
ధోనికి అవకాశం ఇచ్చిన హోప్
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. సారథి విరాట్ కోహ్లి మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే యత్రం చేస్తున్నాడు. అయితే ఆరంభంలోనే ధోని ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చెత్త కీపింగ్‌తో అవుటయ్యే ప్రమాదం నుంచి ధోని తప్పించుకున్నాడు. స్పిన్నర్ ఫబియన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ధోని ముందుకచ్చి ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే బ్యాట్‌కు దూరంగా వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడింది. అయితే తొలి ప్రయత్నంలో స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు. అయితే ఔట్ అని ఫిక్స్ అయిన ధోని లేట్‌గా స్పందించాడు. దీంతో హోప్‌కు మరో అవకాశం లభించింది. అప్పటికీ స్టంపౌట్ చేయడంలో హోప్ విఫలమయ్యాడు. వెంటనే తేరుకున్న ధోని క్రీజులోకి తిరిగొచ్చాడు. దీంతో ఒక్కసారిగా టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు ధోని ఊపిరిపీల్చుకున్నాడు. అయితే ఇదే సమయంలో హోప్ విసిరిన త్రో మిస్ కావడంతో బై రూపంలో టీమిండియాకు ఒక పరుగు కూడా లభించడం విశేషం. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. ఇక అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో ధోని స్టంపౌట్ అయిన విషయం తెలిసిందే.