టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. మరి ఈ ఏడాదైనా టీమిండియా డబ్ల్యూటీసీ విజేతగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
ఇక టెస్టు క్రికెట్‌లో సాధారణంగా సిక్సర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బౌండరీలతోనే బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం చూస్తుంటాం. ఇన్నింగ్స్ మధ్యలోనూ సిక్సర్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరనేది పరిశీలిద్దాం.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టుల్లో 91 సిక్సర్లు కొట్టి సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు. 329 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నాడు. 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరొక్క సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది.
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రెవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
Comments
Please login to add a commentAdd a comment