నాకంటే, క్రిస్ గేల్ కంటే అతనే విధ్వంసకారుడు: సెహ్వాగ్
నాకంటే, క్రిస్ గేల్ కంటే అతనే విధ్వంసకారుడు: సెహ్వాగ్
Published Thu, May 8 2014 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
కటక్: విధ్వంసకరమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న గ్లెన్ మాక్స్ అభిమానుల జాబితాలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ కూడా చేరిపోయారు. క్రిస్ గేల్, తన కంటే మాక్స్ వెల్ ప్రమాదకరమైన ఆటగాడు అని సెహ్వాగ్ కితాబిచ్చారు.
ఐపీఎల్ లో సెహ్వాగ్ తోపాటు మాక్స్ వెల్ కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ప్రత్యర్ధి జట్లను మాక్స్ వెల్ బెంబెలిత్తిస్తున్నాడు. అతితక్కువ బంతుల్లో మాక్స్ వెల్ మూడు సార్లు 90 పరుగులు చేసి.. తృటిలో మూడు సెంచరీలు మిస్ చేసుకున్నాడు.
అతని ఆటతీరు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. క్రికెట్ కంటే ఎక్కువగా గోల్ప్ ప్రాక్టీస్ చేస్తున్నారడన్నారు. మాక్స్ వెల్ తోపాటు మరో ఆటగాడు మిల్లర్ కూడా రాణిస్తే .. ఆరోజు బౌలర్లకు కష్టాలు తప్పవని సెహ్వాగ్ అన్నారు.
Advertisement
Advertisement