Glen Maxwell
-
మాక్స్వెల్ రాజీనామా.. ఆ జట్టు కెప్టెన్‌గా మార్కస్ స్టోయినిస్
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌కు ముందు మెల్బోర్న్ స్టార్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ని నియమించింది. గ్లెన్ మాక్స్వెల్ వారుసుడిగా స్టోయినిష్ బాధ్యతలు చేపట్టనున్నాడు. జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మెల్బోర్న్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మాక్సీ.. గత సీజన్ అనంతరం సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో స్టార్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది.10 మ్యాచ్‌లు ఆడిన మెల్బోర్న్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మాక్స్వెల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. కాగా స్టోయినిస్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్‌ల్లో మాక్సీ గైర్హాజరీలో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్‌గా మార్కస్ వ్యవహరించాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం స్టోయినిష్ స్పందించాడు."గత సీజన్లో 'మ్యాక్సీ' లేకపోవడంతో కొన్ని మ్యాచ్‌ల్లో మెల్బోర్న్ సారథిగా వ్యవహరించే అవకాశం దక్కింది. కెప్టెన్సీని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పదేళ్లగా మెల్బోర్న్ స్టార్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాను. ఈసారి నాయకుడిగా మా జట్టును విజయఫథంలో నడిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తాను" అని స్టోయినిస్ పేర్కొన్నాడు. మెల్బోర్న్ స్టార్స్ తరపున 98 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిష్.. 2656 పరుగులు చేశాడు.బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. తొలి స్ధానంలో గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్ 14వ సీజన్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్ -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం..!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాక్సీ కూడా ఆర్సీబీతో కొనసాగేందుకు సముఖత చూపడం లేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా మాక్స్వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ పేజిని ఆన్ ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోందికాగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ను ఐపీఎల్-2021 మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ 14.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగొలు చేసింది. ఆ తర్వాతి ఏడాదిలో రూ.11 కోట్లకు మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2023, 24 సీజన్లలో కూడా అతడికి ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ మినహా మిగితా సీజన్లలో మాక్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2024లో అయితే మాక్స్వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కేవలం 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్సీబీ తరపున తన డెబ్యూ సీజన్లో మాక్స్వెల్ ఏకంగా 513 పరుగులు చేశాడు. కాగా ఏడాది డిసెంబర్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఒకవేళ మాక్స్వెల్ వేలంలో వస్తే భారీ మొత్తం దక్కడం ఖాయం. 🚨 Glenn Maxwell Unfollowed #RCB on Instagram #IPL2025 #CricketTwitter pic.twitter.com/8EFfex3165— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 29, 2024 -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు. -
మాక్స్వెల్ కీలక నిర్ణయం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున మాక్స్వెల్ ఆడనున్నాడు. ఈ మెరకు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టులో తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు సైతం చేరారు. తాజాగా మాక్సీ కూడా జతకట్టడంతో వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ మధ్య నుంచి మాక్స్వెల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు తన అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్వెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్సీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న ఈ మేజర్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ జూలై 4నుంచి ప్రారంభం కానుంది. -
RCB Vs MI: మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన మాక్సీ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన మాక్స్వెల్ చేరాడు. మాక్స్వెల్ ఇప్పటివరకు 17 సార్లు ఐపీఎల్లో డకౌట్లు కాగా.. రోహిత్, కార్తీక్ 17 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్ నుంచే మాక్స్వెల్ నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. రాబోయో మ్యాచ్‌ల్లో అతడిపై వేటు పడే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. -
11 కోట్లు తీసుకుంటున్నావు.. మరి ఇంత చెత్త ఆటనా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మాక్స్వెల్ రెండో సారి డకౌటయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్సీ.. చెత్త షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 13 ఓవర్లో శ్రేయాస్ గోపాల్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన మాక్స్వెల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు బంతులు ఎదుర్కొని క ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ. 11 కోట్లు తీసుకుని మరి ఇటువంటి చెత్త ఆడుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అతడిని జట్టు నుంచి పక్కన పెట్టండి మరి కొంతమంది పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్ pic.twitter.com/R2Bb8c5H6r — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 Maxwell in every match ....🤣😭😭 pic.twitter.com/uwEBu43buT — Jo Kar (@i_am_gustakh) April 11, 2024 -
మరి ఇంత చెత్త బ్యాటింగా.. ఆట మర్చిపోయావా మాక్సీ? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన మాక్స్వెల్.. ఇప్పుడు జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. 3 బంతులు ఎదుర్కొన్న మాక్సీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన మాక్స్వెల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి మాక్స్వెల్ ఆట మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మరి కొంతమంది దేశం కోసం చెలరేగిపోతాడని.. ఐపీఎల్లో మాత్రం తుస్సుమనిపిస్తాడని పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Clean bowled! Nandre Burger picks up the big wicket of Glenn Maxwell. Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 LIVE - https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/NCpFBpkMSp — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. టీ20 చరిత్రలోనే
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆసీస్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మాక్సీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో మాక్స్వెల్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మాక్సీ బౌండరీల వర్షం కురిపించి జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 48 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్ 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 104 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. మాక్సీ అత్యంత చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన మాక్స్వెల్.. బౌలింగ్‌లో మాత్రం అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన మాక్స్వెల్ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన ఆస్ట్రేలియా బౌలర్‌గా మాక్స్వెల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ పేరిట ఉండేది. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో బ్రెట్‌లీ ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బ్రెట్‌లీ చెత్త రికార్డును మాక్స్వెల్ తన పేరిట లిఖించుకున్నాడు. -
టీ20 బాస్ మ్యాక్సీ.. హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు సమం
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో సుడిగాలి శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన మ్యాక్స్‌వెల్.. టీ20ల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (47 బంతుల్లో) రికార్డుతో పాటు మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండగా.. తాజాగా మ్యాక్స్‌వెల్ ఆ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీ ఈ ప్రపంచ రికార్డును తన వందో మ్యాచ్‌లో సాధించడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు.. రోహిత్ శర్మ-4 గ్లెన్ మ్యాక్స్‌వెల్-4 బాబర్ ఆజమ్-3 సబావూన్ దవిజి-3 కొలిన్ మున్రో-3 సూర్యకుమార్ యాదవ్-3 విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు.. భారత్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో మ్యాక్స్‌వెల్ మరో రికార్డును కూడా సాధించాడు. విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (3) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ (2), ముహమ్మద్ వసీమ్ (2) మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్‌పై అత్యధిక సిక్సర్లు.. నిన్నటి మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్ టీ20ల్లో భారత్‌పై అత్యధిక సిక్సర్లు (37) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సెర్బియా ఆటగాడు లెస్లీ డన్బర్ (బల్గేరియాపై 42 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో (వెస్టిండీస్‌పై 39 సిక్సర్లు) నిలిచాడు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. -
IND Vs AUS: విరాట్ కోహ్లి- మ్యాక్స్‌వెల్ ఫ్రెండ్లీ ఫైట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), బుమ్రా(1) ఉన్నారు. అంతకుముందు రాహుల్(66), రోహిత్ శర్మ(47), విరాట్ కోహ్లి(54) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లి- గ్లెన్ మాక్స్వెల్ మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే బంతి నేరుగా మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్వెల్ చేతికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్ కీపర్ త్రో వేసే క్రమంలో బంతి మిస్స్ అయ్యి విరాట్ కోహ్లి పైకి వెళ్లింది. కోహ్లి వెంటనే బంతిని చేతితో పట్టుకున్నాడు. మాక్సీ కూడా కోహ్లి వైపు చూస్తూ సారీ చెప్పాడు. ఈ క్రమంలో కోహ్లి మాక్సీ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ నవ్వాడు. మాక్సీ కూడా నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా మాక్సీ, కోహ్లి మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ హిస్టరీలోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇలాంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ: కోహ్లి
గ్లెన్ మాక్స్వెల్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గానిస్తాన్‌పై విరోచిత ఇన్నింగ్స్ ఆడిన మాక్స్‌వెల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక వైపు గాయంతో బాధపడుతూనే అద్భుతమైన డబుల్ సెంచరీతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య చేధనలో 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరిన ఆసీస్‌ను.. మ్యాక్సీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో సెమీస్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 128 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్ 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మ్యాక్సీ ఇన్నింగ్స్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పిధా అయిపోయాడు. సోషల్ మీడియా వేదికగా మాక్సీను కింగ్ కోహ్లి ప్రశించాడు.. "ఇటువంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ" అంటూ విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: బాబర్ ఆజమ్ శకం ముగిసింది.. నయా నంబర్ వన్ శుభ్‌మన్ గిల్ -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండడంతో ఆసీస్ ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గోల్ప్ ఆడుతుండగా గాయ పడ్డాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం వెనుక నుండి జారి పడడంతో తలకు గాయమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. దీంతో కంకషన్ ప్రోటోకాల్స్ రూల్స్ ప్రకారం మ్యాక్సీ దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండనున్నాడు. కాగా మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని, సెమీఫైనల్స్‌కు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా మ్యాక్సీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో 106 పరుగులు) మ్యాక్స్‌వెల్ బాదాడు. చదవండి: CWC 2023: సూర్యకుమార్ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని -
టీమిండియాతో మూడో వన్డే.. ఆ ఇద్దరు స్టార్లు వచ్చేస్తున్నారు
టీమిండియాతో రేపు జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆసీస్ స్టార్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డే బరిలో నిలువనున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన నెట్స్ సెషన్లో పాల్గొన్నారు. స్టార్క్, మ్యాక్సీ రాకతో తొలి వన్డేలో ఆడిన నాథన్ ఇల్లిస్, రెండో వన్డే ఆడిన స్పెన్సర్ జాన్సన్ జట్టుకు దూరంకానున్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు జరుగబోయే చివరి మ్యాచ్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు రాజ్‌కోట్ వేదికగా తలపడనున్నాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ ఇదివరకే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో రేపు జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు వరల్డ్‌కప్‌కు ముందు ప్రాక్టీస్‌గా పరిగణించడబడుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు సైతం రంగంలోకి దిగనున్నారు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రేపటి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా రేపటి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. నామమాత్రపు మ్యాచ్ అయినా భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తుంది. -
తండ్రి కాబోతున్న మ్యాక్స్‌వెల్.. 'రెయిన్బో బేబీ' జన్మించబోతోందంటూ..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి భార్య వినీ రామన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్కానింగ్ రిపోర్ట్‌తో పాటు చిన్నారి డ్రెస్ ఫోటోను వినీ రామన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా గతేడాది చెన్నైకి చెందిన వినీ రామన్‌ను హిందూ సంప్రదాయంలో మాక్సీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం బీజీబీజీగా ఉన్నాడు. వినీ రామన్ కూడా తన భర్తతో పాటు ఇండియాలోనే ఉంది. "మాక్సీ, నేను మా రెయిన్బో బేబీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జన్మనివ్వనున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ఇలాంటి సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఇటువంటి పోస్టులు చూసి ఎంత బాధపడతారో నాకు బాగా తెలుసు. ఆ బాధను మేము అనుభవించాం. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు మా ప్రేమను తెలియజేస్తున్నాం" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వినీ రమన్ రాసుకొచ్చింది. రెయిన్బో బేబీ అంటే? ఈ మధ్య కాలంలో రెయిన్బో బేబీ అనే పదం తరచుగా వింటూ ఉన్నాం. అస్సలు ఈ రెయిన్బో బేబీ అంటే ఎంటో తెలుసుకుందాం. గర్భస్రావం లేదా ఇతర కారణాలతో తల్లి కడుపులోనే బేబీ చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డను రెయిన్బో బేబీ అని అంటారు. చదవండి: #Yashasvi Jaiswal: వాట్ ఏ టాలెంట్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే: విరాట్ కోహ్లి View this post on Instagram A post shared by Vini Maxwell (@vini.raman) -
RCB Vs CSK: ఇదేమి మ్యాచ్ రా బాబు.. బ్యాటర్ల విధ్వంసం! 444 పరుగులు, 33 సిక్స్‌లు
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితం విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మ్యాచ్‌లో పరుగులు వరద పారింది. రెండు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు నమోదు చేశాయి. అదే విధంగా ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 33 సిక్స్‌లు బాదడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), దుబే(27 బంతుల్లో 52) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్లోనే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం డుప్లెసిస్, మాక్స్వెల్ షో మొదలైంది. వీరిద్దరూ సీఎస్కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. మాక్స్వెల్ 36 బాల్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. చదవండి: Trolls On Vijaykumar Vyshak: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు.. #Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాక్! ఫైన్ పడింది.. ఎందుకంటే.. 2019: #TATAIPL debut for @RCBTweets 🏏 Now: Chief destructor against them for @ChennaiIPL 💛 Shivam Dube's attack mode was 🔛 with the bat🔥#RCBvCSK #IPLonJioCinema #IPL2023 | @IamShivamDube pic.twitter.com/jTnfAAccOL — JioCinema (@JioCinema) April 17, 2023 -
ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?
టీ20 ప్రపంచకప్-2022లో డిఫిండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. పెర్త్ వేదికగా మంగళవారం(ఆక్టోబర్25) శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కాన్వే(92) చేలరేగడంతో 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా ఇక శ్రీలంకతో జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పటికే అఖరి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించకపోతే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసీస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మార్ష్, డేవిడ్ చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు. అదే విధంగా బౌలింగ్‌లో హాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ ఈ ముగ్గురు పేసర్లు నిప్పులు చేరిగితే లంక బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. ఇక ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్ లేమి ఆస్ట్రేలియాను కాస్త కలవరపెడుతోంది. అయితే న్యూజిలాండ్‌పై మ్యాక్స్‌వెల్ కాస్త పర్వాలేదనపించాడు. మ్యాక్స్‌వెల్ తన మునపటి ఫామ్‌ను తిరిగి పొందితే ఆస్ట్రేలియాకు ఇక తిరుగుండదు. మెండిస్, హాసరంగా మళ్లీ మ్యాజిక్ చేస్తారా రౌండ్-1లో నమీబియా చేతిలో ఆనూహ్యంగా ఓటమి చెందిన శ్రీలంక.. అనంతరం యూఏఈ, నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్-12లో అడుగుపెట్టింది. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌ను చిత్తు చేసి తమ జోరును కొనసాగించింది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం అంత అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ చమీరా, యువ బౌలర్ మధుషాన్ గాయం కారణంగా దూరం కావడంతో లంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌కు దూరమైన మరో ఓపెనర్ నిస్సాంక.. ఆసీస్‌తో పోరుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో మాత్రం లంక పూర్తి స్థాయిలో హాసరంగా, థీక్షణపైనే అధారపడుతోంది. ఈ మ్యాచ్‌లో హాసరంగా తన స్పిన్ మ్యాజిక్‌ను మరోసారి రిపేట్ చేస్తే ఆస్ట్రేలియా కష్టాలు తప్పవు. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 25 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల్లో, లంక 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 3 సార్లు, శ్రీలంక 2 సార్లు గెలుపొందాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 World Cup 2022: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా -
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం!
ఐపీఎల్-2022లో ప్రారంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం కావడం ఖాయమైంది. పాకిస్తాన్లో ఆస్ట్రేలియా పర్యటన కారణంగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, కమిన్స్, హాజల్‌వుడ్ మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మార్చి లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు, టెస్ట్ సిరీస్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించిన జట్లలో వీరింత భాగమై ఉన్నారు. పాకిస్తాన్లో ఆసీస్ పర్యటన మార్చి 4న ప్రారంభమై.. ఏప్రిల్ 5 ముగిస్తోంది. అనంతరం ఏప్రిల్ 6న ఆసీస్ ఆటగాళ్లు భారత్‌కు తిరిగిరానున్నారు. కాగా ఐపీఎల్-2022 మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో మొత్తం 13 మంది ఆసీస్ క్రికెటర్లు పాల్గోనబోతున్నారు. వీరిలో పాక్‌తో సిరీస్‌లకు ఎంపిక కాని డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, నాథన్ కౌల్టర్-నైల్, టిమ్ డేవిడ్ ఐపీఎల్ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు తన వివాహం కారణంగా దూరంగా ఉండనున్నాడు. చదవండి: Pak Vs Aus ODIs: పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా సిరీస్.. వార్నర్, మాక్సీ సహా కీలక ఆటగాళ్లు దూరం! -
మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు!
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విద్వంసం సృష్టించాడు. బుధవారం హాబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. హరికేన్స్ బౌలర్లను మ్యాక్సీ ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. కాగా మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్బోర్న్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ 154 పరుగులు సాధించగా, స్టోయినిస్ 75 పరుగులుతో రాణించాడు. హరికేన్స్ బౌలర్లలో జోష్ ఖాన్, థాంమ్సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 274 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరికేన్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్ -
మ్యాక్స్‌వెల్ ఇలా జరిగిందేంటి?
అహ్మదాబాద్: ఐపీఎల్-14 వ సీజన్‌కు సంబంధించి ఫ్రిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆ వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం తీవ్ర పోటీ జరిగినా చివరకు ఆర్సీబీనే సొంతం చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌కు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి హామీ ఇవ్వడంతో పట్టుబట్టి మరీ 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. గతంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్లో వదిలేసుకుంది. గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ అంచనాలకు అందకుండా జాక్‌పాట్ కొట్టాడు. ప్రతీకారం చేజారింది.. పంజాబ్ కింగ్స్‌కు గత సీజన్లో ఆడిన మ్యాక్స్‌వెల్.. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున విశేషంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లు ఆడి 144 పైగా స్టైక్‌రేట్‌తో 223 పరుగులు చేశాడు. ప్రస్తుతం టాప్-6లో ఉన్న మ్యాక్స్‌వెల్ రెండు హాఫ్ సెంచరీలను కూడా సాధించాడు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ పంజాబ్ కింగ్స్‌పై ఆడటానికి క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో మ్యాక్స్‌వెల్‌లో ఎంతో కొంత పాత ఫ్రాంచైజీపై ఆడుతున్న విషయం కచ్చితంగా నెమరువేసుకుంటాడు. పంజాబ్‌పై కనీసం మంచి ఇన్నింగ్స్ ఆడాలనే భావించి ఉంటాడు. కొద్దిగా మరో అడుగు వేస్తే పంజాబ్‌పై సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో బలంగా క్రీజ్‌లోకి వచ్చి ఉంటాడు. కానీ అక్కడ జరిగింది మ్యాక్సీ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడం. కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్.. ఆడిన తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ హర్‌ప్రీత్ బ్రార్ వేసిన అద్భుతమైన బంతికి మ్యాక్స్‌వెల్ క్లీన్‌బౌల్డ్ కావాల్సి వచ్చింది. అసలు ఎప్పుడు క్రీజ్‌లోకి వచ్చాం.. ఏం జరిగింది అనే మ్యాక్సీ చూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్సీబీ 62 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులను నిరాశకు గురిచేసింది. పంజాబ్‌పై ప్రతాపం చూపెడతాడనుకుంటే, గోల్డెన్ డక్ అయ్యాడేంటని ఆర్సీబీ ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. ప్రతీకారం తీర్చుకుందామనే ఆశ ఆవిరి కావడంతో మ్యాక్సీ ఎలా వచ్చాడో అలానే పెవిలియన్ చేరాడు. ఇది ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య తొలి అంచె మ్యాచ్. ఇక రెండో అంచె మ్యాచ్ గురువారం(మే6వ తేదీ)న ఇదే వేదికలో జరగనుంది. మరి అప్పుడైనా మ్యాక్సీ మెరిసి పంజాబ్‌కు షాకిస్తాడో లేదో చూడాలి. ఇక్కడ చదవండి: డానియల్‌కు ఆర్సీబీ వార్నింగ్.. ఆ వీడియో తీసేశారు! ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా విలియమ్సన్ -
ఐపీఎల్ వేలం: అందరి కళ్లు అతనిపైనే..
-
ఐపీఎల్ వేలం: అందరి కళ్లు అతనిపైనే..
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలం కొద్దిసేపట్లో మొదలుకానుంది. వేలంలో 125 మంది విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా అందరి కళ్లు మాత్రం ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్‌పైనే ఉన్నాయి. ప్రస్తుతం మలాన్ టీ20 ప్రపంచ నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత కొద్దికాలంగా టీ20 మ్యాచ్‌ల్లో రికార్డు లెవల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన మలాన్ 19 టీ20 మ్యచ్‌లాడి 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్‌తో పాటు మిగతా లీగ్‌ల్లోనూ మలాన్ తన జోరును కొనసాగించాడు. దీంతో మలాన్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈసారి ఐపీఎల్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. మలాన్‌తో పాటు ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 2019 డిసెంబర్లో జరిగిన వేలంలో కమిన్స్ తర్వాత మ్యాక్స్‌వెల్‌కు అత్యధిక ధర పలికిన సంగతి తెలిసిందే. మ్యాక్స్‌వెల్‌ను 10.75 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్లో మాత్రం మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 13 మ్యాచులాడిన మ్యాక్సీ 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్‌ను రిలీజ్ చేసింది. అయితే టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లోనూ మ్యాక్స్‌వెల్ దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. దీంతో మ్యాక్సీ మరోసారి వేలంలో ఫెవరెట్ ఆటగాడిగా మారిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీ లాంటి జట్లు మ్యాక్స్‌వెల్‌పై ఎన్ని కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్‌పై కూడా మంచి అంచనాలే ఉండడంతో అతనికి మంచి ధర పలికే అవకాశం ఉంది. వీరితో పాటు మొయిన్ అలీ(ఇంగ్లండ్), కైల్ జేమిసన్ (న్యూజిలాండ్)లకు కూడా వేలంలో మంచి ధర దక్కనుంది. చదవండి: 10 కోట్లకు కొంటే ఆడలేదు.. ఇప్పుడేమో ఫేవరెట్! -
మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే
ముంబై : ఐపీఎల్ 2021కి సంబంధించి మినీ వేలానికి సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టును ప్రకటించాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్లను ప్రకటించింది. కింగ్స్ ప్రకటించిన రిలీజ్ జాబితాలో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున 13 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతున్న వేళ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచి అవకాశాలు కల్పించినా తన ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు మ్యాక్సీ ప్రదర్శనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019 డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లు పెట్టి మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పంత్ నిరాశకు లోనయ్యాడు తాజాగా కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ మ్యాక్స్‌వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టైరిస్ మాట్లాడుతూ.. 'మాక్స్‌వెల్‌కు ఈసారి జరగబోయే ఐపీఎల్ వేలంలో ఆశించినంత ధర రాకపోవచ్చు... కానీ రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని ఒక్క జవాబుతో చెప్పాలనుకుంటున్నా.. ఏ ఆటగాడైనా సరే వేలంలో 10 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోతే.. వాళ్ల తలలకు కొమ్ములు వస్తాయి.. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే నిరుపితమైంది. ఒక ఆటగాడి ప్రదర్శనకు వేలంలో ఎక్కువ ధర ఇస్తే బాగుంటుంది.. కానీ అతని అంతర్జాతీయ ఆటతీరు చూసి మాత్రం తీసుకోవద్దని నా సలహా. ఈ విషయం ఫ్రాంచైజీలు తెలుసుకుంటే రానున్న వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కనీస మద్దుత ధరకే ఎక్కువ అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్స్‌వెల్ ఏనాడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరచలేదు. గత ఐదారేళ్లుగా మ్యాక్సీ ఐపీఎల్ ఆడుతున్నా.. 2014 మినహా ఏనాడు చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఒకవేళ ఏ జట్టైనా అతన్ని కొనుగోలు చేసినా .. మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయకపోతే ఆయా జట్టు మేనేజ్మెంట్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.' అంటూ అభిప్రాయపడ్డాడు. చదవండి: ‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’ -
'ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు'
షార్జా : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ పంజాబ్ తరపున 552 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికేలా చేసింది. అంతేకాదు.. 2017లో మళ్లీ కింగ్స్ పంజాబ్ జట్టుకు మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఇప్పుడు అదే మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ వేలంలో రూ. 10.5 కోట్లు పెట్టి కొంటే ఐపీఎల్ 13వ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. (చదవండి : కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్) అయితే మ్యాక్సీ ఐపీఎల్‌కు రాకముందు ఇంగ్లండ్ సీజన్లో తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. వన్డే సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 108 పరుగులు చేసి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తీరా ఐపీఎల్‌కు వచ్చేసరికి మ్యాక్స్‌వెల్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. కింగ్స్ పంజాబ్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన మ్యాక్సీ కేవలం 58 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు మాక్స్వెల్ స్థానంలో క్రిస్‌గేల్‌ను ఆడించాలని.. లేకపోతే పంజాబ్ తీవ్రంగా నష్టపోతుదంటూ సీనియర్లు విమర్శించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మ్యాక్స్‌వెల్ తనకు పూర్తి క్లారిటీ ఉందని పేర్కొన్నాడు. (చదవండి : ఆ టోపీలకు విలువ ఇవ్వను: అశ్విన్) 'ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్‌ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు ముందు.. ఎవరు వెనుక అనే దానిపై స్పష్టత ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ జట్టు.. అందునా ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపు ఒకే జట్టును ఆడిస్తారు. కానీ ఐపీఎల్లో అలా ఉండదు. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్ మారుతూ వస్తుంది. అందువల్లే నా ప్రదర్శనలో తేడా కనిపిస్తుంది. ప్రస్తుత పంజాబ్ జట్టులో మొదటి నాలుగు స్థానాల తర్వాతే నేను బ్యాటింగ్‌కు దిగుతున్నా.. ఇప్పటికైతే టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం లేదు.. దీంతో ముందున్న నలుగురు బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే నా పాత్ర. కానీ నేను ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు. కానీ యూఏఈ పిచ్‌లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయి. ఆసీస్ తరఫున మంచి ప్రదర్శన చేసిన అనంతరం ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయకపోవడం బాధ కలిగిస్తుంది. కానీ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని.. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమే.. అందకు నన్ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం మాత్రం ఒప్పుకోను.' అని చెప్పుకొచ్చాడు. కాగా పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ పంజాబ్‌కు కీలకమనే చెప్పొచ్చు. గురువారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో క్రిస్ గేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. (చదవండి : ‘ఈ సీజన్లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’) -
'పాపం పంజాబ్.. మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లీగ్ ప్రారంభానికి ముందు కింగ్స్‌పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. ఎందుకంటే ఆ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉంది. దీనికి తోడు మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన మ్యాచ్‌లో కింగ్స్ ఓడిపోయినా ఆకట్టుకుంది.ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిచినంత పని చేసిన పంజాబ్ తీరా సూపర్ ఓవర్లో రబడ దాటికి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి భోణీ కొట్టింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. (చదవండి : సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!) రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. దీంతో ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ఆటతీరు మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇలాగే కొనసాగితే మొదట లీగ్ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలుస్తుంది. అయితే కింగ్స్ పంజాబ్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1,5,13,11,11*, 7 పరుగులు చూస్తే అసలు మనం చూస్తున్నది మ్యాక్స్‌వెల్ ఆటేనా అనే అనుమానం కలుగుతుంది. గురువారం ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టి గేల్‌ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కింగ్స్ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మ్యాక్స్ వెల్ ఆటతీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రోహిత్ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే) 'పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది. కానీ అతను మాత్రం స్కోర్లు చేయలేక వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కెప్టెన్ రాహుల్‌కు విదేశీ ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. నికోలస్ పూరన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరు రాణించడం లేదు. అందులో మ్యాక్స్‌వెల్ కూడా ఒకడు. అయితే 10.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్న మ్యాక్స్‌వెల్ నుంచి పంజాబ్ ఆశించడంలో తప్పు లేదు. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నందుకు పంజాబ్‌కు అతను కీలకం కావచ్చు.. కానీ మ్యాక్స్ విఫలమవుతున్న వేళ పక్కనైనా పెట్టాలి లేదా మరో మ్యాచ్ అవకాశమైనా ఇవ్వాలి. ఒకవేళ మ్యాక్స్‌వెల్ వద్దనుకుంటే గేల్‌కు అవకాశమిచ్చి చూడాలి. గేల్ మెరుస్తాడని కాదు కాని ఒకసారి అవకాశమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే ఏంటి ఆడకపోతే పక్కన పెట్టాల్సిందే. కింగ్స్ కెప్టెన్‌గా రాహుల్ మ్యాక్స్‌వెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను ఆడించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం చెప్పాడు. ఒకవేళ గేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నాకు తెలిసి పంజాబ్ జట్టు అతన్ని మూడు లేదా నాలుగు స్థానాల్లో ఆడించాల్సి ఉంటుంది. మరి పంజాబ్ తలరాత తర్వాతి మ్యాచ్ నుంచైనా మారుతుందేమో చూడాలంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(శనివారం) కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') -
'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్‌తో ఎంగేజ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్మెంట్ జరిపారు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు దుబాయ్ వెళ్లిన మ్యాక్స్‌వెల్‌ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే రామన్ షేర్ చేసిన ఫోటోలపై ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : 'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం') 'వినీ రామన్.. మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై వినీ రామన్ ఘాటుగానే స్పందించింది. 'వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను సాధారణంగా పట్టించుకోను. కానీ తాజాగా వచ్చిన కామెంట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం. నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. అది నాకు మ్యాక్స్‌వెల్‌లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినీ రామన్ కామెంట్స్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.(చదవండి : వాటే స్పెల్ రషీద్..) కాగా గతేడాది అక్టోబర్‌లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని అందుకే క్రికెట్‌కు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు మ్యాక్స్‌వెల్ సంచలన ప్రకటన చేశాడు.అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మ్యాక్స్ కాసేపటికే ఈ ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మ్యాక్స్‌వెల్ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు వినీ రామన్ అతనికి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. వినీ రామన్ సలహాలతో మ్యాక్స్ తన ఒత్తిడిని అధిగమించి 2019-20 బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఆడుతున్న మ్యాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపునఆడుతున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.