దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌లో ప్రోటీస్‌తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది.
అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్‌మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్‌లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో విండీస్ తరపున ఆడాడు.
వెస్టిండీస్ వన్డే జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్
వెస్టిండీస్ టీ20జట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్‌కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్
చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!
Comments
Please login to add a commentAdd a comment