CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది.
వాంఖడేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. కివీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్ నాలుగో బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు.
ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇక న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌కు.. తొమ్మిదో ఓవర్ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు.
వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు
►27 - రోహిత్ శర్మ (2023)
►26 - క్రిస్ గేల్ (2015)
►22 - ఇయాన్ మోర్గాన్ (2019)
►22 - గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2023)
►21 - ఏబి డివిలియర్స్ (2015)
►21 - క్వింటన్ డికాక్ (2023)
చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
Comments
Please login to add a commentAdd a comment