వెస్టిండీస్ క్రికెట్ జట్టు చానాళ్ల తర్వాత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో భారత్‌ను కట్టడిచేసిన కరేబియన్లు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటారు.
తొలుత టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (55), శుబ్‌మన్ గిల్(34) రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని అతడు కొనియాడాడు.
"మనం ఫిప్టీలు, సెంచరీలు చేసినా జట్టు విజయం సాధించకపోతే సంతృప్తి ఉండదు. కానీ ఈ మ్యాచ్‌లో నా ఫిప్టీతో పాటు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. మేము పూర్తి కసితో ఆడాం.
మేము ఒక యూనిట్‌గా రాణిస్తే ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని నాకు ముందే తెలుసు. ఈ విన్నింగ్ క్రెడిట్ బౌలర్లకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం మా ఖాతాలో ఒక్క విజయం ఉంది. మేము సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. చివరి మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హోప్ పేర్కొన్నాడు.
చదవండి: #Stuart Broad: ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు
Comments
Please login to add a commentAdd a comment