నార్తర్న్ సూపర్ చార్జర్స్‌లో వాటాను కొన్న సన్ గ్రూప్
‘హండ్రెడ్’లో సన్‌రైజర్స్ టీమ్ ఎంట్రీ
లీడ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెందిన ‘హండ్రెడ్’ లీగ్‌లో మరో ఐపీఎల్ జట్టు అడుగు పెట్టింది. యార్క్‌షైర్ కౌంటీ కేంద్రంగా ఉన్న నార్తర్న్ సూపర్ చార్జర్స్ టీమ్‌లో చెన్నైకి చెందిన సన్ గ్రూప్ 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 100 మిలియన్ బ్రిటన్ పౌండ్లు (సుమారు రూ.1092 కోట్లు)గా తెలుస్తోంది. బుధవారం కొనసాగిన అమ్మకంలో సన్ గ్రూప్ అత్యధిక మొత్తానికి బిడ్ చేసింది. సన్ గ్రూప్‌నకు ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌తో పాటు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ కూడా ఉంది.
ఇప్పుడు ఆ గ్రూప్ తమ జాబితాలో మూడో క్రికెట్ టీమ్‌ను చేర్చింది. ‘హండ్రెడ్’లో టీమ్ వాటాను కొనుగోలు చేసిన మూడో ఐపీఎల్ టీమ్ యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును, ముంబై ఇండియన్స్ (రిలయన్స్) యాజమాన్యం ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ టీమ్‌ను సొంతం చేసుకున్నాయి.
ఈ జాబితాలో మరో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అయిన జీఎంఆర్ గ్రూప్ కూడా చేరే అవకాశం ఉంది. హండ్రెడ్‌లోని మరో టీమ్ సదరన్ బ్రేవ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేయవచ్చని సమాచారం. 2024 ‘హండ్రెడ్’ సీజన్‌లో నార్తర్న్ సూపర్ చార్జర్స్ పురుషుల, మహిళల జట్లు నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఈ టీమ్ టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. సూపర్ చార్జర్స్‌కు ప్రస్తుతం హ్యారీ బ్రూక్ కెపె్టన్‌గా, ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment