
జింబాబ్వేతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. ఇక సీనియర్ పేసర్ షానన్ గాబ్రియేల్‌కు విండీస్ సెలక్టర్లు మళ్లీ పిలుపు ఇచ్చారు. గాబ్రియేల్ చివరగా 2021లో శ్రీలంకపై టెస్టుల్లో ఆడాడు.
అదే విధంగా వెటరన్ బ్యాటర్ జోమల్ వారికన్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వారికన్ కూడా 2021లో చివరగా శ్రీలంకపై టెస్టు మ్యాచ్ ఆడాడు. స్పిన్నర్ గుడాకేష్ మోటీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇక రెండు టెస్టులు కూడా బులవాయో వేదికగానే జరగనున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి తొలి టెస్టు జరగనుండగా.. ఫిబ్రవరి 12 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
జింబాబ్వేతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), న్క్రుమా బోన్నర్, టాగ్నరైన్ చందర్‌పాల్, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రేమోన్ థామస్ రీఫర్, రేమోన్ రోయిఫర్, , జోమెల్ వారికన్
చదవండి: India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి
Comments
Please login to add a commentAdd a comment