CSK Vs RR: సీఎస్‌కేపై రాజస్తాన్‌ సంచలన విజయం | IPL 2021 2nd Phase CSK Vs RR Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

CSK Vs RR : సీఎస్‌కేపై రాజస్తాన్‌ సంచలన విజయం

Published Sat, Oct 2 2021 7:03 PM | Last Updated on Sat, Oct 2 2021 11:18 PM

IPL 2021 2nd Phase CSK Vs RR Match Live Updates And Highlights - Sakshi

Photo Courtesy: IPL

సీఎస్‌కేపై రాజస్తాన్‌ సంచలన విజయం
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శివమ్‌ దూబే (42 బంతుల్లో 64 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. గ్లెన్‌ పిలిప్స్‌ 14 పరుగులతో సహకరించాడు. అంతకముందు జైశ్వాల్‌ 21 బంతుల్లోనే 50 పరుగులతో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. శాంసన్‌ 28, లూయిస్‌ 27 పరుగులు చేశారు. సీఎస్‌కే బౌలర్లలో శార్దల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు, కెఎమ్‌ ఆసిఫ్‌ ఒక వికెట్‌ తీశారు.

సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం దిశగా సాగుతుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154  పరుగులు చేసింది. జైశ్వాల్‌, లూయిస్‌ వెనుదిరిగిన తర్వాత శాంసన్‌తో కలిసి శివమ్‌ దూబే ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. దూబే 48, శాంసన్‌ 26 పరుగులతో ఆడుతున్నారు. రాజస్తాన్‌ విజయానికి 34 పరుగుల దూరంలో ఉంది.

రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. 89/2
భారీ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించిన యశస్వి జైశ్వాల్‌ 50 పరుగులు చేసి కెమ్‌ ఆసిఫ్‌ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. శాంసన్‌ 14, శివమ్‌ దూబే 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. 81/1
ఎవిన్‌ లూయిస్‌(27) రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లూయిస్‌ హేజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 50, శాంసన్‌ 4పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ సీఎస్‌కే బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో 6,6,4,6తో 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్‌లో డెబ్యూ అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

ధీటుగా బదులిస్తున్న రాజస్తాన్‌.. 4 ఓవర్లలో 53/0
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు లూయిస్‌, జైశ్వాల్‌లు ఒకరిని మించి ఒకరు ఫోర్లు, సిక్సర్లు బాదుతు స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 28, లూయిస్‌ 25 పరుగులతో ఆడుతున్నారు.

రుతురాజ్‌ సెంచరీ.. సీఎస్‌కే 20 ఓవర్లలో 189/4
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(60 బంతుల్లో 101, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపగా.. ఆఖర్లో జడేజా 14 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్‌తో 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి దాటికి సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్‌ 25, మొయిన్‌ అలీ 21 పరుగులు చేశారు. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాటియా 3, చేతన్‌ సకారియా ఒక వికెట్‌ తీశాడు.  


Photo Courtesy: IPL

మొయిన్‌ అలీ(21) ఔట్‌.. సీఎస్‌కే 114/3
అనవసర షాట్‌ కోసం క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చిన మొయిన్‌ అలీ(17 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌) స్టంప్‌ అవుటయ్యాడు. తెవాతియా చాకచక్యంగా బౌల్‌ చేసి మొయిన్‌ అలీని బోల్తా కొట్టించాడు. ఇప్పటివరకు చెన్నై కోల్పోయిన మూడు వికెట్లు తెవాతియా ఖాతాలోనే పడ్డాయి. 14.4 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 114/3. క్రీజ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌(46 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు ఉన్నారు. 

10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 63 పరగులు చేసింది. రుతురాజ్‌ 31, మొయిన్‌ అలీ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డుప్లెసిస్‌, రైనా రూపంలో సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది.


Photo Courtesy: IPL

నిరాశపరిచిన రైనా‌.. సీఎస్‌కే 59/2
సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా మరోసారి నిరాశపరిచాడు. 3 పరుగులు చేసిన రైనా తెవాటియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 57 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. 52/1
ఓపెనర్‌ డుప్లెసిస్‌(25) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ను కోల్పోయింది. రాహుల్‌ తెవాటియా బౌలింగ్‌లో డుప్లెసిస్‌ స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 8 ఓవర్లో వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. రుతురాజ్‌ 23, రైనా 3 పరుగులతో ఆడుతున్నారు.

నిలకడగా ఆడుతున్న సీఎస్‌కే.. 6 ఓవర్లలో 44/0
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిలకడైన ఆటతీరు కనబరుస్తుంది. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. రుతురాజ్‌ 20, డుప్లెసిస్‌ 24 పరుగులతో ఆడుతున్నారు.

4 ఓవర్లలో సీఎస్‌కే 25/0
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రుతురాజ్‌ 18, డెప్లెసిస్‌ 7 పరుగులతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా సీఎస్‌కే, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక ఇప్పటికే సీఎస్‌కే 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 2 ఓటములతో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. రాజస్తాన్‌ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

కాగా తొలి అంచె పోటీల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 143 పరుగులకే పరిమితమై 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 24సార్లు తలపడగా.. 15 సార్లు సీఎస్‌కే.. 9 సార్లు రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, కెఎమ్‌ ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్‌

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌),ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement