'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు' | Glenn Maxwell Fiancee Vini Raman Fires On Man Who Wrote Nasty Things | Sakshi
Sakshi News home page

'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు'

Published Wed, Sep 30 2020 5:30 PM | Last Updated on Wed, Sep 30 2020 9:35 PM

Glenn Maxwell Fiancee Vini Raman Fires On Man Who Wrote Nasty Things - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్‌ వినీ రామన్‌తో ఎంగేజ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్‌మెంట్‌ జరిపారు. తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆడేందుకు దుబాయ్‌ వెళ్లిన మ్యాక్స్‌వెల్‌ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్‌ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.‌ అయితే రామన్‌ షేర్‌ చేసిన ఫోటోలపై ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : 'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం')

'వినీ రామన్‌.. మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ కామెంట్స్‌ చేశాడు. దీనిపై వినీ రామన్‌ ఘాటుగానే స్పందించింది. 'వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను సాధారణంగా పట్టించుకోను. కానీ తాజాగా వచ్చిన కామెంట్‌ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి.

ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం.  నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. అది నాకు మ్యాక్స్‌వెల్‌లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని  ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినీ రామన్‌ కామెంట్స్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.(చదవండి : వాటే స్పెల్‌ రషీద్‌..)

కాగా గతేడాది అక్టోబర్‌లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని అందుకే క్రికెట్‌కు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన చేశాడు.అడిలైడ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన మ్యాక్స్‌ కాసేపటికే ఈ ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మ్యాక్స్‌వెల్‌ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు వినీ రామన్‌ అతనికి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

వినీ రామన్‌ సలహాలతో మ్యాక్స్‌ తన ఒత్తిడిని అధిగమించి 2019-20 బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరపున​ఆడుతున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్‌ పంజాబ్‌ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement