విధ్వంసమెవ్వరిది: మాక్స్ వెల్ X క్రిస్ గేల్ | Glen Maxwell versus Chris gayle in IPL7 | Sakshi
Sakshi News home page

విధ్వంసమెవ్వరిది: మాక్స్ వెల్ X క్రిస్ గేల్

Published Fri, May 9 2014 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

విధ్వంసమెవ్వరిది: మాక్స్ వెల్ X క్రిస్ గేల్

విధ్వంసమెవ్వరిది: మాక్స్ వెల్ X క్రిస్ గేల్

ఐపీఎల్-7లో గ్లెన్ మాక్స్ వెల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానులు ఆకట్టుకోవడమే కాకుండా మైదానంలో పరుగుల వరదను పారిస్తున్నాడు. మాక్స్ వెల్ దూకుడుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం చప్పట్లు కొట్టాల్సి వస్తోంది. భారత డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ సైతం 'నాకంటే, క్రిస్ గేల్ కంటే అతనే విధ్వంసకారుడు' అని మాక్స్ వెల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తుఫాన్ వేగంలాంటి బ్యాటింగ్ తో ఐపీఎల్ లో సంచలనం సృష్టిస్తున్న మాక్స్ వెల్, అంతర్జాతీయ క్రికెట్ లో సుడిగాలి వేగంతో బ్యాటింగ్ సునామీని సృష్టించే క్రిస్ గేల్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జట్లు పోటిపడనున్నాయి. 
 
మాక్స్ వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, క్రిస్ గేల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రసుత్త ఐపీఎల్ లో శుక్రవారం ఆసక్తికరమైన పోటికి తెరతీసింది. 
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో మాక్స్ వెల్ విభిన్నమైన షాట్లతో ఆలరిస్తున్న మాక్స్ వెల్ ఇప్పటికే మూడు సెంచరీలను చేజార్చుకున్నారు. గత మ్యాచ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి మూడు సార్లు 90 పరుగుల మీదే అవుటయ్యాడు. సెంచరీ కోసం చూస్తున్న అభిమానులను మాక్స్ వెల్ నిరాశపరిచారు. బెంగళూరుతో జరిగే మ్యాచ్ లోనైనా సెంచరీ చూసే భాగ్యాన్ని కల్పిస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఇక ఈ ఐపీఎల్ లో క్రిస్ గేల్ ఇంకా పరుగుల సునామీని సృష్టించలేదు. పూర్తిస్థాయిలో క్రిస్ గేల్ ఎప్పుడూ బ్యాట్ విధిలిస్తాడేమోనని అభిమానులు కాచుకు కూర్చున్నారు. గత ఐపీఎల్ ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించిన క్రిస్ గేల్ ప్రస్తుత సీజన్ లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించలేదు. మాక్స్ వెల్ కు ధీటుగా క్రిస్ గేల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఆలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 
ప్రస్తుత ఐపీఎల్ అగ్రస్థానం కోసం జరుగుతున్న పోటిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుల మధ్య పోరు మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.  తమ జట్ల విజయం కోసం గేల్, మాక్స్ వెల్ లో ఎవరు విధ్వంసకారులుగా మారుతారో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement