Vini Raman
-
ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ!
జీవనసహచరులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం మరింత సులువవుతుంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. అందుకే.. అన్ని వేళలా అండగా ఉండే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదంటారు. గ్లెన్ మాక్స్వెల్- వినీ రామన్ దంపతులు కూడా ఆ కోవకే చెందుతారు. గ్లెన్ మాక్స్వెల్.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌గా క్రికెట్ ప్రపంచానికి సుపరిచితం. మేటి జట్టులో ఆల్‌రౌండర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న ఈ విక్టోరియా వీరుడు ఒకానొక సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడు. చెయ్యి విరగ్గొట్టుకోవాలని చూశా ‘‘నేను చేసిన పనులన్నీ.. నేను చేయనివిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నా. వరల్డ్‌కప్ సమయంలో నా చెయ్యి విరగ్గొట్టుకునేందుకు ట్రై చేశా. నాకు బ్రేక్ కావాలి. ఎవరిని చూసినా ఎందుకో కోపం వస్తోంది. నిజానికి అది నా మీద నాకున్న కోపం ప్రపంచకప్ ఈవెంట్లో నేను సరిగ్గా ఆడలేకపోయినందుకు వచ్చిన విసుగు. దీని నుంచి తొందరగానే బయటపడదామనుకున్నాను. కానీ.. అనుకున్నంత సులువేమీ కాదు’’ అంటూ తాను డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని 2019లో తొలిసారి బయటపెట్టాడు మాక్సీ. శ్రీలంకతో టీ20 సిరీస్ మధ్యలోనే జట్టును వదిలివెళ్లాడు. ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు’’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మాక్సీ నిర్ణయానికి మద్దతునిచ్చింది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా.. ‘‘ముందు ఆరోగ్యం.. ఆ తర్వాతే ఆట’’ అని చెప్పకనే చెప్పిన తన స్నేహితుడికి అండగా నిలిచాడు. మనసుకు దగ్గరైన మనిషి చెబితేనే బయట నుంచి ఎవరు ఎంతగా మద్దతునిచ్చినా మనసుకు దగ్గరైన మనిషి చెప్పే మాటలే ఎక్కువ సాంత్వన చేకూరుస్తాయి. మాక్సీ సమస్యను ముందుగానే పసిగట్టింది వినీ(అప్పటికి తను మాక్సీ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే). ఒత్తిడి నుంచి అతడిని బయటపడేసే మార్గం గురించి ఆలోచించింది. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదని.. స్పెషలిస్టును కలవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీలేదంటూ మానసిక ధైర్యాన్నిచ్చింది. మాక్సీ ఆమె మాటను కాదనలేకపోయాడు. గుండెల మీది భారం దిగిపోయింది వినీ చెప్పినట్లు చేశాడు. గుండె మీది నుంచి పెద్ద కుంపటి దించుకున్నట్లయింది. నెలలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాక్సీ మళ్లీ మునుపటిలా చలాకీగా మారిపోయాడు. పునరాగమనంలో తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానగణాన్ని ఖుషీ చేస్తున్నాడు. తాజాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆరంభంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయిన్పటికీ బంతితో ప్రభావం చూపగలిగాడు. అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో మెరిసిన మాక్స్వెల్.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో డబుల్ సెంచరీ బాదాడు. మంత్రదండంతో మాయ చేసినట్లు తన చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు నిలబడిన చోట నిలబడినట్లే.. మంత్రదండంతో ఏదో మాయ చేసినట్లు పరుగుల వరద పారించాడు. గాయం కారణంగా అంతకు ముందు మ్యాచ్‌కు దూరమైన మాక్సీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఊహించగలరు! ఓడిపోతుందన్న మ్యాచ్‌ను గెలిపించి ఐదుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను తాజా ఎడిషన్‌లో ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన తీరు ముచ్చటగొలిపింది. తన భర్తకు సంబంధించిన ఆనంద క్షణాలను ఫోన్ కెమెరాతో బందించిన వినీ.. ‘‘100 కాదు.. 201*.. భావోద్వేగాల సమాహారం’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోను పంచుకుంది. ఈ ఒక్క క్యాప్షన్ చాలు.. మాక్సీ డబుల్ సెంచరీ తమకు కేవలం ఒక నంబర్ కాదు.. ఓ ఎమోషన్ అని చెప్పడానికి!! భారత సంతతి అమ్మాయి.. తమిళనాడు ఆడపడుచు తమిళనాడుకు చెందిన వెంకట్ రామన్, విజయలక్ష్మీ రామన్ దంపతులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మెల్బోర్న్లో నివాసం ఏర్పరచుకున్న ఈ ఇండియన్ కపుల్‌కి 1993, మార్చి 3న వినీ జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వినీ ఫార్మాసిస్ట్‌గా కెరీర్ నిర్మించుకుంది. తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులతో ప్రయాణాలు చేయడం వినీకెంతో ఇష్టం. అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో మాక్స్వెల్ ఆమెకు పరిచయమయ్యాడు. రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న తర్వాత మాక్సీనే వినీ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన మనసులో ఉన్న మాట.. కోరుకున్నవాడి నోటి నుంచి.. బయటకు వస్తే ఏ అమ్మాయికి మాత్రం సంతోషంగా ఉండదు. వినీ కూడా అంతే.. ఇష్టసఖుడి ప్రతిపాదనను నవ్వుతూ అంగీకరించింది వినీ. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను పెళ్లిపీటలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అలా 2022లో క్రిస్టియన్, హిందూ వివాహ పద్ధతిలో మాక్స్వెల్- వినీ రామన్ వివాహం జరిగింది. గర్భస్రావం.. మానసిక సంఘర్షణ తమ ప్రేమకు గుర్తుగా ముద్దూమురిపాలు మూటగట్టే చిన్నారి రాబోతుందనే వార్త తెలిసి నూతన జంట ఆనందంలో తేలిపోయింది. కానీ.. దురదృష్టవశాత్తూ వినీకి గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆమె కుంగిపోకుండా అండగా నిలబడ్డాడు మాక్సీ. మానసిక ధైర్యం కోల్పోకుండా కంటికి రెప్పలా కాచుకున్నాడు. ఆ విషాదం తర్వాత.. లోగాన్ మెవెరిక్ రూపంలో వారి జీవితాల్లో మళ్లీ కొత్త వసంతాలు చిగురించాయి. లోగాన్ మరెవరో కాదండి.. మాక్సీ- వినీల ముద్దుల కుమారుడు. రెయిన్బో బేబీ రాకతో ఇక ముందు తల్లిదండ్రులం అవుతామో లేదోనన్న భయాలతో ఆ దంపతుల మనసులో చెలరేగిన అలజడిని.. తుఫాన్ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సులా మాయం చేసిన బుజ్జాయి. (రెయిన్ బో బేబీ- గర్భస్రావం తర్వాత జన్మించిన బిడ్డ). ఈ ఏడాది సెప్టెంబరు 11న జన్మించాడు. నాన్నకు ఆట నుంచి కాస్త విరామం దొరకగానే ఎంచక్కా అతడి గుండెల మీద వాలి హాయిగా నిద్రపోతాడు లోగాన్!! ఇక ఒకరికోసం ఒకరు అన్నట్లు జీవిస్తున్న వినీ- మాక్సీ తమ గారాల పట్టిని నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతూ లాలిస్తూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా!? -సుష్మారెడ్డి యాళ్ల -
ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత..
RCB Star Maxwell Wife Vini RamanTamil Baby Shower: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, ఆర్సీబీ స్టార్ గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. భార్య వినీ రామన్‌తో కలిసి ఈ ఏడాది మేలో ఈ శుభవార్తను పంచుకున్నాడు మాక్సీ. రెయిన్ బో బేబీ రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారీ దంపతులు. ఈ క్రమంలో మాక్సీ సతీమణి వినీ రామన్ తాజాగా తన సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ‘వలైకాప్పు’ వేడుకకు సంబంధించిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. సంప్రదాయ పద్ధతిలో ఇందులో.. నిండైన చీరకట్టులో.. చేతులకు గాజులు, మెడలో నగలు వేసుకుని.. నుదుటిన కుంకుమ బొట్టు ధరించి.. భర్తను ఆప్యాయంగా హత్తుకున్న వినీ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉన్నా సరే మన సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోకుండా పుట్టబోయే బిడ్డకోసం ఇంత అందమైన వేడుక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పలువురు వినీ మాక్స్‌వెల్‌ను అభినందిస్తున్నారు. ఆ విషాదం తర్వాత కాగా తమిళనాడు మూలాలున్న వినీ రామన్.. గ్లెన్ మాక్స్‌వెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది మార్చి 18న వీరి పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది. ఇక ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో మాక్సీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మేలో ముగిసిన తాజా ఎడిషన్‌లో ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ 14 ఇన్నింగ్స్ ఆడి 400 పరుగులు సాధించాడు. కాగా గతంలోనూ వినీ రామన్ గర్భవతి అయినప్పటికీ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు రాకుండానే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె గర్భం దాల్చడంతో రెయిన్బో బేబీ(గర్భస్రావం లేదంటే తల్లి కడుపులోనే శిశువు చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డ) అంటూ మాక్సీ దంపతులు గుడ్‌న్యూస్ షేర్ చేయడం విశేషం. చదవండి: 'మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు' -
తండ్రి కాబోతున్న మ్యాక్స్‌వెల్.. 'రెయిన్బో బేబీ' జన్మించబోతోందంటూ..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడి భార్య వినీ రామన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్కానింగ్ రిపోర్ట్‌తో పాటు చిన్నారి డ్రెస్ ఫోటోను వినీ రామన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా గతేడాది చెన్నైకి చెందిన వినీ రామన్‌ను హిందూ సంప్రదాయంలో మాక్సీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం బీజీబీజీగా ఉన్నాడు. వినీ రామన్ కూడా తన భర్తతో పాటు ఇండియాలోనే ఉంది. "మాక్సీ, నేను మా రెయిన్బో బేబీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జన్మనివ్వనున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ఇలాంటి సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఇటువంటి పోస్టులు చూసి ఎంత బాధపడతారో నాకు బాగా తెలుసు. ఆ బాధను మేము అనుభవించాం. సంతానలేమితో బాధపడుతున్న జంటలకు మా ప్రేమను తెలియజేస్తున్నాం" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వినీ రమన్ రాసుకొచ్చింది. రెయిన్బో బేబీ అంటే? ఈ మధ్య కాలంలో రెయిన్బో బేబీ అనే పదం తరచుగా వింటూ ఉన్నాం. అస్సలు ఈ రెయిన్బో బేబీ అంటే ఎంటో తెలుసుకుందాం. గర్భస్రావం లేదా ఇతర కారణాలతో తల్లి కడుపులోనే బేబీ చనిపోయిన తర్వాత పుట్టబోయే బిడ్డను రెయిన్బో బేబీ అని అంటారు. చదవండి: #Yashasvi Jaiswal: వాట్ ఏ టాలెంట్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే: విరాట్ కోహ్లి View this post on Instagram A post shared by Vini Maxwell (@vini.raman) -
IPL 2022: ఆర్సీబీకి శుభవార్త.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు!
Good News For RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియా విధ్వసంకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వీలైనంత త్వరగా భారత్‌కు రానున్నాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆర్సీబీతో కలవనున్నాడు ఈ కొత్త పెళ్లికొడుకు. కాగా మాక్సీ ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను అతడు మార్చి 18న పెళ్లాడాడు. ఆ తర్వాత వినీ కుటుంబ ఆచారం ప్రకారం తమిళ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను మనువాడాడు. తమ జీవితంలోని ఈ ముఖ్య ఘట్టం నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభం మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఇక వివాహానంతర వేడుకలు ముగిసిన అనంతరం మాక్సీ భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తన పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లకు సంబంధించిన ఫొటోలను మాక్స్వెల్ షేర్ చేశాడు. సతీమణి వినీతో కలిసి ఇండియాకు వస్తున్నట్లు హింట్ ఇచ్చాడు ఈ ‘తమిళనాడు అల్లుడు’. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మాక్సీ రాకతో ఆర్సీబీ మరింత బలం పుంజుకోనుంది. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన డుప్లెసిస్ బృందం.. బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి బోణీ కొట్టింది. ఏప్రిల్ 5న రాజస్తాన్ రాయల్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది. చదవండి: IPL: క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..! -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన గర్ల్‌ఫ్రెండ్.. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విషయాన్ని మ్యాక్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. రింగులు మార్చుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ''లవ్ అనే పదాన్ని ఈరోజుతో పూర్తి చేశాను.. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభం'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అటు మ్యాక్సీ గర్ల్‌ఫ్రెండ్ వినీ రామన్ కూడా ఇన్‌స్టాలో స్పందించింది. ''18.03.2022.. జీవితంలో మరిచిపోలేని రోజు. ఇక్కడి నుంచి మా కొత్త జీవితం ప్రారంభం కానుంది.'' అని రాసుకొచ్చింది. ఇక మ్యాక్స్‌వెల్ వివాహం సందర్బాన్ని పురస్కరించుకొని ట్విటర్ వేదికగా ఆర్సీబీ శుభాకాంక్షలు తెలిపింది. మ్యాక్సీ, వినీ రామన్ పెళ్లిపై ఆర్సీబీ ఫ్యామిలీ సంతోషంగా ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరికి ఆల్ ది బెస్ట్.. మీ జీవితం హయిగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపింది. ఇక నాలుగేళ్ల కిందట పరిచయమైన ఈ ఇద్దరు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఫిబ్రవరి 2020లో మ్యాక్సీ, వినీ రామన్‌లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి పెళ్లిపత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినీ రామన్ స్వస్థలం తమిళనాడు కావడంతో తమిళ భాషలో పెళ్లి పత్రిక లీక్ కావడం అందరిని ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయం పట్ల మ్యాక్స్వెల్కున్న అభిమానాన్ని అందరూ మెచ్చుకున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్‌ను రూ.11 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలోనే మ్యాక్సీ పాకిస్తాన్ టూర్‌కు దూరంగా ఉన్నాడు. మరో వారంలో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుండడంతో మ్యాక్సీ నేరుగా ఆర్సీబీ జట్టుతో కలవనున్నాడు. చదవండి: Glenn Maxwell Marriage: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్బోర్న్లో గ్లెన్ మాక్స్వెల్ పెళ్లి Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' The RCB family is incredibly happy for @vini_raman and @Gmaxi_32 on the beginning of this new chapter in their lives. 🥳🤩 Wishing you both all the happiness and peace, Maxi! ❤️🙌🏻 pic.twitter.com/RxUimi3MeX — Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2022 -
Glenn Maxwell: ఆ విషయం గురించి అతడు చెప్పేంత వరకు తెలియదు!
Glenn Maxwell Wedding: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన విని రామన్‌ను అతడు వివాహమాడనున్నాడు. మెల్బోర్న్లో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా మాక్సీ- వినీ పెళ్లి కార్డు ఇదేనంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా కార్డు ఆన్లైన్లో లీక్ కావడం పట్ల మాక్స్వెల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వేదిక ఎక్కడో తెలిసిపోవడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాపోయాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 అనంతరం ఫాక్స్ క్రికెట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో నాతో పాటు ఆడిన ఓ క్రికెటర్ నా పెళ్లికార్డుకు సంబంధించిన ఫొటో పంపించాడు. తమిళ్లో ఉన్న లేఖను పంపాడు. ఇందులో అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంది. దురదృష్టవశాత్తూ ఇది ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కాబట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే మా వివాహ వేడుకను భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ 11 కోట్లు వెచ్చించి మాక్సీని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి నేపథ్యంలో అతడు పాకిస్తాన్ టూర్‌కు దూరం కానున్నాడు. అదే విధంగా ఆరంభ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. చదవండి: Aus Vs Sl- Mitchell Starc: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి -
'మ్యాక్స్‌వెల్‌ను ఇష్టపడింది నేను.. మీరు కాదు'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్‌తో ఎంగేజ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్మెంట్ జరిపారు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు దుబాయ్ వెళ్లిన మ్యాక్స్‌వెల్‌ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే రామన్ షేర్ చేసిన ఫోటోలపై ఒక వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : 'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం') 'వినీ రామన్.. మానసికంగా దెబ్బతిన్న ఒక తెల్ల వ్యక్తిని మీరు ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా' అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై వినీ రామన్ ఘాటుగానే స్పందించింది. 'వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అయిపోవాలని కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వారి గురించి నేను సాధారణంగా పట్టించుకోను. కానీ తాజాగా వచ్చిన కామెంట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం. నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. అది నాకు మ్యాక్స్‌వెల్‌లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినీ రామన్ కామెంట్స్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.(చదవండి : వాటే స్పెల్ రషీద్..) కాగా గతేడాది అక్టోబర్‌లో తాను మానసిక సమస్యలతో సతమతమవుతున్నాని అందుకే క్రికెట్‌కు కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు మ్యాక్స్‌వెల్ సంచలన ప్రకటన చేశాడు.అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మ్యాక్స్ కాసేపటికే ఈ ప్రకటన చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మ్యాక్స్‌వెల్ మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు వినీ రామన్ అతనికి ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. వినీ రామన్ సలహాలతో మ్యాక్స్ తన ఒత్తిడిని అధిగమించి 2019-20 బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరపున బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఆడుతున్న మ్యాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపునఆడుతున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
రిలేషన్షిప్ సీక్రెట్స్ చెప్పిన విని రామన్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్ విని రామన్‌తో ఇప్పటికే అతడి నిశ్చితార్థం జరిగింది. గత నెల 17వ తేదీన భారతీయ సాంప్రదాయంలో రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నారు మ్యాక్సీ-వినీలు. అయితే గతేడాది మానసిక సమస్యలతో సతమతమైన క్షణంలో తనకు వినీ రామనే ధైర్యం చెప్పిందన్నాడు మ్యాక్సీ. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడమని చెప్పి తన సమస్యను దూరంలో చేయడంలో కృషి చేసిన తొలి వ్యక్తి వినీ రామనే అని చెప్పుకొచ్చాడు. (ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు: మ్యాక్సీ) తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కాబోయే భర్త మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు వినీ రామన్. దానికి క్యాప్షన్‌గా ‘ప్రి ఐసోలేషన్’ అని రాసుకొచ్చారు. అదే సమయంలో ఎడమవైపుకు స్వైప్ చేస్తే తమ రిలేషన్షిప్ గురించి ఎంత చేశానో అర్థమవుతుంది అని పేర్కొన్నారు. తాము తొలిసారి ఎక్కడ కలిశాం అనే విషయం మొదలుకొని, తమలో అత్యంత కాంపిటేటివ్‌గా ఉండే వ్యక్తి ఎవరు అనే విషయాలను షేర్ చేసుకున్నారు. 2013 డిసెంబర్లో మెల్బోర్న్ స్టార్స్ ఈవెంట్లో తొలిసారి కలిశామని, తమ ప్రేమ పట్టాలెక్కడానికి నాలుగేళ్ల పట్టిందని వినీ రామన్ తెలిపారు. తొలుత మ్యాక్సీనే తనకు ప్రపోజ్ చేశాడని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా తమ సీక్రెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు వినీ రామన్. View this post on Instagram pre-isolation ❤️ swipe left to see how much I contribute to this relationship... 😂 A post shared by VINI (@vini.raman) on Apr 10, 2020 at 4:44am PDT -
‘ప్రపోజ్ చేయడం అంత ఈజీ కాదు బ్రదర్’
మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమను ఎలా వ్యక్త పరచాలి? ఇలా ఆలోచిస్తూ, భయపడుతూ, తటపటాయిస్తూ తన ప్రేయసి/ప్రేమికుడిపై ఉన్న ప్రేమను తమ మనసులోనే దాచిపెట్టుకుంటారు కొందరు. ప్రపోజ్ చేస్తే ఉన్న ఈ ఫ్రెండ్ షిప్ కూడా పోతుందని కొందరు భయపడితే.. ఒకవేళ నో చెబితే ఏమాత్రం తట్టుకోలేనని మరికొంతమంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైందని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజాగా పేర్కొన్నాడు. గతనెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితురాలైన వినీకి తన ప్రేమను ఎలా వ్యక్త పరచాలని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు. ‘మనం ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంత సులభం కాదు. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్‌కు గురయ్యానో అంతకంటే ఎక్కువ టెన్షన్ వినీకి ప్రపోజ్ చేసేటప్పుడు గురయ్యాను. ఓ సమయంలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే ప్రపంచకప్ ఫైనల్ ఆడటమే సులభం అనిపించింది. మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. నేను గతంలో మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు అండగా నిలిచింది. నేనేంటో నాకంటే తనకే తెలుసు. దీంతో వినీనే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలి నిశ్చయించుకున్నాను. అయితే నా ప్రేమను వ్యక్త పరిచే సమయంలో మూడు సార్లు విఫలమయ్యాను. నా ప్రేమను వినీకి చెప్పడానికి నాలుగు ప్రణాళికలు రచించాను. ప్లాన్-ఏలో భాగంగా తనను ఓ పార్క్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్ద వాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి నన్ను ఇబ్బందికి గురి చేసింది. దీంతో ప్లాన్ బిలో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి అప్పటికే నా వెంట తెచ్చుకున్న రింగ్‌ను తన చేతికి తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నా? కానీ అక్కడ నా టీమ్‌మేట్స్‌ను చూసి ప్లాన్ బి అమలు చేయలేకపోయా. దీంతో ప్లాన్ సిలో భాగంగా ఎర్రటి గులాబి పూల మధ్య నా ప్రేమను ఆమెకు చెబుదామని రోజ్ పార్క్‌కు తీసుకెళ్లాను. అక్కడా కుదరలేదు. దీంతో ప్లాన్ డి తప్పక అమలు చేయాల్సిందేనని భావించాను. పార్క్‌కు వినీని రమ్మని చెప్పాను. ఆమె వచ్చిన వెంటనే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి నా లవ్ ప్రపోజ్ చేశాను. ఆ సమయంలో నా గుండె వందరెట్లు వేగంగా కొట్టుకుంది.. నా చేతులు వణికాయి. అయితే ఊపిరి తిరిగొచ్చిన అంశం ఏంటంటే నా ప్రేమను వినీ ఒప్పుకోవడం. ఆ మధుర క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి’అంటూ మ్యాక్స్‌వెల్ తన ప్రపోజ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. View this post on Instagram Last week my favourite person asked me to marry him 😍💍 #YES A post shared by VINI (@vini.raman) on Feb 26, 2020 at 2:51am PST View this post on Instagram Last night we celebrated our Indian engagement and I gave @gmaxi_32 a little teaser of what the wedding will be like 🥰 Shout out to both of our incredible families & all our friends who came to celebrate with us on such short notice - we are so grateful to be surrounded by some pretty amazing people ❤️ Can’t wait to get our hands on more photos from @shevan_j_photography 📸 H&M - who else but ... @lajeenartistry Venue - @lincoln_of_toorak Catering - @tandooriflames Mandap - @rupalis_mandaps_melbourne Henna - @fadziiesmehndiandbeauty Lehgna - @gbcreations_ Arm candy - @gmaxi_32 💕 A post shared by VINI (@vini.raman) on Mar 14, 2020 at 2:47am PDT చదవండి: మ్యాక్స్ అన్ వెల్ మ్యాక్స్‌వెల్ ‘భారతీయ నిశ్చితార్థం’ -
పెళ్లికొడుకు కాబోతున్న క్రికెటర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. భారత సంతతి యువతి విని రామన్‌ను అతడు పెళ్లాడనున్నాడు. మెల్బోర్న్కు చెందిన విని రామన్‌తో చాలా కాలంగా అతడు ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. విని రామన్ చేతికి తొడిగిన ఉంగరంతో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: మ్యాక్స్‌వెల్ మళ్లీ వచ్చాడు) మెల్బోర్న్లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం బయట ప్ర్రపంచానికి తెలిసింది. గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్ అప్పట్లో వెల్లడించాడు. భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ షాన్ టైట్.. మషూమ్ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.