సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం | Mumbai Indians won the match against Hyderabad Sunrisers in IPL7 | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

Published Mon, May 12 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

ఐపీఎల్ టోర్నిలో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది.  158 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా 8 బంతులుండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 
 
ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో సిమ్మన్స్, రాయుడులు కీలక పాత్ర పోషించారు. సిమ్మన్స్ 50 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 68, రాయుడు 46 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68 పరుగులు చేశారు. రాబిన్ శర్మ 14, పోలార్డ్ 6 పరుగులతో నాటౌట్ గా లినించారు. రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 
 
హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6  ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement