Hyderabad Sunrisers
-
ఐపీఎల్: హైదరాబాద్ పై ముంబై గెలుపు
-
హైదరాబాద్ కు ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
-
ఐపీల్ 2023 నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్ అవుట్?
-
సాగర తీరంలో తాడోపేడో
డేవిడ్ వార్నర్ (692 పరుగులు); కగిసొ రబడ (25 వికెట్లు)... బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఐపీఎల్–12 సీజన్ టాపర్లు వీరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వార్నర్ ఒంటిచేత్తో ముందుకు నడిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ను పదునైన పేస్‌తో రబడ ఒడ్డున పడేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి గెలిస్తేనే లీగ్‌లో ముందుకెళ్లే అవకాశం ఉన్న స్థితిలో రెండు జట్లూ వీరు లేకుండానే తలపడబోతున్నాయి. బలాబలాలు విశ్లేషించి చూస్తే... బ్యాటింగ్‌లో పటిçష్టంగా ఉన్న ఢిల్లీ ముందు హైదరాబాద్ కొంత డీలాగా కనిపిస్తోంది. కానీ, బౌలింగ్ బలగంతో ప్రత్యర్థిని కట్టిపడేసే సన్‌రైజర్స్ తేలిగ్గా తలొగ్గకపోవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేరుతో పాటు ఆటతీరూ మార్చుకుని ఏడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ... గతేడాది రన్నరప్ హైదరాబాద్ సాగరతీరాన అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్–12లో భాగంగా బుధవారం రెండు జట్ల మధ్య ఇక్కడి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంటే, హైదరాబాద్ బౌలింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. లీగ్ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే ప్లే ఆఫ్స్ చేరగా, సన్‌రైజర్స్‌కు అదృష్టం తోడై బయటపడింది. అనూహ్యంగా మారిన వేదికపై కీలకమైన మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. అదే హైదరా‘బాధ’... ముందు బెయిర్‌స్టో, తర్వాత వార్నర్ దూరమవడం, ప్రత్యామ్నాయంగా షకీబుల్ హసన్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారిపోయింది. ఈ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు తోడు భువనేశ్వర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్లతో ఓ దశలో హైదరాబాద్ అత్యంత పటిష్ఠంగా కనిపించింది. ఎప్పుడైతే ఓపెనర్లు వెళ్లిపోయారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. నెట్ రన్‌రేట్ ఆదుకోవడంతో లీగ్ చరిత్రలో తొలిసారిగా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ రన్‌రేట్ కూడా వార్నర్, బెయిర్‌స్టోల దూకుడైన ఆట పుణ్యమే. ఇప్పుడు ఈ బలహీనతలన్నీ అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించే గప్టిల్, వృద్ధిమాన్ సాహాలపై పెద్ద బాధ్యతే ఉంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే, నాలుగో స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ సానుకూలాంశం. వీరి తర్వాత విజయ్ శంకర్, నబీ, యూసుఫ్ పఠాన్ స్కోరును నడిపించాలి. భువీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా, మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అతడు తిరిగి లయ అందుకుంటే జట్టుకు మేలు. పేసర్లు థంపి, ఖలీల్ మెరుగ్గా రాణిస్తున్నారు. విజయ్ మాత్రం పరుగులిస్తున్నాడు. ఫీల్డింగ్‌లో జట్టుకు తిరుగులేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంచి నా తేల్చినా అంతా బ్యాట్స్‌మెన్ చేతుల్లోనే. ఢిల్లీ ఢీకొట్టేలా... గతేడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన శిఖర్ ధావన్... ఈసారి ఢిల్లీ ఫ్లే ఆఫ్స్ చేరడంలో కీలకంగా నిలిచాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా తడబడుతున్నా ధావన్ జోరుతో ఆ ప్రభావం కనిపించడం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీ స్కోరు ఖాయం. వీరు విఫలమైతేనే ఇబ్బందికరం. హిట్టర్లయినప్పటికీ నిలకడ కొరవడిన ఇంగ్రామ్, రూథర్ఫర్డ్ల నుంచి ఎక్కువ ఆశించలేం. బౌలింగ్‌లో రబడ లోటును ఎడమ చేతివాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ పూడ్చాడు. ఇషాంత్ కచ్చితత్వం చూపుతున్నాడు. అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా స్పిన్ ప్రభావవంతంగా ఉంది. జట్టులోని వారు ఏదో ఒక దశలో గట్టెక్కిస్తుండటంతో ఢిల్లీ ఇక్కడివరకు వచ్చింది. బ్యాటింగ్ త్రయం (ధావన్–అయ్యర్–పంత్) చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటుంది. విశాఖ వాసులకు భలే ఛాన్సులే అందాల విశాఖపట్నం వాసులకు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల నిర్వహణ రూపంలో ఐపీఎల్ మెరుపులను చూసే భాగ్యం దక్కింది. లీగ్‌కు సంబంధించి... మామూలు పరిస్థితుల్లో అయినా ఇక్కడ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. కానీ, చెన్నై స్టేడియంలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా వైజాగ్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికైంది. పైగా ఒకటి కాదు రెండు మ్యాచ్‌లు అవి కూడా కీలకమైనవి జరుగనుండటంతో స్థానికుల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. అన్నింటికి మించి వాతావరణం పూర్తి ప్రశాంతంగా ఉండే వేళ రాత్రి 7.30కు మ్యాచ్‌లు ప్రారంభం కానుండంతో నగర వాసులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరే కీలకం విలియమ్సన్ పిచ్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధించే విలియమ్సన్... సంప్రదాయ షాట్లతో అంతే వేగంగా చాప కింద నీరులా స్కోరును నడిపిస్తాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుపై చివరి వరకు నిలిచి దీనిని మరోసారి నిరూపించాడు. మనీశ్ పాండే కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతడిని వన్‌డౌన్‌లో పంపడం జట్టుకు మేలు చేసింది. దూకుడుగానూ ఆడగలడు. భువనేశ్వర్ మిగతా ఇద్దరు పేసర్లు సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ ఈసారి విఫలమైనా భువనేశ్వర్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు (11) మాత్రం తక్కువ తీశాడు. రషీద్ ఈ సీజన్లో 15 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు లొంగినా మొత్తమ్మీద ఇతడి బౌలింగ్ ఆడటం కష్టమే. ధావన్ ఫ్రాంచైజీ మారినా, బ్యాటింగ్‌లో అదే నిలకడ చూపుతూ ఈ సీజన్లో 450 పరుగులు చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో చకచకా పరుగులు సాధిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 442 పైగా పరుగులు చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ దూకుడైన బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చేసే పంత్... ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు అంత నష్టం. ఈ సీజన్లో 401 పరుగులు చేశాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్లో 150కిపైగా వికెట్లు తీసిన ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ మలుపుతిప్పే స్పెల్ వేయగలడు. -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై హైదరాబాద్ ఘనవిజయం
-
‘సన్’ అదరహో
స్వదేశానికి పయనం కానున్న డాషింగ్ ఓపెనర్ వార్నర్ ఆఖరి మెరుపులు చూపాడు. హైదరాబాద్ భారీస్కోరు చేసి గెలిచింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఆట విజయంతో ముగిసింది. సోమవారం అన్నీ అలా కలిసొచ్చాయి. ప్లేఆఫ్ బాటలో నిలబెట్టాయి. ఎటొచ్చి పంజాబే టాస్ నుంచి కష్టాలను కొనితెచ్చుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పజెప్పి ఓవర్ ఓవర్‌కూ కష్టపడింది. ప్లేఆఫ్ ఆవకాశాలను క్లిష్టం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్: రెండు వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. ప్లేఆఫ్ రేసులో నిలిచింది. సోమవారం జరిగిన కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. లోకేశ్ రాహుల్ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రైజింగ్ ఆరంభం... టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపడమే సన్‌రైజర్స్‌కు వరమైంది. బ్యాటింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై హైదరాబాద్ టాపార్డర్ అదరగొట్టింది. వార్నర్‌కు జతగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆరంభం నుంచే ఇద్దరు బౌండరీలు బాదడంతో 4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. ఐదో ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో సాహా వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. మరుసటి ఓవర్లో వార్నర్ భారీ సిక్సర్ బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లోనే మురుగన్ అశ్విన్... సాహా (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్)జోరుకు కళ్లెం వేశాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన మనీశ్ పాండే అండతో వార్నర్ తన దూకుడు కొనసాగించాడు. పదో ఓవర్లోనే జట్టు 100 పరుగులు చేయగా... వార్నర్ ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయింది. రాణించిన పాండే... చేతిలో 9 వికెట్లుండటం, పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించడంతో వార్నర్, మనీశ్ పాండే జోడీ పంజాబ్ బౌలర్లపై పరుగుల ప్రతాపం చూపించింది. దీంతో ఓవర్‌కు 10 పరుగుల సగటుతో స్కోరు బోర్డు కదిలింది. ఇద్దరు కలిసి బౌండరీ లేదంటే సిక్స్ లేకుండా ఏ ఓవర్‌నూ విడిచిపెట్టలేదు. 15వ ఓవర్లో వార్నర్, పాండే ఫోర్ బాదడంతో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. చకచకా పరుగులు సాధిస్తున్న ఈ జోడీకి 16వ ఓవర్లో షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్‌లో మొదట పాండే (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), తర్వాత వార్నర్ నిష్క్రమించారు. దీంతో 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మూడో బంతిని పాండే ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడగా అక్కడే కాచుకున్న షమీ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఆఖరి బంతిని ఆఫ్‌సైడ్‌లో కొట్టిన వార్నర్ ముజీబ్ చేతికి చిక్కాడు. 4, 6, 1, 6, 1, 1, 6, 1 అశ్విన్, షమీ 16, 17 ఓవర్లలో కలిపి 10 పరుగులే ఇచ్చారు. అయితే ఈ రెండు ఓవర్ల కట్టడి కాస్తా 18వ ఓవర్లో కట్టలు తెంచుకుంది. ముజీబుర్ రహ్మాన్ వేసిన ఆ ఓవర్లో విలియమ్సన్, నబీ సిక్సర్లతో హోరెత్తించారు. తొలి రెండు బంతుల్ని కెప్టెన్ కేన్ ఫోర్, సిక్స్‌గా బాదేశాడు. తర్వాత నబీ రెండు సిక్సర్లు కొట్టాడు. బౌలర్ కూడా 2 వైడ్లు వేసుకోవడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు లభించాయి. ఆ వెంటనే షమీ 19వ ఓవర్ వేసి విలియమ్సన్ (7 బంతుల్లో 14; ఫోర్, సిక్స్), నబీ (10 బంతుల్లో 20; 2 సిక్స్‌లు)లను ఔట్ చేయడంతో పాటు ఏడే పరుగులు ఇచ్చాడు. విజయ్ శంకర్ క్రీజులోకి రాగా జట్టు స్కోరు 200 దాటింది. ఇక ఆఖరి ఓవర్ వేసిన అర్‡్షదీప్‌సింగ్ తొలి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసి 10 పరుగులు సమర్పించాడు. ఈ రెండు డెత్ ఓవర్లలో 17 పరుగులే రాగా సన్‌రైజర్స్ మూడు వికెట్లను కోల్పోయింది. గేల్... ఒక ఫోర్, ఔట్! భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు క్రిస్ గేల్ (4) ఔట్ రూపంలో తొలుతే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో ఫోర్ కొట్టిన గేల్ ఆట అదేస్కోరు మీద ముగిసింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ తొలిబంతికి షాట్ ఆడే ప్రయత్నంలో అతను పాండేకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ జతయ్యాడు. ఇద్దరు కాసేపు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. వేగం పెంచే దశలో రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మయాంక్ (27) మరుసటి బంతికే నిష్క్రమించాడు. దీంతో 71 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి... ఆ వేగంలోనే వికెట్‌ను పారేసుకున్నాడు. కాసేపటికే మిల్లర్ (11), అశ్విన్ (0)లను వరుస బంతుల్లో రషీద్ ఔట్ చేశాడు. మరోవైపు దూకుడుతో రాహుల్ రెండు వరుస సిక్సర్లు బాది 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. అనంతరం కూడా రాహుల్ పోరాటం కొనసాగింది కానీ... పంజాబ్ లక్ష్యానికి మాత్రం దూరమైంది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్... విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (16), ముజీబుర్ రహ్మాన్ (0) ఔటయ్యారు. -
సన్‌రైజర్స్ (vs) బెంగళూరు
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై అద్భుత విజయంతో జోరు మీదున్న జట్టు ఒక వైపు... లీగ్‌లో తొలి విజయం కోసం బరిలోకి దిగుతున్న టీమ్ మరో వైపు... ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో రైజర్స్ ఒకటి గెలిచి, మరొకటి ఓడగా... బెంగళూరు రెండూ కోల్పోయింది. శుక్రవారం రాజస్తాన్‌పై అద్భుత విజయంతో హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో వైపు ముంబైతో మ్యాచ్‌లో ‘నోబాల్’ కారణంగా ఓడిన కోహ్లి బృందం ఎలాగైనా గెలవాలనే కసితో కనిపిస్తోంది. ఆర్సీబీ జట్టు శనివారం స్టేడియంలో కఠోర సాధన చేసింది. ►చెన్నైసూపర్ కింగ్స్ – రాజస్తాన్ రాయల్స్ ►రాత్రి గం. 8నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్లో సన్ రైజింగ్
దక్కన్ చార్జర్స్ స్థానంలో 2013లో వచ్చిన మరో హైదరాబాద్ జట్టు సన్‌రైజర్స్ తొలి మూడు సీజన్లు తమదైన ముద్ర వేయలేకపోయింది. అయితే కెప్టెన్‌గా ముందుండి నడిపించిన డేవిడ్ వార్నర్ (848 పరుగులు) 2016లో తమ టీమ్‌కు తొలిసారి టైటిల్ అందించాడు. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై నిషేధం పడటంతో ఈ ఏడాది వాటి స్థానాల్లో కొత్తగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ టీమ్‌లు బరిలోకి దిగాయి. తొలిసారి టోర్నీలో ఆడిన గుజరాత్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఎల్ఈడీ స్టంప్స్‌ను మొదటిసారి ఈ ఐపీఎల్లో ఆడటం కొత్త ఆకర్షణ కాగా... మహారాష్ట్రలో నీటి కొరత కారణంగా ముంబై, పుణే జట్ల లీగ్ మ్యాచ్‌లు విశాఖపట్నానికి తరలిపోవడం మరో కీలక మార్పు. 2017 వరకు టైటిల్ స్పాన్సర్‌గా ఒప్పందం ఉన్నా వివాదాల కారణంగా పెప్సీ రెండేళ్ల ముందే తప్పుకుంది. ఫలితంగా 2016 నుంచి ‘వివో’ లీగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తికర ఫైనల్లో... బెంగళూరులో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ 8 పరుగుల స్వల్ప తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ జట్టు వార్నర్ (69), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ కటింగ్ (39 నాటౌట్, 2/35) మెరుపులతో ఏడు వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బెంగళూరు ఏడు వికెట్లకు 200 పరుగులకే పరిమితమైంది. గేల్ (76), కోహ్లి (54) తొలి వికెట్‌కు 63 బంతుల్లోనే 114 పరుగులు జోడించి విజయానికి బాటలు వేసినా... 140 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యాక జట్టు కుప్పకూలింది. కోహ్లి శతకాల మోత... లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే ఇందులో విరాట్ కోహ్లి ఒక్కడే నాలుగు చేయడం విశేషం. అతను 113, 109, 108 నాటౌట్, 100 నాటౌట్ పరుగులు చేయగా... డివిలియర్స్, క్వింటన్ డి కాక్ ఒక్కో సెంచరీ సాధించారు. కోహ్లి ఏకంగా 38 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్ ఒకే మ్యాచ్‌లో గుజరాత్‌పై సెంచరీలతో విరుచుకుపడటంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: విరాట్ కోహ్లి (బెంగళూరు–973 పరుగులు) అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): విరాట్ కోహ్లి (బెంగళూరు–973 పరుగులు) అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): భువనేశ్వర్ (సన్‌రైజర్స్–23 వికెట్లు) -
ప్రతీకారం తీర్చుకుంటారా!
నేడు బెంగళూరుతో హైదరాబాద్ మ్యాచ్ హైదరాబాద్: ఒక జట్టులో చూస్తే విధ్వంసకర బ్యాట్స్‌మెన్... కలిసికట్టుగా చెలరేగితే ఆకాశమే హద్దు... మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు... ప్రత్యర్థిని కట్టడి చేయడంలో నిలకడైన రికార్డు... ఇప్పు డు ఈ రెండు జట్ల మధ్య సీజన్లో రెండో సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం రాత్రి గం. 8.00లకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 12న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 45 పరుగుల తేడాతో ఓడింది. మిడిలార్డర్ మెరుగు పడేనా... కెప్టెన్ డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టు బలమూ, బలహీనతగా మారాడు. అద్భుతమైన ఆటతీరుతో నాలుగు అర్ధ సెంచరీలు చేసిన వార్నర్ విఫలమైతే అది జట్టుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నా, గత రెండు ఇన్నింగ్స్‌లలో అతను చాలా నెమ్మదిగా ఆడాడు. జట్టు భారీ స్కోరు సాధించాలంటే ఇది సరిపోదు. వీరిద్దరి తర్వాత వచ్చే ఆటగాళ్లెవరూ నిలకడ చూపించకపోవడంతో జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హెన్రిక్స్, మోర్గాన్, హుడా, నమన్ ఓజాలలో ఎవరూ ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆదిత్య తారేను వరుసగా మూడు మ్యాచ్‌లలో రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా ఆడించిన ప్రయోగం ఫలితాలివ్వలేదు. తొలి రెండు వికెట్లు పడితే ఆ తర్వాత సన్ పనైపోయినట్లే అనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్స్‌మెన్ సమష్టిగా చెలరేగితేనే రైజర్స్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. మంచి స్కోరు ఉంటే దానిని కాపాడుకోగల బౌలింగ్ వనరులు జట్టుకు ఉన్నాయి. నెహ్రా, ముస్తఫిజుర్, భువనేశ్వర్ ప్రత్యర్థిని అడ్డుకోగల సమర్థులు. అయితే సాధారణ స్కోరు ఉంటే వీరు కూడా ఏమీ చేయలేరని పుణేతో మ్యాచ్ నిరూపించింది. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ స్థానంలో విలియమ్సన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. గేల్ మెరుపులు చూస్తామా... గేల్, కోహ్లి, డివిలియర్స్, వాట్సన్... ఇలా వీర బాదుడు ఆటగాళ్లతో రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. టోర్నీలో దాదాపు ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్ చెలరేగడంతో బెంగళూరు భారీ స్కోర్లు సాధిస్తోంది. వాట్సన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్లో క్రిస్ గేల్నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. రెండు మ్యాచ్‌లే ఆడిన అతను 1, 0 పరుగులు చేశాడు. కూతురు జన్మించడంతో వెస్టిండీస్ వెళ్లిన గేల్ తిరిగొచ్చి జట్టుతో కలిశాడు. శుక్రవారం నెట్స్‌లో అందరికంటే ముందుగా వచ్చి గేల్ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అతను తనదైన శైలిలో ఆడితే అతడిని అడ్డుకోవడం సన్‌రైజర్స్ బౌలర్లకు అసాధ్యంగా మారుతుంది. కోహ్లి ఫామ్ ఆ జట్టుకు పెద్ద బలం. గత మ్యాచ్‌లో సెంచరీ చేసినా జట్టు ఓటమి పాలవడంతో నిరాశ చెందిన విరాట్, ఈసారి దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. లోయర్ ఆర్డర్లో సర్ఫరాజ్ మెరుపులు కూడా జట్టుకు కీలకం. అయితే ఎంత మంది హిట్టర్లు ఉన్నా బలహీన బౌలింగ్‌తో ఆర్సీబీ మ్యాచ్‌లు కోల్పోతోంది. స్ట్రైక్ బౌలర్‌గా చెప్పుకోదగ్గ ఆటగాడు ఎవరూ ఆ జట్టులో కనిపించడం లేదు. కేన్ రిచర్డ్సన్ ప్రభావం అంతంత మాత్రమే కాగా, వరుణ్ ఆరోన్ పూర్తిగా విఫలమయ్యాడు. చహల్, అబ్దుల్లాలాంటి దేశవాళీ స్పిన్నర్లు, పార్ట్టైమర్లతోనే జట్టు నెట్టుకొస్తోంది. గేల్ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీని పక్కన పెట్టవచ్చు. వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరిగిన గత మ్యాచ్ ప్రేక్షకులకు కాస్త నిరాశను పంచింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో కూడా భారీ స్కోర్లేమీ నమోదు కాలేదు. ఈసారైనా బెంగళూరు స్టార్ల జోరుతో బౌండరీల మోత, సిక్సర్ల హోరు కనిపించాలని, పూర్తి వినోదం దక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ మ్యాచ్‌కు ఎప్పుడో టికెట్లన్నీ అమ్ముడుపోగా... వారాంతం కావడం వల్ల కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. -
సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
ఐపీఎల్ టోర్నిలో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. 158 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా 8 బంతులుండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో సిమ్మన్స్, రాయుడులు కీలక పాత్ర పోషించారు. సిమ్మన్స్ 50 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 68, రాయుడు 46 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68 పరుగులు చేశారు. రాబిన్ శర్మ 14, పోలార్డ్ 6 పరుగులతో నాటౌట్ గా లినించారు. రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. -
ముంబై ఇండియన్స్ లక్ష్యం 158
హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు 158 పరుగులు లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి.