ICC ODI World Cup 2023: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్‌గేల్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఎందుకిలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు’’ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవలే వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
భారత్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 5న మొదలు కానున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి జూన్ 27 ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీలో ఫేవరెట్లు, సెమీ ఫైనలిస్టులపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
భారత్, పాక్‌తో పాటు ఆ రెండు జట్లు
ఇందులో భాగంగా కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ సైతం టాప్-4 జట్లను ఎంచుకున్నాడు. ‘‘ఫేవరెట్ ఎవరన్నది తెలియదు గానీ.. సెమీ ఫైనలిస్టులను మాత్రం అంచనా వేయగలను. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. ఈ నాలుగు సెమీస్ చేరగలవు’’ అని పేర్కొన్నాడు.
ఇక్కడి దాకా అంతబాగానే ఉన్నా. వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా కీలక క్రికెటర్లు ఎవరన్న అంశంపై క్రిస్ గేల్ ఇచ్చిన జవాబే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘‘ఈసారి ప్రపంచకప్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇండియాకు కీలకం కానున్నారు’’ అని తెలిపాడు.
అతడికేమో గాయం.. ఇక
కాగా టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా.. వెన్ను నొప్పి కారణంగా నెలల తరబడి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. టీ20లలో నెంబర్ 1 బ్యాటర్‌గా నిలిచిన సూర్య వన్డే రికార్డు అంతంత మాత్రమే. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 వన్డేలు ఆడిన సూర్యకుమార్ చేసిన మొత్తం పరుగులు 433. అత్యధిక స్కోరు 64.
ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మేటి ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గేల్.. బుమ్రా, సూర్య పేర్లను చెప్పడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ‘‘గొప్ప బ్యాటర్‌వి. కానీ నీకసలు బుర్ర లేదు’’ అంటూ గేల్‌ను ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: WC 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా..
Comments
Please login to add a commentAdd a comment