వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 36 ఏళ్ల షానన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2010 దశకంలో షానన్‌కు విండీస్ ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు ఉండింది. 2012-23 మధ్యలో అతను 59 టెస్ట్‌లు, 25 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
షానన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్‌ల్లో బాగా రాణించాడు. షానన్ టెస్ట్‌ల్లో 166 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. షానన్ వన్డేల్లో 33, టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 12 ఏళ్ల కెరీర్‌లో విండీస్ క్రికెట్ కోసం నన్ను నేను అంకితం చేసుకున్నాను. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
అన్ని మంచి విషయాలు ఏదో ఒక రోజు ముగియాలి. తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావించి వీడ్కోలు పలుకుతున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా ఉండి సహకరించిన వారందకీ ధన్యవాదాలు అని షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో రాసుకొచ్చాడు. కాగా, షానన్ 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో విండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను గతేడాది భారత్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment