CSK Vs KKR Final: ఐపీఎల్‌ 2021 టైటిల్‌ విజేత సీఎస్‌కే | IPL 2021: CSK Vs KKR Final Match Live Updates And Highlihts | Sakshi
Sakshi News home page

IPL 2021 CSK Vs KKR Final: ఐపీఎల్‌ 2021 టైటిల్‌ విజేత సీఎస్‌కే

Published Fri, Oct 15 2021 7:02 PM | Last Updated on Fri, Oct 15 2021 11:30 PM

IPL 2021: CSK Vs KKR Final Match Live Updates And Highlihts - Sakshi

ఐపీఎల్‌ 2021 టైటిల్‌ విజేత సీఎస్‌కే
ఐపీఎల్‌లో సీఎస్‌కే నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్‌ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించింది. అయితే అయ్యర్‌, గిల్‌ ఔటైన తర్వాత మ్యాచ్‌ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ టర్న్‌ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్‌ వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా అడుగులేసింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్‌ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి 1 వికెట్‌ తీశాడు.

ఎనిమిదో వికెట్‌ వికెట్‌ డౌన్‌.. ఓటమి దిశగా కేకేఆర్‌
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. షకీబుల్‌ హసన్‌ జడేజా బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్‌ 15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అంతకముందు9 పరుగులు చేసిన కార్తీక్‌ జడేజా బౌలింగ్‌లో రాయుడుకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా.. 51 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌ దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. .

వెంకటేశ్‌ అయ్యర్‌ ఔట్‌.. కేకేఆర్‌ 93/2
సీఎస్‌కే జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నితీష్‌ రాణా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు వెంకటేశ్‌ అయ్యర్‌(50) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. దాటిగా ఆడుతున్న అయ్యార్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గిల్‌ 40, నితీష్‌ రాణా పరుగులతో క్రీజులో ఉన్నారు.

చుక్కలు చూపిస్తున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. కేకేఆర్‌ 72/0
కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో ఆడుతున్న అయ్యర్‌కు మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(27) సహకరిస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసింది.

ధీటుగా బదులిస్తున్న కేకేఆర్‌
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ధీటుగానే బదులిస్తుంది. కేకేఆర్‌ ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌లు దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 21, గిల్‌ 15 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

సీఎస్‌కే 192/3 .. కేకేఆర్‌ ముందు భారీ టార్గెట్‌
ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్‌ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి 1 వికెట్‌ తీశాడు.

17 ఓవర్లలో సీఎస్‌కే 153/2
17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ 69 పరుగులతో ఆడుతుండగా.. మొయిన్‌ అలీ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 124/2
రాబిన్‌ ఊతప్ప(31) రూపంలో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. నరైన్‌ బౌలింగ్‌లో ఊతప్ప ఎల్బీగా ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్‌కే 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 57 పరుగులతో ఆడుతున్నారు. 

13 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 116/1
13 ఓవర్ల ఆట ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టానికి 116 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 56,రాబిన్‌ ఊతప్ప 25 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. రుతురాజ్‌(32) ఔట్‌
రుతురాజ్‌ గైక్వాడ్‌(32)రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ను కోల్పోయింది. కేకేఆర్‌ స్పిన్నర్‌ నరైన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి బంతిని రుతురాజ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.. శివమ్‌ మావి క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే 9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది.

6 ఓవర్లలో సీఎస్‌కే 50/0
సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌లు ఇన్నింగ్స్‌ ధాటిగా ఆడుతున్నారు. కేకేఆర్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రుతురాజ్‌ 26, డుప్లెసిస్‌ 23 పరుగులతో ఆడుతున్నారు.

3 ఓవర్లలో సీఎస్‌కే 22/0
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రుతురాజ్‌ 18, డుప్లెసిస్‌ 3 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021లో భాగంగా సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక మ్యాచ్‌లో సీఎస్‌కే ఫెవరెట్‌గా కనిపిస్తుండగా.. కేకేఆర్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్‌ దశలో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది.  ఇక కేకేఆర్‌ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 1లో సీఎస్‌కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్‌సీబీని ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్‌ క్వాలిఫయర్‌ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్‌కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధించగా.. కేకేఆర్‌ 8సార్లు గెలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

కోల్‌కతా నైట్ రైడర్స్: శుబ్‌మన్‌ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement