వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో విండీస్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కి విండీస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జత కలిసిన హోప్, పూరన్ జోడీ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాని జోడించి తమ జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (29), జేసన్ హోల్డర్ (16 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్ (10-0-34-3), అల్జరీ జోసఫ్ (10-0-45-2), కీమో పాల్ (10-1-63-2), అకీల్ హొస్సేన్ (10-1-49-2), కైల్ మేయర్స్ (6.4-0-37-1) ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకే అలౌటై ఓటమిపాలైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (63) అర్ధసెంచరీ సాధించగా.. గుల్సన్ ఝా (42), రోహిత్ పౌడెల్ (30), ఆసిఫ్ షేక్ (28), కరణ్ (28), దీపేంద్ర సింగ్ (23) రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో విండీస్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైన నేపాల్ నాలుగో స్థానానికి పడిపోయింది.గ్రూప్-ఏలో ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్‌ఏను మట్టికరిపించిన నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు చేరుకోగా.. ఆడిన 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన జాంబాబ్వే.. విండీస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన యూఎస్‌ఏ ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరింది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment