CWC Qualifiers 2023 WI VS NEP: వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 22) జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్ షాయ్ హోప్ (129 బంతుల్లో 132; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్‌లో 15వ శతకాన్ని నమోదు చేయగా.. టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకాన్ని బాదాడు.
ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద 39 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్.. పాయింట్ల పట్టికలో (గ్రూప్-ఏ) జింబాబ్వే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-బిలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఒమన్ టాపర్‌గా, శ్రీలంక, స్కాట్లాండ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి.
2019 వరల్డ్‌కప్ తర్వాత హోప్‌ను మించినోడే లేడు..
విండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ వన్డేల్లో భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో హోప్ ఏకంగా 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాది, అత్యధిక పరుగులు (47 ఇన్నింగ్స్‌ల్లో 2153 పరుగులు) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హోప్‌కు కాస్త దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఎవరైనా ఉన్నాడంటే అది బాబర్ ఆజమ్ అని చెప్పాలి. బాబర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 1876 పరుగులు చేసి హోప్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment