ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024.. జట్ల వివరాలు | Indian Veteran Premier League 2024: Complete Squads Of All Six Teams | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024.. జట్ల వివరాలు

Published Fri, Feb 23 2024 8:36 PM | Last Updated on Fri, Feb 23 2024 8:36 PM

 Indian Veteran Premier League 2024: Complete Squads Of All Six Teams - Sakshi

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IVPL) తొలి ఎడిషన్‌ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. 

ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ టైగ‌ర్స్‌, రాజ‌స్థాన్ లెజెండ్స్‌, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వారియ‌ర్స్‌, ముంబై ఛాంపియ‌న్స్ జట్లు ఈ వెటరన్‌ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ​్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్‌.. క్రిస్‌ గేల్‌ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 

10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌ 2 గంటలకు, రాత్రి మ్యాచ్‌ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. 

ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌, యూరోస్పోర్ట్స్‌తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్‌ గేల్‌తో పాటు హెర్షల్‌ గిబ్స్‌, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్‌ ఆటగాళ్లు భాగం కానున్నారు.

జట్ల వివరాలు..

రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్‌), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్‌దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా

తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్‌), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు

వీవీఐపీ ఉత్తర ప్రదేశ్‌: సురేష్ రైనా (కెప్టెన్‌), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్

ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్‌), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్‌జున్‌వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్‌సిన్హ్ సోలన్‌సిన్హ్ సోలన్‌వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా

రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్‌), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్

ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్‌), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్‌ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement