Girl Throwback Proposal Ms Dhoni Presence Of His Wife Sakshi 2018 IPL - Sakshi
Sakshi News home page

MS Dhoni: సాక్షి సింగ్‌ సమక్షంలోనే ధోనికి లవ్‌ ప్రపోజ్‌

Published Wed, Oct 6 2021 9:04 AM | Last Updated on Wed, Oct 6 2021 4:27 PM

Girls Throwback Proposal MS Dhoni Presence Of His Wife Sakshi 2018 IPL

Love Proposal To MS Dhoni 2018 IPL.. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆట నుంచి దూరమైన తర్వాత కూడా అతని క్రేజ్‌ ఇసుమంతైన తగ్గలేదనడానికి తాజా ఐపీఎల్‌ సీజనే ఉదాహరణ. ధోని ఆడకపోయినా పర్లేదు.. జట్టును విజేతగా నిలిపితే చూడాలని చాలామంది అనుకుంటారు. అలాంటి ధోనికి అమ్మాయిల్లోనూ యమ క్రేజ్‌ ఉంటుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సమయంలో తన జులపాల జట్టును ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ధోని హెయిర్‌స్టైల్‌ చూసే చాలామంది అమ్మాయిలు బహిరంగంగానే లవ్‌ప్రపొజల్‌ చేసిన ఘటనలు కోకొల్లలు. అయితే అవి అభిమానం వరకు మాత్రమే పరిమితమయ్యేవి. ఇక ధోనికి 2010లో తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్‌ను వివాహమాడాడు. 

చదవండి: Viral Video: భార్యను భయపెట్టిన రోహిత్‌ శర్మ..

ఈ సంగతి అలా ఉంచితే.. ఐసీసీ తన ట్విటర్‌లో 2018 ఐపీఎల్‌ సీజన్‌లో ధోనికి లవ్‌ ప్రపోజ్‌ చేసిన ఒక అమ్మాయి త్రోబ్యాక్‌ ఫోటోను షేర్‌ చేసింది. కాగా సాక్షి సమక్షంలోనే ఆ అమ్మాయి ధోనికి లవ్‌ ప్రపోజ్‌ చేయడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. '' ధోని నీకు పెళ్లి అయి ఉండొచ్చు.. కానీ నా ఫస్ట్‌ లవ్‌ ఎప్పటికీ నువ్వే.. ఐ లవ్‌ యూ మహీ'' అంటూ ఆ యువతి ఫ్లకార్డు చేతపట్టుకొని తన లవ్‌ను ప్రపోజ్‌ చేసింది. 


ఇక 2018 సీజన్‌లో సీఎస్‌కే చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.  వాంఖడే వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఇక తాజాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ సీఎస్‌కే దుమ్మురేపుతుంది. గతేడాది దారుణ ప్రదర్శనను మైమరిపిస్తూ దూకుడైన ఆటతీరు కనబరిచిన సీఎస్‌కే ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇక తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను సీఎస్‌కే పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది.

చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement