IPL 2021 Final: MS Dhoni Set Become First Captain Lead 300 T20 Matches - Sakshi
Sakshi News home page

IPL 2021: టి20 కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని అరుదైన రికార్డు

Published Fri, Oct 15 2021 5:11 PM | Last Updated on Fri, Oct 15 2021 5:59 PM

IPL 2021: MS Dhoni Set Become First Captain Lead 300 T20 Matches - Sakshi

Courtesy: IPL Twitter

MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్‌తో జరగనున్న ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్‌ ద్వారా 300 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్‌కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్‌కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్‌  చేర్చిన ధోని.. 2017లో రైజింగ్‌ పుణే సూపర్ జెయింట్‌ను ఫైనల్‌ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు.  ధోని తర్వాత ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్‌ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగా కోహ్లి 140 మ్యచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: MS Dhoni: హెలికాప్టర్‌ షాట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని.. వీడియో వైరల్‌

కాగా వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు ధోని సీఎస్‌కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం ధోని సీఎస్‌కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్‌లో ఎల్లో డ్రెస్‌లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement