Sunrisers Eastern Cape
-
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్. -
రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్ అవతరించింది. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈస్టర్న్ కేప్.. తుదిపోరులోనే తమకు తిరుగులేదని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. కావ్య పాప సెలబ్రేషన్స్.. ఇక ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంబరాలు అంబరాలను అంటాయి. డర్బన్ ఆఖరి వికెట్ రీస్ టోప్లీ ఔట్ అవ్వగానే కావ్య పాప ఎగిరి గంతేసింది. వెంటనే మైదానంలో వచ్చి తమ జట్టు ఆటగాళ్లను కావ్య అభినంధించింది. అంతకముందు సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కూడా బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య స్టాండ్స్‌లో నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఆ తర్వాత మైదానంలో కావ్య మాట్లాడుతూ.. రెండో సారి ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కావ్య సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్లో కూడా కావ్య స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటుంది. చదవండి: SA20 2024: సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా] Here comes the winning message from kavya herself,her voice is very sweet tbh ❤️ #Bundesliga #RealMadrid #OrangeArmy #SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION #ILT20 #SA20Finalpic.twitter.com/9RrJcj8lZB — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 Congratulations to Sunrisers Eastern Cape and boys for making Kavya maran win another title 🫣#SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION pic.twitter.com/e5fMnxnqrI — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 -
సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో స్టబ్స్(56), అబెల్(55) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెర్మెన్(42), మార్క్రమ్(42) పరుగులతో రాణించారు. డర్బన్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, టాప్లీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ 115 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్ 5 వికెట్లతో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు బార్ట్‌మన్, వారెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. డర్బన్ బ్యాటర్లలో ముల్డర్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ కీలక పోరులో హాఫ్ సెంచరీతో చెలరేగిన అబెల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన హెన్రిస్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. కాగా గతేడాది జరిగిన తొట్టతొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకుంది. -
పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో దాదాపు రెండు సెకండ్లపాటు గాల్లోనే ఉన్న మార్కరమ్ విజయవంతంగా క్యాచ్ పట్టి.. కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్- డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడింది. కేప్‌టౌన్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ను ఆదిలోనే కష్టాలపాలైంది. అతడికి తోడుగా వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) రాణించినా మిగతా వాళ్ల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు. ఒంటిచేత్తో సంచలన క్యాచ్ ఈ క్రమంలో రైజర్స్ పేసర్ల ధాటికి తలవంచిన డర్బన్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ 2024-ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మార్కరమ్ పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. డర్బన్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ ఐదో బంతికి రైజర్స్ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో.. నాలుగో నంబర్ బ్యాటర్ జేజే స్మట్స్ మిడాన్ దిశగా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగానే మెరుపువేగంతో కదిలిన మార్కరమ్ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. 4 బంతులు ఎదుర్కొన్న స్మట్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చదవండి: దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ 𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్‌తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్‌మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్‌కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 31 బంతుల్లో
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో లైడ్ డాసన్, మార్కో జనెసన్, స్వాన్‌పోయెల్ తలా రెండు వికెట్లు సాధించారు. పార్ల్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానెసన్ విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు టామ్ ఎబెల్ 46 పరుగులతో రాణించాడు. కాగా సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. చదవండి: IND vs ENG: డబుల్ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్ -
ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్.. ఆ రెండు జట్లు కూడా!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో పాటు పార్ల్ రాయల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్‌తో కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో స్ధానం కోసం సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, ఏంఐ కేప్‌టౌన్ పోటీపడతున్నాయి. నిప్పులు చేరిగిన సన్‌రైజర్స్ పేసర్లు.. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్‌పోయెల్, జానెసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మాడ్సెన్ (32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ముగించారు. -
జట్టు నిండా విధ్వంసకర వీరులే... కట్ చేస్తే 78 పరుగులకే ఆలౌట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. జోబర్గ్ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. జో బర్గ్ కెప్టెన్ డుప్లెసిస్, రెజా హెండ్రిక్స్, మొయిన్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా 3 వికెట్లతో జోబర్గ్ పతనాన్ని శాసించగా.. స్వాన్‌పోయెల్, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ..11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ఫినిష్ చేశారు. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్ -
జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ప్రిటోరియా క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ పేసర్లు నిప్పులు చేరగడంతో ప్రిటోరియా 13.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే కుప్పకూలింది. క్యాపిటల్స్ బ్యాటర్లలో ఓపెనర్లు విల్ జాక్స్(12), సాల్ట్(10) మినహా మిగితా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ 4 వికెట్లతో క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. వారెల్ మూడు, మార్కో జానెసన్ రెండు వికెట్లు సాధించారు. అయితే జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రిటోరియా 52 పరుగులకే ఆలౌట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. క్యాపిటల్స్ జట్టులో ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, రూసో, నీషమ్ వంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా 52 పరుగులకే ఆలౌటైన ప్రిటోరియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ప్రిటోరియా నిలిచింది. 6.5 ఓవర్లలోనే.. 53 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 6. 5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో సన్‌రైజర్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ప్రిటోరియా చవిచూసింది. చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు! -
సన్‌రైజర్స్ ఓపెనర్ మెరుపు శతకం.. పోరాడి ఓడిన ముంబై
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటకీ.. ముంబై ఆటగాళ్లు గట్టిగా పోరాడటంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. సన్‌రైజర్స్ బౌలర్ ఒట్నీల్ (4-0-35-3) బార్ట్‌మన్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ముంబై గెలుపును అడ్డుకున్నాడు. ముంబై చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒట్నీల్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్ జోర్డన్ హెర్మన్ (62 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ (37 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమతమై స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వాన్ డర్ డస్సెన్ (41), ర్యాన్ రికెల్టన్ (58), సామ్ కర్రన్ (37 నాటౌట్), కీరన్ పోలార్డ్ (24) ముంబైను గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. ఒట్నీల్ బార్ట్‌మన్ (3/35) ముంబైని దెబ్బకొట్టాడు. డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్‌కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ఉండింది. సన్‌రైజర్స్‌కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్‌లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్‌రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్‌లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
సన్‌రైజర్స్ కొత్త సారధి పేరు ప్రకటన.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..?
Aiden Markram: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇవాళ (ఫిబ్రవరి 23) తమ నూతన సారధి పేరును అధికారికంగా ప్రకటించింది. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్ఏ20) తమ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన సఫారీ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. నిరీక్షణకు తెరపడింది.. ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు హలో చెప్పండి అంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP — SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023 కాగా, ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ రేసులో మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్రమ్లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్ వైపు మొగ్గు చూపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సమర్థ్ వ్యాస్, గ్లెన్ ఫిలిప్స్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, అకీల్ హొసేన్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే -
ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ.. తొలి మినీ ఐపీఎల్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. CHAMPIONS‼️‼️‼️@SunrisersEC are the winners of the inaugural #Betway #SA20 🏆 The title is heading to Gqeberha‼️@Betway_India pic.twitter.com/ODHLNdtQke — Betway SA20 (@SA20_League) February 12, 2023 వాన్ డెర్ మెర్వ్ 4, మగాలా, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు, జన్సెన్, మార్క్రమ్ చెరో వికెట్ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. That winning moment 🧡🧡🧡#Betway #SA20 @Betway_India pic.twitter.com/b1uI45aYr0 — Betway SA20 (@SA20_League) February 12, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఆడమ్ రొస్సింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్ (22), కెప్టెన్ మార్క్రమ్ (26), జన్సెస్ (13 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఇనాగురల్ ఎడిషన్ (2023) ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా జొహనెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా వేస్తున్నట్లు లీగ్ కమీషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుందని స్మిత్ వెల్లడించారు. స్థానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం మేరకు రేపు వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్) యాజమాన్యం కొనుగోలు చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫ్రాంచైజీలు తొట్టతొలి ఎస్ఏ20 లీగ్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ రాయల్స్)ను మట్టికరిపించి క్యాపిటల్స్.. రెండో సెమీఫైనల్లో జోబర్గ్ సూపర్‌కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)పై విజయం సాధించి సన్‌రైజర్స్ తుదిపోరుకు అర్హత సాధించాయి. పలు మార్పులు చేర్పుల తర్వాత సన్‌రైజర్స్, క్యాపిటల్స్ పూర్తి జట్లు ఇలా ఉన్నాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్: ఆడమ్ రొస్సింగ్టన్ (వికెట్‌కీపర్), టెంబా బవుమా, జోర్డాన్ హెర్మన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, జోర్డన్ కాక్స్, మార్కో జన్సెన్, బ్రైడన్ కార్స్, ఒట్నీల్ బార్ట్‌మన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సిసండ మగాలా, జెజె స్మట్స్, జేమ్స్ ఫుల్లర్, అయబెలేల క్వమేన్, మెసన్ క్రేన్, సరల్ ఎర్వీ, మార్కస్ ఆకెర్మెన్, జనైద్ దావూద్ ప్రిటోరియా క్యాపిటల్స్: ఫిలిప్ సాల్ట్, కుశాల్ మెండిస్, థెయునిస్ డి బ్రూన్, రిలీ రొస్సో, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్, ఈథన్ బోష్, సెనూరన్ ముత్తుస్వామి, మిగేల్ ప్రిటోరియస్, ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, డేరిన్ డుపావిల్లోన్, జాషువ లిటిల్, విల్ జాక్స్, వేన్ పార్నెల్, క్లైడ్ ఫోర్టిన్, కెమరూన్ డెల్పోర్ట్, షాన్ ఓన్ బర్గ్, మార్కో మరియాస్, షేన్ డాడ్స్వెల్ -
మార్కరమ్ సూపర్ సెంచరీ.. ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అడుగు పెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్బెర్త్ను సన్‌రైజర్స్ ఖారారు చేసుకుంది. సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మార్కరమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 6 సిక్స్‌లు, 6 ఫోర్లుతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు సాధించాడు. పోరాడి ఓడిన సూపర్ కింగ్స్ 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో విజయానికి 14 పరుగుల దూరంలో సూపర్ కింగ్స్ నిలిచిపోయింది. సన్‌రైజర్స్ జట్టులో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే రెండు వికెట్లు, మగాల, జానెసన్, బార్ట్‌మాన్ తలా వికెట్ సాధించారు. ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఢీ జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసి ప్రిటోరియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Womens T20 WC: ధనాధన్ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...! -
సెంచరీ కొట్టాడు.. సన్‌రైజర్స్‌లో చోటు పట్టాడు
SA20, 2023: స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఘోరంగా అవమాన పడ్డ సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఊరట లభించింది. ఎట్టకేలకే బవుమాను ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలోని జట్టైన సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ బవుమాను తదుపరి లీగ్‌లో ఆడించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం గురువారం (ఫిబ్రవరి 2) ప్రకటన విడుదల చేసింది. బవుమాకు జాతీయ జట్టు కెప్టెన్సీ తెచ్చిపెట్టని స్థానాన్ని.. ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ సాధించిపెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వదేశంలో తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బవుమా వరుసగా 36, 109, 35 స్కోర్లు చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే సన్‌రైజర్స్ యాజమాన్యం అతన్ని మరో ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది. తదుపరి జరుగబోయే లీగ్‌లో బవుమాతో పాటు పలు ఫ్రాంచైజీలు రీప్లేస్మెంట్లు చేసుకునున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యంలోని జోబర్గ్ సూపర్‌కింగ్స్.. విండీస్ ఆటగాడు అల్జరీ జోసఫ్ స్థానంలో ఆసీస్ వెటరన్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌ను ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్ టీమ్ లియామ్ లివింగ్‌స్టోన్, ఓలీ స్టోన్ స్థానాలను టిమ్ డేవిడ్, హెన్రీ బ్రూక్స్లతో భర్తీ చేసింది. కాగా, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు 8 రోజుల గ్యాప్ పడింది. తిరిగి మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 2) నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాళ డర్బన్ సూపర్ జెయింట్స్-ఎంఐ కేప్‌టౌన్ తలపడుతున్నాయి. ప్రస్తుతానికి లీగ్ పాయింట్ల పట్టికలో ప్రిటోరియా క్యాపిటల్స్ (23 పాయింట్లు), సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (17), పార్ల్ రాయల్స్ (17), జోబర్గ్ సూపర్ కింగ్స్ (16), ఎంఐ కేప్‌టౌన్ (13), డర్బన్ సూపర్ జెయింట్స్ (8) వరుస స్థానాల్లో ఉన్నాయి. -
SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్‌లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ జట్టును గెలిపించారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్టన్(4), జోర్డాన్ హెర్మాన్(4) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ స్మట్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బట్లర్ హాఫ్ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ జేసన్ రాయ్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. మిల్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 4 సిక్స్‌ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. రాయల్స్ సారథి డేవిడ్ మిల్లర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఏ స్థానంలో ఉన్నాయంటే కాగా ఈ ఓటమితో సన్‌రైజర్స్ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో రైజర్స్ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్(0.508) కంటే రన్‌రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు' 𝙈𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 𝙈𝙞𝙡𝙡𝙚𝙧 👀the super hits of the Royal's skipper More action from the #SA20League 👉 LIVE on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📲#SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/VsJiM9uyKS — JioCinema (@JioCinema) January 24, 2023 -
ఐపీఎల్లో నిరాశపరిచినా.. సౌతాఫ్రికా లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్ హెర్మన్ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ (34 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్.. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్దర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్ ఆరేయగా.. జెజె స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు. మినీ ఐపీఎల్‌గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఎస్ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్ రాయల్స్- ఎంఐ కేప్‌టౌన్‌తో మ్యాచ్‌తో ప్రొటిస్ పొట్టి లీగ్‌కు తెరలేచింది. ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్ మార్కరమ్ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. పర్ల్తో మ్యాచ్‌లో అయితే, ఎంఐ కేప్‌టౌన్‌ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. గురువారం నాటి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సమిష్టి కృషితో.. ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్ తీయగా.. వాన్ డెర్ మెర్వె, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్స్ ఆడం రాసింగ్టన్ 20 రన్స్ స్కోరు చేయగా, జోర్డాన్ హెర్మన్ 43 పరుగులతో రాణించాడు. ఫ్యాన్స్ ఖుషీ ఇక కెప్టెన్ మార్కరమ్ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పర్ల్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మార్కరమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ హైలైట్‌గా నిలిచారు. కాగా సన్‌రైజర్స్ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రైజర్స్ ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్ క్వార్టర్స్ అవకాశాలు?! కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ Top scorer in his first #SA20 game! 👊 Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q — Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023 -
మా మేడమ్‌కే లైన్ వేస్తావా?.. కావ్య మారన్‌కు పెళ్లి ప్రపోజల్.. వైరల్
SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్... ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లలో సందడి చేస్తూ ఫేమస్ అయింది ఈ చెన్నై బ్యూటీ. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన ఈవెంట్ ఏదైనా సరే కావ్య అక్కడ ఉందంటే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే! నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి! ఇక తాజాగా కావ్య పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం... సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. పెళ్లి ప్రపోజల్ ఇందులో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో తలపడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ‘‘కావ్యా మారన్.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. సౌతాఫ్రికాలో కూడా డామినేషన్ ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు... లేదంటే నీ సంగతి చూస్తాం! ఏదేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్ సూపర్ మేడమ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’’ అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్ టీవీ మ్యూజిక్, ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. Looks like someone needs a bit of help from @Codi_Yusuf on how to propose in the BOLAND. 💍#Betway #SA20 | @Betway_India pic.twitter.com/ZntTIImfau — Betway SA20 (@SA20_League) January 19, 2023 -
ఫీల్డర్ దెబ్బ.. యాంకర్‌కు ఊహించని అనుభవం
ఈ ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి ఎడిషన్ విజయవంతంగా సాగుతుంది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్ట్రర్న్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే మ్యాచ్ మధ్యలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్ సామ్ కర్రన్ వేసిన 13వ ఓవర్ లో చివరి బంతిని జాన్సెన్ డీప్ మిడ్ వికెట్ కార్నర్ మీదుగా షాట్ ఆడాడు. ఆ బాల్ ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీకి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు. అయితే ఆ ఫీల్డర్ సరాసరి అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ను ఢీ కొన్నాడు. దీంతో యాంకర్ పట్టుతప్పి కిందపడిపోయింది. కాగా అనుకోని ఘటనలో యాంకర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఆ తర్వాత పైకి లేచిన యాంకర్ తనకు ఏమీ కాలేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జట్టులో గ్రాంట్ రోలోఫ్సెన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 15 ఓవర్లలో 101 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మార్కో జాన్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు . కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. "This is coming straight for us.." 🫣@ZAbbasOfficial, you good? 🤣@CapeTownCityFC your manager somehow avoided the contact! pic.twitter.com/32YPcfLCMf — SuperSport 🏆 (@SuperSportTV) January 18, 2023 చదవండి: మణికొండలో సందడి చేసిన విరాట్ కోహ్లి.. సెంచరీలు వద్దు.. డబుల్ సెంచరీలే ముద్దు -
రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 28 పరుగులు!
ఆఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్‌కు సన్‌రైజర్స్ బ్యాటర్ మార్కో జాన్సెన్ చుక్కలు చూపించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్‌లో జాన్సెన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో జాన్సెన్ 4 సిక్స్‌లు, ఒక్క ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌తోనే మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 ట్విటర్లో ఫోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ విజయంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు. Some clean hitting by Marco Jansen as he smashes 2⃣8⃣ runs off the Rashid over 🚀#Betway #SA20 #MICTvSEC | @Betway_India pic.twitter.com/504jSzfqXf — Betway SA20 (@SA20_League) January 18, 2023 చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ -
అదరగొట్టిన మార్కరమ్.. సన్‌రైజర్స్ తొలి విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. 159 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి ఈస్టర్న్ కేప్ 19.3 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక సన్‌రైజర్స్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన మార్క్రమ్.. అనంతరం బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 7 ఫోర్లు సాయంతో 50 పరుగలు సాధించాడు. అతడితో పాటు సరేల్ ఎర్వీ(41), స్టబ్స్(30) పరుగులతో రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు, సామ్ కుర్రాన్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా కేప్‌టౌన్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాసీ వాన్ డర్ డస్సెన్ (29), లిండే(63) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. కాగా ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మాన్ మూడు వికెట్లు, మగాల, మార్కరమ్ తలా రెండువికెట్లు పడగొట్టారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు -
దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్ పొట్టి లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్టర్న్ కేప్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోరు బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మన్, మార్కరమ్కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్ ఒకటి, మగల ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్నకు జేజే స్మట్స్ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్ స్టబ్స్ 23, టామ్ అబెల్ 40(నాటౌట్) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు ప్రిటోరియా క్యాపిటల్స్- 193/6 (20) సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్- 170/5 (20) చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది -
SA 2022: ఆ వేలంలోనూ హైలెట్‌గా కావ్య మారన్! ఎంఐతో పోటీపడి.. అత్యధిక ధర పెట్టి!
SA20 auction- Tristan Stubbs Most Expensive Player: టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా దక్షిణాఫ్రికాలోనూ సౌతాఫ్రికా టీ20 లీగ్ పేరిట వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఆటగాళ్ల వేలం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ యజమాని కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసిన యాజమాన్యం.. నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఇద్దరు ప్రొటిస్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన సోమవారం నాటి వేలంలో దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్‌రైజర్స్.. ఎంఐ కేప్‌టౌన్(ముంబై ఇండియన్స్) యాజమాన్యంతో తీవ్రంగా పోటీ పడింది. అత్యధిక ధర! ఎట్టకేలకు సొంతం ఎట్టకేలకు 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్లు(భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు) వెచ్చించి ట్రిస్టన్ను సొంతం చేసుకుంది. ఇక ఈ యువ వికెట్ కీపర్ తమ జట్టు సొంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించగానే కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె మురిసిపోయిన తీరు అభిమానులకు ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ పేసర్ టైమల్ మిల్స్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, సౌతాఫ్రికా లీగ్‌లో భాగంగా అతడు సన్‌రైజర్స్ ఈస్టర్న్కేప్నకు ప్రాతినిథ్యం వహించనుండటం విశేషం. ఈ విషయంపై ట్రిస్టన్ స్టబ్స్ స్పందిస్తూ.. ‘క్రేజీగా అనిపిస్తోంది. పోర్ట్ ఎలిజబెత్లోనే నా కెరీర్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇప్పుడు ఆ జట్టుకు ఆడనుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?! టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం.. Teams battle in auction to get the services of 22 year old Tristan Stubbs.#TristanStubbs#SA20Auction#SA20 #INDvAUS pic.twitter.com/NAF4dTxd5N — Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022 The 22-year old Tristan Stubbs expresses his joy after being picked up by #SEC in the #SA20Auction! 🧡 #SunrisersEasternCape #OrangeArmy #TristanStubbs pic.twitter.com/9Ij4rDiPe0 — Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022