రాణించిన హోప్‌, హెట్‌మైర్‌.. సరిపోని డుప్లెసిస్‌ మెరుపులు | CPL 2024: Guyana Amazon Warriors Beat Saint Lucia Kings By 35 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

CPL 2024 GAW Vs SLK: రాణించిన హోప్‌, హెట్‌మైర్‌.. సరిపోని డుప్లెసిస్‌ మెరుపులు

Published Sun, Sep 29 2024 2:46 PM | Last Updated on Sun, Sep 29 2024 4:02 PM

CPL 2024: Guyana Amazon Warriors Beat Saint Lucia Kings By 35 Runs

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ చివరి దశకు చేరుకుంది. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌ తర్వాత ప్లే ఆఫ్స్‌ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్‌ నాలుగు బెర్త్‌లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్‌తో తేలనుంది.లీగ్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 28) గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్‌ వారియర్స్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రాణించిన హోప్‌, హోట్‌మైర్‌
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌.. షాయ్‌ హోప్‌ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ (26), ఆజమ్‌ ఖాన్‌ (26), రొమారియో షెపర్డ్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్‌ బౌలర్లలో డేవిడ్‌ వీస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ అహ్మద్‌, అల్జరీ జోసఫ్‌ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

సరిపోని డుప్లెసిస్‌ మెరుపులు
అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్‌ (59 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్‌ (21 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్‌ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్‌ మెరుపులు సరిపోలేదు. వారియర్స్‌ బౌలర్లలో మోటీ, మొయిన్‌, తాహిర్‌ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్‌ను దెబ్బకొట్టారు.

చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement