రెండుసార్లు ప్రపంచకప్ విజేత.. అరవీర భయంకరమైన బౌలర్లు.. అదే స్థాయిలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడిన బ్యాటర్లు.. నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్‌ను శాసించిన వైనం. ఇప్పుడు అదంతా గతం. తాజాగా వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం కోసం వరల్డ్‌కప్ క్వాలిఫయర్ పోరులో ఆడాల్సిన దుస్థితి వెస్టిండీస్‌కు ఎదురైంది.
అయితే శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే ఓటమి ఆ జట్టును డేంజర్ జోన్‌లో పడేసింది. క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా లీగ్ దశలో సాధించిన విజయాల ఆధారంగా వచ్చే పాయింట్లు సూపర్ సిక్స్‌లో లెక్కిస్తారు. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్ 2లో ఉన్న జట్లు భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి.
ఇక మ్యాచ్‌లో విండీస్ ఓడినప్పటికి సూపర్ సిక్స్ దశకు చేరుకున్నా రెండు పాయింట్లు మాత్రం కోల్పోయింది. ఇది సూపర్‌సిక్స్ దశలో ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. లీగ్‌లో వెస్టిండీస్ తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్-ఏ నుంచి టాప్-2గా అడుగుపెడుతుంది. ఇక జింబాబ్వే తన ఆఖరి పోరులో అమెరికాను ఎదుర్కొంటుంది.
ఏదైనా సంచలనం నమోదైతే తప్ప జింబాబ్వే గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఎందుకంటే జింబాబ్వే గ్రూప్ టాపర్‌గా ఉంటుంది కాబట్టి విండీస్ సూపర్ సిక్స్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో విఫలమవుతుంది.
చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై
Comments
Please login to add a commentAdd a comment