Shannon Gabriel
-
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఫాస్ట్ బౌలర్
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 36 ఏళ్ల షానన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2010 దశకంలో షానన్‌కు విండీస్ ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు ఉండింది. 2012-23 మధ్యలో అతను 59 టెస్ట్‌లు, 25 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. షానన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్‌ల్లో బాగా రాణించాడు. షానన్ టెస్ట్‌ల్లో 166 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. షానన్ వన్డేల్లో 33, టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 12 ఏళ్ల కెరీర్లో విండీస్ క్రికెట్ కోసం నన్ను నేను అంకితం చేసుకున్నాను. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అన్ని మంచి విషయాలు ఏదో ఒక రోజు ముగియాలి. తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావించి వీడ్కోలు పలుకుతున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా ఉండి సహకరించిన వారందకీ ధన్యవాదాలు అని షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో రాసుకొచ్చాడు. కాగా, షానన్ 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో విండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను గతేడాది భారత్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! నాలుగేళ్ల తర్వాత బౌలర్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌లో ప్రోటీస్‌తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్‌మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్‌లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో విండీస్ తరపున ఆడాడు. వెస్టిండీస్ వన్డే జట్టు షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వెస్టిండీస్ టీ20జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్‌కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్ చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
జింబాబ్వేతో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సీనియర్ పేసర్ రీ ఎంట్రీ
జింబాబ్వేతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. ఇక సీనియర్ పేసర్ షానన్ గాబ్రియేల్‌కు విండీస్ సెలక్టర్లు మళ్లీ పిలుపు ఇచ్చారు. గాబ్రియేల్ చివరగా 2021లో శ్రీలంకపై టెస్టుల్లో ఆడాడు. అదే విధంగా వెటరన్ బ్యాటర్ జోమల్ వారికన్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వారికన్ కూడా 2021లో చివరగా శ్రీలంకపై టెస్టు మ్యాచ్ ఆడాడు. స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇక రెండు టెస్టులు కూడా బులవాయో వేదికగానే జరగనున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి తొలి టెస్టు జరగనుండగా.. ఫిబ్రవరి 12 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. జింబాబ్వేతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), న్క్రుమా బోన్నర్, టాగ్నరైన్ చందర్‌పాల్, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రేమోన్ థామస్ రీఫర్, రేమోన్ రోయిఫర్, , జోమెల్ వారికన్ చదవండి: India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి -
క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌలర్ షానన్ గాబ్రియేల్ సహచరు క్రికెటర్ డారెన్ బ్రావోపై నోరు పారేసుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ హెన్రీ నికోలస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న బ్రావో జారవిడిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గాబ్రియేల్ బ్రావోనుద్దేశించి 'ఫక్ యూ..' అనే అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయం స్టంపింగ్ మైక్‌లో రికార్డు అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అలా గాబ్రియేల్ బౌలింగ్‌లో 47 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నికోలస్ ఆ తర్వాత 174 పరుగులు చేసి తన టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం క్యాచ్ వదిలేసినందుకు ఎవరైనా ఇలా తిడతారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పుట్టినరోజునాడే యువీ ఎమోషనల్ ట్వీట్) ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఫేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో అన్ని రకాలుగా తేలిపోయింది. మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెన్రీ నికోలస్ 174 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 42 బంతుల్లోనే 66 పరుగులు చేసిన బౌలర్ వాగ్నర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. జోషు దా సిల్వ, చేమర్ హోల్డర్ క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లో కైల్ జేమిసన్ 5 వికెట్లతో చెలరేగగా.. సౌతీ 3 వికెట్లతో రాణించాడు.(చదవండి : 'పేడ మొహాలు,చెత్త గేమ్‌ప్లే అంటూ..') 🔊 Volume up for this one! Fair to say that Shannon Gabriel wasn't too happy with Darren Bravo today 😂🤬 #NZvWI pic.twitter.com/eWBCpA5vKr — Aaron Murphy (@AaronMurphyFS) December 11, 2020 -
‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!
సౌతాంప్టన్: త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌కు సంబంధించి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేవని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాల్ గాబ్రియెల్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తనకు ఆడే అవకాశం వస్తే పరిస్థితుల్నే బట్టి ప్రణాళికలు ఉంటాయన్నాడు. ఇక గతేడాది ఇంగ్లండ్‌తో సెయింట్ లూసియాలో జరిగిన మూడో టెస్టులో జోరూట్‌ను స్లెడ్జ్ చేసిన గాబ్రియెల్ నాలుగు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా?’ అంటూ కామెంట్ చేసి నిషేధం బారిన పడ్డాడు. దీనిపై అప్పట్లో రూట్ కూడా గాబ్రియెల్‌కు తిరిగి కౌంటర్ ఇచ్చాడు. ‘గే గా ఉండటంలో తప్పులేదు కదా.. మీ దేశంలో గే సెక్స్ నేరం కావొచ్చు’ అని పేర్కొన్నాడు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) తాజాగా ఆ వివాదంపై గాబ్రియెల్‌ను కాన్ఫరెన్స్‌లో రిపోర్టర్లు అడగ్గా, అందుకు సమాధానం ఇస్తూ..‘ అది ముగిసిన వివాదం. దాన్ని పెద్దదిగా చూడటం లేదు. దాన్ని మరచిపోవాలనుకుంటున్నా. అదే సమయంలో మరొకసారి ఆ తరహా కామెంట్లు చేసే ఉద్దేశం కూడా లేదు. అది వ్యక్తిగత పరిహాసం. మీరు ఆట యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉన్నంత వరకూ కొంచె వ్యక్తిగత పరిహాసం కూడా ఉంటుంది. అప్పుడు చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేందుకు చేసినవి కావు. ఆటలో కాస్త పరిహాసం కూడా ఉంటుంది. ఈ విషయంలో పెద్దగా మార్పు వస్తుందని అనుకోను. నాకు రూట్ ఒక్కడే టార్గెట్ కాదు. ఇంగ్లండ్ జట్టు మొత్తం టార్గెట్. నాకు ఆడే అవకాశం వస్తే రూట్, స్టోక్స్ ఇలా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకోకూడదు. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. నా పూర్తిస్థాయి ప్రదర్శనతో వారిని కట్టడి చేస్తా’ అని తెలిపాడు. ఇప్పటివరకూ 45 టెస్టులు ఆడిన గాబ్రియెల్.. వంద శాతం ప్రదర్శన చేయకపోతే ఎవరినైనా కట్టడి చేయడం కష్టమేనన్నాడు. ఇక గతేడాది కరీబియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ప్రణాళికలే ఇక్కడ కూడా ఉంటాయన్నాడు. అందులో పెద్దగా మార్పులు ఉంటాయని అనుకోవడం లేదన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై8 వ తేదీ నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగనుంది.(రోహిత్ నా రోల్ మోడల్: పాక్ క్రికెటర్) -
నేను రూట్‌తో అన్నది ఇదే..
సెయింట్ లూసియా: ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ జోరూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ పేసర్ షానన్ గాబ్రియేల్‌పై నాలుగు వన్డేల నిషేధం పడిన సంగతి తెలిసిందే. అయితే రూట్‌తో తాను ఏమన్నది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విచారణలో గాబ్రియేల్ వెల్లడించాడు. తాను కేవలం నీకు పురుషులంటే ఇష్టమా అని మాత్రమే అడిగానని, గే అన్న పదంతో తనకు సంబంధం లేదన్నాడు. ‘మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో మేం ఒత్తిడిలో ఉన్న సమయంలో బౌలింగ్‌కు దిగా. అప్పుడు రూట్ నన్ను చూసి నవ్వాడు. అటువంటి పరిస్థితుల్లో నవ్వడం ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే వ్యూహం అయి ఉండొచ్చు. దాంతో ఎందుకు నవ్వుతున్నావు రూట్. నీకు పురుషులంటే ఇష్టమా అని అడిగా’ అని గాబ్రియెల్ వెల్లడించాడు. అందుకు రూట్.. ‘గే అన్న పదాన్ని గేలి చేసేందుకు ఉపయోగించకు. గే గా ఉండడంలో తప్పులేదని రూట్ బదులిచ్చాడు. అయితే గే అన్న దానితో నాకు సంబంధంలేదు. నువ్వు మాత్రం నన్ను చూసి నవ్వడం ఆపు అని రూట్‌కు సమాధానమిచ్చా’ అని మాత్రమే రూట్‌కు సమాధానమిచ్చానని గాబ్రియెల్ తెలిపాడు. ఇక్కడ చదవండి: విండీస్ పేసర్‌పై 4 వన్డేల నిషేధం గే అయితే తప్పేంటి?: జో రూట్ -
విండీస్ పేసర్‌పై 4 వన్డేల నిషేధం
దుబాయి: ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ జోరూట్‌ను ‘గే’ గా సంబోంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ పేసర్ షెనాన్ గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాబ్రియెల్‌పై విచారణ చేపట్టిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమైంది. గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం పాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది. తాజా ఘటన తర్వాత గాబ్రియెల్ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరాయి. దాంతో అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి లేక నాలుగు వన్డేల నిషేధానికి సమానం. ఈ క్రమంలోనే గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మూడో టెస్టులో భాగంగా జో రూట్- షానన్ గాబ్రియల్ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆట లో జో రూట్-జో డెన్లీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విండీస్ పేసర్ గాబ్రియల్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దాంతో జో రూట్‌ను గేగా సంబోంధించడానే అభియోగాలపై ఐసీసీ విచారణ చేపట్టింది. అనంతరం గాబ్రియెల్‌పై డీమెరిట్ పాయింట్ల ఆధారంగా నాలుగు వన్డేల నిషేధం విధించింది.