
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నరైన్ అందరు ఇంకా మిస్టరీ స్పిన్నర్‌గానే చూస్తున్నారని.. మరి ఇన్నేళ్లుగా క్వాలిటి బౌలింగ్ ఎలా చేస్తున్నాడంటూ ప్రశ్నించాడు. కాగా సోమవారం ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ముందు బౌలింగ్‌లో 4 వికెట్లు తీసిన నరైన్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కీలక దశలో 3 సిక్సర్లు బాది జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్ ప్లేఆఫ్స్ మెరిసిన రెండుసార్లు కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: David Warner: వచ్చే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కే ఆడాలని ఉంది.. కానీ
Courtesy: IPL Twitter
ఈ సందర్భంగా గంభీర్ నరైన్ ఆటతీరుపై స్పందించాడు. '' సునీల్ నరైన్ విషయంలో మిస్టరీ అనే పదం ఇప్పటికి వినిపిస్తుండడం నన్ను ఆశ్చర్చపరిచింది. మిస్టరీ అనే పదం కంటే క్వాలిటీ అనే పదం నరైన్‌కు ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. నరైన్ బౌలింగ్ మిస్టరీగానే ఉంటే ఇన్నేళ్ల పాటు విండీస్ తరపున క్రికెట్ ఎలా ఆడుతున్నాడు. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లు నరైన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్‌లో వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్ అయ్యారు. దీనిలో కొత్త విషయం ఎక్కడుంది. నరైన్ బౌలింగ్‌లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేదానిపై మరోసారి క్లారిటీ వచ్చింది. టాప్‌క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపగల సత్తా నరైన్‌కు ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
Courtesy: IPL Twitter
ఇక కేకేఆర్ గంభీర్ కెప్టెన్సీలోనే రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2012, 2014లో టైటిల్ గెలిచిన గంభీర్ సేనలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు. 2012 సీజన్‌లో 24 వికెట్లు తీసిన నరైన్.. 2014 సీజన్‌లో 21 వికెట్లు తీశాడు. తాజా సీజన్‌లో(ఐపీఎల్ 2021) 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తి తర్వాత కేకేఆర్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇక కేకేఆర్ రేపు(అక్టోబర్ 13) ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్ 2 ఆడనుంది.
చదవండి: Sunil Narine: ఆ ముగ్గురిని ఔట్ చేయడం ఇది రెండోసారి మాత్రమే