
Courtesy: IPL Twitter
MS Dhoni Scolled R Ashwin In IPL 2014.. ఐపీఎల్ 2021 సీజన్ రెండో ఫేజ్‌లో భాగంగా అశ్విన్, మోర్గాన్ మధ్య జరిగిన వివాదం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. వీరి గొడవ జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా జనాలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్- మోర్గాన్ గొడవను మరోసారి ప్రస్తావిస్తూ 2014 ఐపీఎల్ సీజన్‌లో అశ్విన్- ధోని- మ్యాక్స్‌వెల్ మధ్య జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
చదవండి: IPL 2021: ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర
Courtesy: IPL Twitter
''పంజాబ్ కింగ్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు అశ్విన్ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ఇప్పటి పంజాబ్ కింగ్స్)కు మ్యాక్స్‌వెల్ ఆడుతున్నాడు. కాగా పంజాబ్ బ్యాటింగ్ సమయంలో మ్యాక్స్‌వెల్ అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పుడు అశ్విన్ మ్యాక్స్‌వెల్‌ను దూషించాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నా.. కాగా మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్ తిట్టిన సీన్ మొత్తం నేను స్వయంగా చూశా. ఆ క్షణంలో అశ్విన్‌పై నాకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఆ విషయాన్ని మళ్లీ ఎప్పుడు పబ్లిక్‌గా ప్రస్తావించలేదు. దానికి కారణం ఎంఎస్ ధోని.
Courtesy: IPL Twitter
ప్రత్యర్థి ఆటగాడైన మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్ దూషించడం తప్పు. ఇది తెలుసుకున్న ధోని ఆరోజు అశ్విన్‌ను కోప్పడ్డాడు. ప్రత్యర్థి ఆటగాడి తప్పులేకున్నా దూషించాడని.. మనోడైనా తిట్టాడు.. అది క్రీడాస్పూర్తి అంటే.. ధోని ఈ విషయంలో ఎప్పుడు ముందుంటాడు. ఒకవేళ నేను అశ్విన్- మ్యాక్స్‌వెల్ గొడవను సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఆ పని నేను చేయలేదు.. అది క్రీడాస్పూర్తికి విరుద్ధం. తాజాగా అశ్విన్- మోర్గాన్ వివాదం అలానే కనిపించింది. పరిష్కరించుకుంటే పోయోదాన్ని అనవసరంగా పబ్లిక్ ఇష్యూ చేశారు.'' అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Ashwin Vs Morgan: 'అశ్విన్ ఒక చీటర్'.. ఆసీస్ మీడియా సంచలన వ్యాఖ్యలు
Courtesy: IPL Twitter