ఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై మరోసారి తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో క్రికెట్ ఆడటానికి రాడని.. హోటల్ రూంలో తనకు ఫ్రీగా ఇచ్చే డ్రింక్స్ కోసం వస్తాడని ట్రోల్ చేశాడు. కాగా గతంలో కూడా ఇదే విధంగా ట్రోల్ చేశాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో దారుణ ప్రదర్శన చేసిన మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ 10 కోట్లు పెట్టి కొన్నందుకు ఆ జట్టుకు చీర్ లీడర్‌గా మారాడని పేర్కొన్నాడు. (చదవండి : అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్)
'ఐపీఎల్‌లో ఆడేటప్పుడు, ఆసీస్‌కు ఆడేటప్పుడు మనం రెండు రకాల మ్యాక్స్‌వెల్ను చూప్తాం. ఆసీస్‌కు ఆడేటప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు విఫలమైతే తనను ఎక్కడ తీస్తారో అనే భయం అతనికి ఉంటుంది. అందుకే ఆసీస్ జట్టుకు ఆడుతున్నప్పుడు అతని ప్రవర్తన, ఆటతీరు పూర్తిగా మారిపోంతుంది. కానీ ఐపీఎల్‌లో అలాంటి ఒత్తిడి ఉండదు. మ్యాచ్‌లు ఆడినా.. ఆడకపోయినా.. సదరు యాజమాన్యం ఆటగాళ్లకు అందించాల్సిన మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌కు వస్తే ఎంజాయ్ మూమెంట్‌లో కనిపిస్తాడు. అందుకే ఇతర ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం..తోటి క్రికెటర్లతో కలిసి విహారయాత్రలు చేయడం.. ఆట ముగిసిన తర్వాత ఫ్రీగా అందించే డ్రింక్స్‌ను తన హోటల్ రూంకు తీసుకెళ్లి తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అందుకే ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ ఉన్నప్పుడు అతని ఆట సీరియస్‌గా అనిపించదు. ఐపీఎల్‌లో క్రికెట్ ఆడడం కన్నా.. తన వచ్చిన పని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. (చదవండి : టీమిండియాకు మరో షాక్)
అయితే సెహ్వాగ్ కామెంట్స్‌పై మ్యాక్స్‌వెల్ స్పందించాడు.' వీరు చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయనందుకు అతనికి నాపై కోపం ఉన్నట్టుంది. అతని వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు. అంటూ తెలిపాడు.
కాగా మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 2019లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కొన్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లాడిన అతను 105 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ ఆసీస్ టూర్‌లో మాత్రం మంచి ప్రదర్శన నమోదు చేశాడు.మూడు వన్డేలు కలిపి 167 పరుగులు, మూడు టీ20లు కలిపి 78 పరుగులు చేశాడు. (చదవండి : త్యాగి బౌన్సర్.. కుప్పకూలిన ఆసీస్ బ్యాట్స్‌మెన్)
Comments
Please login to add a commentAdd a comment