
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 విజేతగా ఎంఐ కేప్‌టౌన్ నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 76 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఎంఐ కేప్‌టౌన్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( 15 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 33), రాస్సీ వాన్‌డర్‌డుస్సెన్(23) అద్బుతమైన ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఎస్టర్‌హుజెన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 39), డెవాల్డ్ బ్రెవిస్(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్, డాసన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, మార్‌క్రమ్ చెరో వికెట్ సాధించారు.
నిప్పులు చెరిగిన రబాడ..
అనంతరం 182 పరుగుల భారీ లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్ల దాటికి ఈస్ట్రన్ కేప్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో టామ్ అబెల్(30),టోనీ డిజోర్జే(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఎంఐ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో నిప్పులు చెరగగా.. బౌల్ట్, లిండే తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రషీద్ ఖాన్, కార్బన్ బోష్ తలా వికెట్ సాధించారు. దీంతో వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌గా నిలవాలనుకున్న సన్‌రైజర్స్ ఆశలపై ఎంఐ కేప్‌టౌన్ నీళ్లు చల్లింది.
ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జాన్సెన్..
ఇక ఈ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. 13 మ్యాచ్‌ల్లో 18.42 సగటుతో జాన్సెన్ 19 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ జాన్సెన్ 204 పరుగులు చేశాడు.
చదవండి: PAK vs NZ: ఫిలిప్స్ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్