Courtesy: IPL Twitter
MS Dhoni Completes 100 Catches For CSK.. ఐపీఎల్‌లో సీఎస్‌కే వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఆరంభం నుంచి సీఎస్‌కేకు( మధ్యలో ఒక సీజన్ మినహా) ఆడుతున్న ఎంఎస్ ధోని సీఎస్‌కే వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ధోని తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో రైనా(సీఎస్‌కే) 98 క్యాచ్‌లతో రెండో స్థానంలో.. కీరన్ పొలార్డ్( ముంబై ఇండియన్స్) 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: ధోని కూతురు జీవా విజిల్ పోడు..
ఓవరాల్‌గా ధోని ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 215 మ్యాచ్‌ల్లో 158 డిస్‌మిసిల్స్(119 క్యాచ్‌లు, 39 స్టంప్స్ ) ఉన్నాయి. అంతేగాక ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ద్వారా ధోని మరో రికార్డును కూడా అందుకున్నాడు. ధోని వికెట్ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకోవడం ఇది 10వ సారి. ధోని తర్వాత ఏబీ డివిలియర్స్ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో ఉన్నాడు.
Special cricketer, special milestone! 👏 👏@msdhoni completes 1⃣0⃣0⃣ IPL catches for @ChennaiIPL as a wicketkeeper. 🙌 🙌 #VIVOIPL #SRHvCSK
— IndianPremierLeague (@IPL) September 30, 2021
Follow the match 👉 https://t.co/QPrhO4XNVr pic.twitter.com/OebX4cuJHq
Comments
Please login to add a commentAdd a comment