Indian Veteran Premier League
-
సురేష్ రైనా విధ్వంసం.. కేవలం 33 బంతుల్లోనే! వీడియో వైరల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్-2024లో వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ఫైనల్‌కు చేరడంలో రైనా కీలక పాత్ర పోషించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌తో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో కూడా రైనా సత్తాచాటాడు. సెమీఫైనల్లో 19 పరుగుల తేడాతో ఛత్తీస్‌గడ్‌ను చిత్తు చేసిన ఉత్తర్‌ప్రదేశ్ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూపీ బ్యాటర్లలో పవన్ నేగి మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రైనా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 'మిస్టర్ ఐపీఎల్' 58 పరుగులు చేశాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షాదాబ్ జాక్తీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్ ఓపెనర్లు జటిన్ సక్సేనా(76), నమాన్ ఓజా(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. చదవండి: AUS vs NZ: తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం Suresh Raina is still providing clutch performances in knockouts for his team 🐐🔥pic.twitter.com/Gu0O5ty0BB — MN 👾 (@CaptainnRogerrs) March 2, 2024 -
దంచికొట్టిన పెరీరా.. హెర్షల్ గిబ్స్ జట్టు ఘన విజయం
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL 2024) ఎనిమిదో మ్యాచ్‌లో హెర్షల్ గిబ్స్ సారథ్యం వహిస్తున్న రెడ్ కార్పెట్ ఢిల్లీ జట్టు.. ముంబై ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఛాంపియన్స్.. ఆష్లే నర్స్ (4-0-33-3), విక్రాంత్ శర్మ (4-0-21-3), ఒమర్ ఆలమ్ (2-0-7-1), ఆసేల గుణరత్నే (1-0-4-1) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పీటర్ ట్రెగో (27), అమిత్ సనన్ (22), వి సోలంకి (14), వినయ్ యాదవ్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. తిసారా పెరీరా (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో 14.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (26), కెప్టెన్ గిబ్స్ (14), గుణరత్నే (17) వేగంగా పరుగులు సాధించారు. ముంబై బౌలర్లలో సోలంకి 2, రాష్ట్రదీప్ యాదవ్, పీటర్ ట్రెగో, వినయ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో రేపు జరుగుబోయే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ లెజెండ్స్, చత్తీస్ఘడ్ వారియర్స్.. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్, ముంబై ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. -
క్రిస్ గేల్ ఊచకోత.. 46 బంతుల్లోనే 10 సిక్సర్ల సాయంతో..!
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024 అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
రసవత్తర సమరంలో పరుగు తేడాతో గెలుపొందిన తెలంగాణ టైగర్స్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొట్టమొదటి ఎడిషన్‌లో (2024) తెలంగాణ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ లెజెండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరిమితమై అతి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. మెరిసిన శివ భరత్.. ఓపెనర్ శివ భరత్ కుమార్ సాగిరి (59 బంతుల్లో 87 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తెలంగాణ భారీ స్కోర్ చేసింది. తెలంగాణ ఇన్నింగ్స్‌లో దిల్షన్ మునవీర 27, రికార్డో పావెల్ 20, మన్ప్రీతి గోని 25 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా 2, సెక్కుగే ప్రసన్న, ఇషాన్ మల్హోత్రా, లఖ్విందర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. తెలంగాణ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లక్ష్యానికి అతి సమీపంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. తంగిరాల పవన్ కుమార్, తిలక్, ఖాద్రి తలో 2 వికెట్లు, సందీప్ త్యాగి ఓ వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (32), ఇషాన్ మల్హోత్రా (36), రాజేశ్ బిష్ణోయ్ (44) రాజస్థాన్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, IVPL 2024 ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ నెల 23న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై.. తెలంగాణపై, ఆతర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో చత్తీస్‌ఘడ్‌పై ఢిల్లీ, నిన్న జరిగిన మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఉత్తర్ ప్రదేశ్ గెలుపొందాయి. ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్‌తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్‌దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్‌జున్‌వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్‌గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్‌ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్‌గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్‌తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు.