రాణించిన ఐరీష్‌ కెప్టెన్‌.. జింబాబ్వే లక్ష్యం 292 | Zimbabwe need 254 runs to win with 7 wickets remaining | Sakshi
Sakshi News home page

IRE ve ZIM: రాణించిన ఐరీష్‌ కెప్టెన్‌.. జింబాబ్వే లక్ష్యం 292

Published Sun, Feb 9 2025 11:13 AM | Last Updated on Sun, Feb 9 2025 11:45 AM

Zimbabwe need 254 runs to win with 7 wickets remaining

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్‌... ఆతిథ్య జట్టు ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం మూడో రోజు 83/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్‌ 93.3 ఓవర్లలో 298 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ ఆండీ బాల్బిర్నీ (60; 2 ఫోర్లు), లార్కన్‌ టక్కర్‌ (58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. 

జింబాబ్వే బౌలర్లలో ఎన్‌గరవ 4, ట్రెవర్‌ వాండు, వెస్లీ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కలిపి 292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే... మూడో రోజు ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.

టాపార్డర్‌ బ్యాటర్లు కైటానో (14; 3 ఫోర్లు), బెన్‌ కరన్‌ (4), నిక్‌ వెల్చ్‌ (5) వికెట్లను పారేసుకోగా... ఆట నిలిచే సమయానికి బ్రియాన్‌ బెన్నెట్‌ (15 బ్యాటింగ్, 1 ఫోర్‌), ట్రెవర్‌ వాండు (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడేర్, బారీ మెకార్తీ, మాథ్యూ హంఫ్రేస్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్నప్పటికీ జింబాబ్వే విజయానికి 254 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లున్నాయి.
చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్‌ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement