
ఐర్లాండ్‌తో చివరి మ్యాచ్ రద్దు
హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
కెప్టెన్ సికందర్ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment