మ్యాక్స్‌వెల్‌ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలిసారి | Glenn Maxwell Complete 500 Runs For RCB 2nd Player After Jacques Kallis | Sakshi
Sakshi News home page

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలిసారి

Published Mon, Oct 11 2021 9:01 PM | Last Updated on Mon, Oct 11 2021 9:14 PM

Glenn Maxwell Complete 500 Runs For RCB 2nd Player After Jacques Kallis - Sakshi

Courtesy: IPL Twitter

Glenn Maxwell Completes 500 Runs For RCB.. ఆర్‌సీబీ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా కోహ్లి, గేల్‌, డివిలియర్స్‌ త్రయం కాకుండా ఆర్‌సీబీ తరపున ఐదు వందల మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు. ఇంతకముందు జాక​ కలిస్‌ ఆర్‌సీబీ తరపున 2010 ఐపీఎల్‌ సీజన్‌లో 572 పరుగులు సాధించాడు. అంతేగాక ఆర్‌సీబీ తరపున తొలిసారి ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ 500 పరుగుల మార్క్‌ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక కేకేఆర్‌తో జరుగుతున్న ఆర్‌సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. 

చదవండి: Virat Kohli: ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement