మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమను ఎలా వ్యక్త పరచాలి? ఇలా ఆలోచిస్తూ, భయపడుతూ, తటపటాయిస్తూ తన ప్రేయసి/ప్రేమికుడిపై ఉన్న ప్రేమను తమ మనసులోనే దాచిపెట్టుకుంటారు కొందరు. ప్రపోజ్ చేస్తే ఉన్న ఈ ఫ్రెండ్ షిప్ కూడా పోతుందని కొందరు భయపడితే.. ఒకవేళ నో చెబితే ఏమాత్రం తట్టుకోలేనని మరికొంతమంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైందని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజాగా పేర్కొన్నాడు. గతనెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితురాలైన వినీకి తన ప్రేమను ఎలా వ్యక్త పరచాలని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు.
‘మనం ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంత సులభం కాదు. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్‌కు గురయ్యానో అంతకంటే ఎక్కువ టెన్షన్ వినీకి ప్రపోజ్ చేసేటప్పుడు గురయ్యాను. ఓ సమయంలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే ప్రపంచకప్ ఫైనల్ ఆడటమే సులభం అనిపించింది. మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. నేను గతంలో మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు అండగా నిలిచింది. నేనేంటో నాకంటే తనకే తెలుసు. దీంతో వినీనే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలి నిశ్చయించుకున్నాను. అయితే నా ప్రేమను వ్యక్త పరిచే సమయంలో మూడు సార్లు విఫలమయ్యాను. నా ప్రేమను వినీకి చెప్పడానికి నాలుగు ప్రణాళికలు రచించాను.
ప్లాన్-ఏలో భాగంగా తనను ఓ పార్క్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్ద వాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి నన్ను ఇబ్బందికి గురి చేసింది. దీంతో ప్లాన్ బిలో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి అప్పటికే నా వెంట తెచ్చుకున్న రింగ్‌ను తన చేతికి తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నా? కానీ అక్కడ నా టీమ్‌మేట్స్‌ను చూసి ప్లాన్ బి అమలు చేయలేకపోయా. దీంతో ప్లాన్ సిలో భాగంగా ఎర్రటి గులాబి పూల మధ్య నా ప్రేమను ఆమెకు చెబుదామని రోజ్ పార్క్‌కు తీసుకెళ్లాను. అక్కడా కుదరలేదు.
దీంతో ప్లాన్ డి తప్పక అమలు చేయాల్సిందేనని భావించాను. పార్క్‌కు వినీని రమ్మని చెప్పాను. ఆమె వచ్చిన వెంటనే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి నా లవ్ ప్రపోజ్ చేశాను. ఆ సమయంలో నా గుండె వందరెట్లు వేగంగా కొట్టుకుంది.. నా చేతులు వణికాయి. అయితే ఊపిరి తిరిగొచ్చిన అంశం ఏంటంటే నా ప్రేమను వినీ ఒప్పుకోవడం. ఆ మధుర క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి’అంటూ మ్యాక్స్‌వెల్ తన ప్రపోజ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
చదవండి:
మ్యాక్స్ అన్ వెల్
మ్యాక్స్‌వెల్ ‘భారతీయ నిశ్చితార్థం’
Comments
Please login to add a commentAdd a comment