IPL7
-
కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి
ఐపీఎల్7 లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి క్వాలిఫైర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా జట్టు 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఉతప్ప 42, పాండే 21, షాకీబ్ హసన్ 18, యూసఫ్ పఠాన్ 20 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య కుమార్ 5 పరుగులతోనూ, టెన్ డస్కోటే పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. వాస్తవానికి మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా బుధవారం రిజర్వు డే కు షిఫ్ట్ చేశారు. -
ముంబైలో కుదరదు.. బెంగళూరులోనే!
ముంబై: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టీ20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను బెంగళూర్ లోనే నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్7 ఫైనల్ మ్యాచ్ ను ముంబైలో నిర్వహించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్క్షప్తిని గవర్నింగ్ కౌన్సిల్ తోసిపుచ్చింది. శనివారం జరిగిన సమావేశంలో బెంగళూరులోనే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించడానికి గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ముంబైలో మ్యాచ్ నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులున్నాయని.. పది గంటల తర్వాత టపాసులు కాల్చేందుకు ముంబై పోలీసుల అనుమతి ఉందని ఎంసీఏ లేఖ రాసింది. అన్ని అనుమతులను శరద్ పవార్ తీసుకున్నారని.. అయితే బెంగళూరులోనే నిర్వహించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందనే విషయం తమకు తెలియదని ఎంసీఏ కార్యదర్శి నితిన్ దలాల్ తెలిపారు. -
యువరాజ్ వీరవిహారం, ఢిల్లీ టార్గెట్ 187
డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. యువరాజ్ ధాటిగా ఆడి 29 బంతుల్లో 68 పరుగులు చేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ముందు 187 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు నిర్ధేశించింది. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు జట్టు 14.2 ఓవర్లలో 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే చివర్లో యువరాజ్ బ్యాటింగ్ మెరుపులతో భారీ స్కోరును నమోదు చేసుకుంది. క్రిస్ గేల్ 22, పార్థీవ్ పటేల్ 29, కోహ్లీ 10, ఏబీ డివిల్లీయర్స్ 33 పరుగులు చేసి అవుటవ్వగా.. యువరాజ్ (29 బంతుల్లో 9 సిక్సర్లు, 1 ఫోర్) 68, రాణా 15 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. షమీ, కౌల్, శుక్లాలకు చెరో వికెట్ లభించింది. -
సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
ఐపీఎల్ టోర్నిలో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. 158 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా 8 బంతులుండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో సిమ్మన్స్, రాయుడులు కీలక పాత్ర పోషించారు. సిమ్మన్స్ 50 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 68, రాయుడు 46 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68 పరుగులు చేశారు. రాబిన్ శర్మ 14, పోలార్డ్ 6 పరుగులతో నాటౌట్ గా లినించారు. రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. -
ముంబై ఇండియన్స్ లక్ష్యం 158
హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు 158 పరుగులు లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి. -
యువరాజ్ శ్రమ వృథా, రాజస్థాన్ ఘన విజయం!
బెంగళూర్: ఐపీఎల్-7 టోర్నిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఇంకా 7 బంతులుండగానే విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో నాయర్, స్మిత్, ఫాల్కనూర్ లు కీలక పాత్ర పోషించారు. నాయర్ హాఫ్ సెంచరీ సాధించగా, స్మిత్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48, ఫాల్కనూర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యువరాజ్ సింగ్ బౌలింగ్ లోనూ రాణించడంతో ఓదశలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులే చేసింది. కాని చివర్లో స్టీవ్ స్మిత్, ఫాల్కనూర్ లు ధాటిగా ఆడటంతో సులభంగా విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించిన యువరాజ్ ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టును ఓపెనర్లు క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు. ఓ దశలో బెంగళూరు జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు ఆటగాడు జోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యువరాజ్ భారీ షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. యువరాజ్ కు తోడుగా డివిల్లీయర్స్ కూడా భారీ షాట్లు కొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు, డివిల్లియర్స్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 58 చేశారు. -
విధ్వంసమెవ్వరిది: మాక్స్ వెల్ X క్రిస్ గేల్
ఐపీఎల్-7లో గ్లెన్ మాక్స్ వెల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానులు ఆకట్టుకోవడమే కాకుండా మైదానంలో పరుగుల వరదను పారిస్తున్నాడు. మాక్స్ వెల్ దూకుడుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం చప్పట్లు కొట్టాల్సి వస్తోంది. భారత డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ సైతం 'నాకంటే, క్రిస్ గేల్ కంటే అతనే విధ్వంసకారుడు' అని మాక్స్ వెల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తుఫాన్ వేగంలాంటి బ్యాటింగ్ తో ఐపీఎల్ లో సంచలనం సృష్టిస్తున్న మాక్స్ వెల్, అంతర్జాతీయ క్రికెట్ లో సుడిగాలి వేగంతో బ్యాటింగ్ సునామీని సృష్టించే క్రిస్ గేల్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జట్లు పోటిపడనున్నాయి. మాక్స్ వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, క్రిస్ గేల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రసుత్త ఐపీఎల్ లో శుక్రవారం ఆసక్తికరమైన పోటికి తెరతీసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో మాక్స్ వెల్ విభిన్నమైన షాట్లతో ఆలరిస్తున్న మాక్స్ వెల్ ఇప్పటికే మూడు సెంచరీలను చేజార్చుకున్నారు. గత మ్యాచ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి మూడు సార్లు 90 పరుగుల మీదే అవుటయ్యాడు. సెంచరీ కోసం చూస్తున్న అభిమానులను మాక్స్ వెల్ నిరాశపరిచారు. బెంగళూరుతో జరిగే మ్యాచ్ లోనైనా సెంచరీ చూసే భాగ్యాన్ని కల్పిస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఐపీఎల్ లో క్రిస్ గేల్ ఇంకా పరుగుల సునామీని సృష్టించలేదు. పూర్తిస్థాయిలో క్రిస్ గేల్ ఎప్పుడూ బ్యాట్ విధిలిస్తాడేమోనని అభిమానులు కాచుకు కూర్చున్నారు. గత ఐపీఎల్ ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించిన క్రిస్ గేల్ ప్రస్తుత సీజన్ లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించలేదు. మాక్స్ వెల్ కు ధీటుగా క్రిస్ గేల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఆలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్ అగ్రస్థానం కోసం జరుగుతున్న పోటిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య పోరు మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది. తమ జట్ల విజయం కోసం గేల్, మాక్స్ వెల్ లో ఎవరు విధ్వంసకారులుగా మారుతారో వేచి చూడాల్సిందే. -
నాకంటే, క్రిస్ గేల్ కంటే అతనే విధ్వంసకారుడు: సెహ్వాగ్
కటక్: విధ్వంసకరమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న గ్లెన్ మాక్స్ అభిమానుల జాబితాలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ కూడా చేరిపోయారు. క్రిస్ గేల్, తన కంటే మాక్స్ వెల్ ప్రమాదకరమైన ఆటగాడు అని సెహ్వాగ్ కితాబిచ్చారు. ఐపీఎల్ లో సెహ్వాగ్ తోపాటు మాక్స్ వెల్ కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ప్రత్యర్ధి జట్లను మాక్స్ వెల్ బెంబెలిత్తిస్తున్నాడు. అతితక్కువ బంతుల్లో మాక్స్ వెల్ మూడు సార్లు 90 పరుగులు చేసి.. తృటిలో మూడు సెంచరీలు మిస్ చేసుకున్నాడు. అతని ఆటతీరు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. క్రికెట్ కంటే ఎక్కువగా గోల్ప్ ప్రాక్టీస్ చేస్తున్నారడన్నారు. మాక్స్ వెల్ తోపాటు మరో ఆటగాడు మిల్లర్ కూడా రాణిస్తే .. ఆరోజు బౌలర్లకు కష్టాలు తప్పవని సెహ్వాగ్ అన్నారు. -
ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ విజయం
దుబాయ్:ఐపీఎల్-7లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ రోజు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఆటగాళ్లు 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై విసిరిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్ మడ్డిన్ సన్ (12) పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, పార్థివ్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ హీరోలు విరాట్ కోహ్లి (0), యువరాజ్(0) వరుసగా పెవిలియన్ చేరడంతో ఓ దశలో బెంగళూర్ కాస్త తడబడింది. కాగా, పార్థీవ్(56), డివిలియర్స్ (45) పరుగులు చేయడంతో బెంగళూర్ రాయల్స్ 17.3ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. మైక్ హస్సీ(16), టేర్(17) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం అంబటి రాయుడు చేసిన (35) పరుగులు ముంబై ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రోహిత్ శర్మ(2),పొలార్డ్ (3) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కో్ల్పోయి 115 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.