌తో గొడవ.. జోసెఫ్‌నకు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు జోషఫ్ దూరం కానున్నాడు. బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేం జరిగిందంటే?బుధవారం(నవంబర్ 6) ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ తమ కెప్టెన్ షాయ్ హోప్‌తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్‌నకు నచ్చలేదు.దీంతో హోప్‌తో జోసెఫ్ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్‌ను కొనసాగించాడు. ఆ ఓవర్లో కాక్స్‌ను ఔట్ చేసిన జోసెఫ్‌నకు కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.సారీ చెప్పిన జోషఫ్ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్ కెప్టెన్ హోప్‌తో పాటు జట్టు మేనెజ్మెంట్కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖరి వన్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్పటికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్మెంట్కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో జోసెఫ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 9న జరగనున్న తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. -
WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్
బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అసలేం జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్‌డౌన్‌లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్‌కు నచ్చలేదు. దీంతో హోప్‌తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను జోషఫ్ కొనసాగించాడు.ఆ ఓవర్లో నాలుగో బంతికి కాక్స్‌ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?Gets angry! 😡Bowls a wicket maiden 👊Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024 -
రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్‌తో తేలనుంది.లీగ్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్‌ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (37 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (34 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆజమ్ ఖాన్ 17 బంతుల్లో 26 పరుగులు.. రొమారియో షెపర్డ్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తీక్షణ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, కేశవ్ మహారాజ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ (34 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. క్వింటన్ డికాక్ ఓ మోస్తరు స్కోర్ (35) చేశాడు. వీరిద్దరు మినహా రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గడకేశ్ మోటీ 3, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో 2, ప్రిటోరియస్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే.. -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 205.17 స్ట్రయిక్‌రేట్‌తో 12 సిక్సర్లు బాదాడు. -
టీ20 వరల్డ్‌కప్‌లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
అమెరికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ షాయీ హోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో రెచ్చిపోయే విండీస్ వీరుల జాబితాలో చేరాడు.ఇక బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ స్పిన్నర్ రోస్టన్ చేజ్(3/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల సిక్సర్ల హవాఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 11.. ఇంగ్లండ్ మీద👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 10.. సౌతాఫ్రికా మీద👉ఆరోన్ జోన్స్(అమెరికా)- 10.. కెనడా మీద👉రిలీ రొసోవ్(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్ మీద👉నికోలస్ పూరన్(వెస్టిండీస్)-8.. అఫ్గనిస్తాన్ మీద👉షాయీ హోప్(వెస్టిండీస్)-8.. అమెరికా మీద..టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు👉నికోలసన్ పూరన్(వెస్టిండీస్)- 17(2024 ఇప్పటి వరకు)👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- 16(2012)👉మార్లన్ సామ్యూల్స్- 15(2012)👉షేన్ వాట్సన్- 15(2012). చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి! View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాయీ హోప్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్‌రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్‌రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్‌గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్‌ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన విండీస్ కెప్టెన్.. ఇదంతా ధోని వల్లే అంటూ!
West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఆంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన వన్డేలో మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న షాయీ హోప్.. 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విండీస్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం తన అద్బుత ఇన్నింగ్స్ గురించి షాయీ హోప్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇచ్చాడు. ‘‘నా సెంచరీ జట్టు విజయానికి కారణమైనందుకు సంతోషిస్తున్నా. మేము మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేను ఎంఎస్ ధోనితో మాట్లాడాను. అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించమని చెప్పాడు. కీలక సమయంలో వికెట్ కాపాడుకోవడం ముఖ్యమన్నాడు. ఈరోజు అలాగే ఆడాను. షెఫర్డ్ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విజయంతో సిరీస్‌ను ఆరంభించడం సంతోషం. తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తున్నాం’’ అని షాయి హోప్ పేర్కొన్నాడు. క్యాచ్‌లు డ్రాప్ చేయడం వంటి తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్తపడతామని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలోనే ఛేదించింది. సిక్సర్‌తో విండీస్ విజయాన్ని ఖరారు చేసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయి హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20: గిల్‌కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్‌కప్‌లో ఆడాలంటే! Scenes in Antigua after the win!🇦🇬#WIvENG #WIHomeforChristmas pic.twitter.com/H68vzqu0Yo — Windies Cricket (@windiescricket) December 3, 2023 -
WI VS ENG 1st ODI: విరాట్ రికార్డును సమం చేసిన షాయ్ హోప్
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్‌లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్.. విండీస్ రికార్డు విజయం
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్లో విండీస్ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్‌పై విండీస్ ఈ ఫీట్‌ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విండీస్‌కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాణించిన బ్రూక్.. మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్‌తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ (3) నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోటీ, ఒషేన్ థామస్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, యానిక్ కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. శతక్కొట్టిన హోప్.. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. షాయ్ హోప్ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) 48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49) రాణించగా.. బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. -
వెస్టిండీస్ కెప్టెన్ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో వెస్టిండీస్ వన్డే కెప్టెన్, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ఉదయం బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గయానా బ్యాటర్ షాయ్ హోప్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హోప్ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ వేసిన రహ్కీమ్ కార్న్‌వాల్ బౌలింగ్‌లో హోప్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హోప్ 9ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. హోప్ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. దీంతో 88 పరుగుల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ క్లార్క్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ RIDICULOUS SCENES!!! Shai Hope hits Rahkeem Cornwall for 32 in the over to reach his first CPL 💯 🙌 - A clear winner for Republic Bank Play of the Day#CPL23 #GAWvBR#CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/NCYi5OZerX — CPL T20 (@CPL) September 18, 2023 -
టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్‌ల మధ్య ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లిలకు జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌కు కూడా విశ్రాంతినిచ్చింది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కీలకమైన మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్ మాత్రం సేమ్ జట్టుతోనే బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విండీస్, టీమిండియాల్లో మూడో వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో వన్డేలో ఓడినా ప్రయోగాలు ఆపని టీమిండియా మూడో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి. భారత్(ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ చదవండి: హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్‌టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్‌లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్‌లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్‌లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్‌పై.. తర్వాత పసలేని బౌలింగ్‌పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్‌తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్‌డౌన్‌లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్‌మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్‌నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్‌కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్‌నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్‌మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మేం కసితో ఆడాం.. నాకు ముందే తెలుసు! తర్వాతి మ్యాచ్ కూడా: హోప్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు చానాళ్ల తర్వాత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో భారత్‌ను కట్టడిచేసిన కరేబియన్లు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటారు. తొలుత టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (55), శుబ్‌మన్ గిల్(34) రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని అతడు కొనియాడాడు. "మనం ఫిప్టీలు, సెంచరీలు చేసినా జట్టు విజయం సాధించకపోతే సంతృప్తి ఉండదు. కానీ ఈ మ్యాచ్‌లో నా ఫిప్టీతో పాటు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. మేము పూర్తి కసితో ఆడాం. మేము ఒక యూనిట్‌గా రాణిస్తే ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ విన్నింగ్ క్రెడిట్ బౌలర్లకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం మా ఖాతాలో ఒక్క విజయం ఉంది. మేము సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. చివరి మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హోప్ పేర్కొన్నాడు. చదవండి: #Stuart Broad: ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
Ind vs WI: కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ అవుట్
West Indies vs India, 2nd ODI: బార్బడోస్ వేదికగా టీమిండియా రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన విండీస్ సారథి షాయీ హోప్... తొలుత భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. బౌలింగ్‌లో రాణించి టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. రోమన్ పావెల్, డ్రేక్స్ స్థానంలో అల్జారీ జోసెఫ్, కార్టీ తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే రెండో వన్డేలో స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. రోహిత్, కోహ్లి స్థానాల్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చినట్లు పాండ్యా తెలిపాడు. 1-0తో ఆధిక్యంలో.. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తొలి సిరీస్‌లో విండీస్‌తో తలపడ్డ రోహిత్ సేన 1-0తో ట్రోఫీ గెలిచింది. మలి టెస్టులోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించగా వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో జూలై 27న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగగా.. టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక బార్బడోస్‌లో తొలి వన్డేలో జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్‌కు రెండో మ్యాచ్‌లో అవకాశం వచ్చింది. తుది జట్లు టీమిండియా శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్. చదవండి: బీటెక్ చదివిన టీమిండియా స్టార్.. ధోని, కోహ్లిలతో పాటు! ఆస్తి 100 కోట్లు! -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు
వెస్టిండీస్‌తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని ఉపయోగించుకోనుంది. కాగా తుది జట్టు ఎలా ఉండబోతుందో ముందే అంచనాకు వచ్చినప్పటికి వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్‌వైపే మొగ్గుచూపాడు. ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ ఫిఫ్టీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఇషాన్‌కు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. రెండో టెస్టులో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్లు పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ హార్దిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా జడేజా మరో స్పిన్నర్‌గా ఉన్నాడు. టెస్టు సిరీస్ ఓడినప్పటికి వెస్టిండీస్ వన్డే జట్టు మాత్రం కాస్త సీనియర్లతో నిండిఉంది. ఇటీవలే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో రాణించిన కెప్టెన్ షెయ్ హోప్ సహా కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, డొమినిక్ డ్రేక్స్ , షిమ్రోన్ హెట్‌మైర్, రోవ్‌మెన్ పావెల్‌లు జట్టులో ఉన్నారు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ India vs West Indies, 1st ODI: India Opt To Field vs West Indies, Mukesh Kumar To Debut#INDvsWI #ODIs #BCCI #Cricket #debu pic.twitter.com/pTx9hbPji4 — Smart Locus (@SmartLocusIN) July 27, 2023 చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించాడు! Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
అప్పుడలా జరిగింది.. ఇప్పుడు వేరు! మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం: విండీస్ కెప్టెన్
West Indies vs India, 1st ODI: టీమిండియాతో వన్డే సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తామని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్న లోపాలు సరిచేసుకుని, సమస్యలు అధిగమించి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ అయిన విండీస్ ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. టాప్-8లో నేరుగా అడుగుపెట్టలేకపోయిన షాయీ హోప్ బృందం.. జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్స్ ఆడింది. ఈ క్రమంలో యూఎస్ఏ, యూఏఈ, నేపాల్ వంటి పసికూనలపై గెలిచిన విండీస్.. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓడి పరాజయాల ఖాతా తెరిచింది. ఘోర పరాభవం అనంతరం.. వర్షం కారణంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ టై కావడం.. ఆపై సూపర్ ఓవర్లో ఓటమి, ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో చిత్తైన నేపథ్యంలో టాప్-2లో నిలవాలన్న వెస్టిండీస్ ఆశలకు గండిపడింది. ఆపై ఒమన్‌పై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్ టాప్-10లో అడుగుపెట్టగా.. విండీస్ ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో ఘోర పరాభవం తర్వాత పటిష్ట టీమిండియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా గురువారం (జూలై 27)న మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన విండీస్ సారథి షాయీ హోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మేమేంటో ప్రపంచానికి చూపిస్తాం ‘‘తిరిగి పుంజుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం. వైవిధ్యమైన వన్డే ఫార్మాట్లో మా నైపుణ్యాలు ప్రదర్శించి.. మేం చేయగలమో ప్రపంచానికి చూపించే మరో అవకాశం దొరికింది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా అయితే విజయం మాదే లోపాలు సరిచేసుకుని మళ్లీ కొత్తగా మా ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి అందరికీ గెలిచే అవకాశం రాకపోవచ్చు. అయితే, లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం చేసే ప్రయత్నాల్లో మాత్రం లోపం ఉండకూడదు. అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది’’ అని షాయీ హోప్ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు. అతడు తిరిగి రావడం సంతోషం ఇక షిమ్రన్ హెట్మెయిర్ జట్టులోకి తిరిగి రావడంపై స్పందిస్తూ.. ‘‘బౌలర్లపై విరుచుపడుతూ దూకుడగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మా జట్టులో ఉన్న నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్ అతడు. హెట్మెయిర్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’అని షాయీ హోప్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా షాయీ హోప్‌నకు స్వదేశంలో తొలి వన్డే ఇది. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
వెస్టిండీస్... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. కరీబియన్ బౌలింగ్ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్‌కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్‌కు కరీబియన్ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్ అభిమానులకే కాదు... క్రికెట్ విశ్లేషకులకు పెద్ద షాక్! ICC Cricket World Cup Qualifiers 2023- హరారే: వెస్టిండీస్ ప్రపంచకప్ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్ చేతిలో పరాభవంతో కరీబియన్ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో బ్రాండన్ కింగ్ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్ (0), బ్రూక్స్ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్ షై హోప్ (13), కైల్ మేయర్స్ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్–5 వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు. తలరాతను తలకిందులు చేశాడు షెఫర్డ్ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన హోల్డర్ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్‌ములెన్ 3, క్రిస్ సోల్, మార్క్‌వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ఓపెన్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు), మెక్‌ములెన్ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించి విండీస్ ‘కప్’ రాతను కాలరాశారు. కరీబియన్‌కు ఎందుకీ దుస్థితి? జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాలి... భారత్‌కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్‌తో కీలకమైన సూపర్ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్ బౌలర్) వేయరు. నిలకడేలేని బ్యాటింగ్‌తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు. కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్ ఆటగాళ్లంతా టీమ్ స్పిరిట్ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్‌లపై కష్టపడటం నేర్చారు. దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్‌ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్‌లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు. ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్‌లు వదిలేయడాలు, మిస్‌ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే! వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. గెలవాలనే పట్టుదల, కసి మిగిలిన మ్యాచ్‌లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు. గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్కాట్లాండ్ చేతిలో ఓడి రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్ రేసు నుంచి అవుట్ తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా అవుట్